అవన్నీ తప్పుడు వార్తలే.. జై హనుమాన్ మూవీ నుంచి వాకౌట్ అయ్యాడనే పుకార్లపై తేజ సజ్జా
ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి నటించిన జై హనుమాన్ చిత్రం నుంచి తేజ సజ్జా వాకౌట్ అయ్యారనే పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఈ యంగ్ హీరో క్లారిటీనిచ్చాడు. హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ హీరోగా కెరీర్ నిర్మించుకుంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన తేజ సజ్జా కెరీర్ స్టార్టింగ్ లోనే ‘హనుమాన్’ లాంటి సినిమాతో ఓ బూస్టప్ దొరికింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాతో తేజ కెరీర్ వేగాన్ని అందుకుంది. అయితే ఈ మూవీ సీక్వెల్ ‘జై హనుమాన్’ సీక్వెల్ నుంచి తేజ తప్పుకొన్నాడనే వార్తలొచ్చాయి. దీనిపై ఈ హీరో రియాక్టయ్యాడు.

తప్పుడు వార్తలే
హనుమాన్ సినిమా సీక్వెల్ జై హనుమాన్ నుంచి తాను తప్పుకొన్నానని వస్తున్న వార్తలపై తేజ సజ్జా స్పందించాడు. ఈ విషయంపై హిందూస్థాన్ టైమ్స్ అతణ్ని సంప్రదించగా.. ‘‘అవన్నీ తప్పుడు వార్తలు’’ అని కొట్టిపడేశాడు తేజ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుంచి దూరం అయ్యే సమస్యే లేదని తేల్చి చెప్పాడు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్న సంగతి తెలిసిందే.
తేజ సజ్జాపై పుకార్లు
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 2024 లో వచ్చిన సూపర్ హిట్ హనుమాన్ సినిమాతో తేజ సజ్జాకు మంచి పేరు దక్కింది. అయితే ఈ యంగ్ హీరో సీక్వెల్ జై హనుమాన్ నుంచి వైదొలిగినట్లు ఇటీవల చాలా చర్చలు జరిగాయి. రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో పలువురు దీనిని నిజమని భావించారు. కానీ తేజ కామెంట్లతో ఇవన్నీ పుకార్లని స్పష్టమైంది.
సోషల్ మీడియాలోనూ
జై హనుమాన్ నుండి వాకౌట్ కావడాన్ని తేజ సజ్జా ఖండించాడు. తేజ ఇకపై హనుమాన్ సీక్వెల్ లో భాగం కాదని ఈ వారం అనేక పోస్ట్ లు, నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలోనూ పీవీసీయూ నుంచి తేజ దూరంగా ఉంటున్నాడనే పోస్టులు కనిపించాయి. కానీ ఇప్పుడు వీటిపై తేజ సజ్జా ఓ క్లారిటీ ఇచ్చేశాడు. జై హనుమాన్ లో హనుమంతుడిగా తేజ సజ్జా నటిస్తున్నాడు.
జై హనుమాన్ గురించి
హనుమాన్ కు సీక్వెల్ గా వస్తున్న మూవీనే జై హనుమాన్. ఇందులో రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 2024 లో హిందూస్థాన్ టైమ్స్ తో తేజ మాట్లాడుతూ.. సీక్వెల్ హనుమంతుడి (దేవుడు, అతని సూపర్ హీరో పాత్ర కాదు) గురించి ఎలా ఉంటుందనే తేజ వ్యాఖ్యానించాడ.
'హనుమంతుడి సీక్వెల్ 'జై హనుమాన్'లో కూడా తాను భాగమవుతానని చెప్పారు. ఈ సినిమా హనుమంతుడి గురించి ఉంటుంది, కానీ నేను దానిలో భాగం అవుతాను'' అని తేజ అన్నాడు.














