ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధురంధర్ విలన్.. తెలుగులో తొలి సినిమా ఇదే
ధురంధర్ మూవీలో విలన్‌గా మెప్పించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మహాకాళి మూవీతో కావడం విశేషం.
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తన కెరీర్‌లో సూపర్ ఫేజ్ ఎంజాయ్ చేస్తున్నారు. హిందీలో 'ధురంధర్' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అతడు.. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న 'మహాకాళి' (Mahakali) సినిమాలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది.

మహాకాళి సెట్స్‌లో అక్షయ్ ఖన్నా
'హనుమాన్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న తదుపరి మూవీ 'మహాకాళి'. ఈ సినిమాలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న పూజా కొల్లూరు.. అక్షయ్ ఖన్నాతో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
"కృతజ్ఞతలు 2025! నన్ను నా పరిమితులకు మించి కష్టపడేలా చేసి.. కొత్త నన్ను నాకు పరిచయం చేశావు" అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ఇందులో అక్షయ్ ఖన్నా తన ట్రేడ్‌మార్క్ స్మైల్‌తో కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో భూమి శెట్టి 'మహా' అనే ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అక్షయ్ ఖన్నా రోల్ ఏంటనేది సస్పెన్స్ గా ఉంచారు. కానీ అతని పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట.
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' సునామీ
మరోవైపు డిసెంబర్ 5న రిలీజ్ అయిన అక్షయ్ ఖన్నా లేటెస్ట్ హిందీ సినిమా 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అక్షయ్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రిలీజ్ అయ్యాక 4వ వారంలో కూడా ఈ సినిమా జోరు తగ్గలేదు. 27వ రోజు ఇండియాలో రూ. 12.40 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు ఇండియాలో మొత్తం రూ. 766.90 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాకు సీక్వెల్ 'ధురంధర్ 2' మార్చి 19, 2026న పాన్ ఇండియా లెవెల్ లో (తెలుగుతో సహా) రిలీజ్ కానుంది. ఇటు బాలీవుడ్ లో భారీ హిట్స్, అటు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో అక్షయ్ ఖన్నా సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


