అట్లీ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈ డైరెక్టర్ తోనే- బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంబినేషన్- అఫీషియల్ వీడియో

ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఐకాన్ స్టార్ మరో తమిళ డైరెక్టర్ తోనే పని చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అంటున్నారు. భోగి సందర్భంగా ఈ అనౌన్స్ మెంట్ చేశారు. 

Published on: Jan 14, 2026, 17:50:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అఫీషియల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడో తెలిసింది. భోగి సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వీడియోతో అనౌన్స్ చేశారు. తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా తర్వాత అల్లు అర్జున్-లోకేష్ మూవీ పట్టాలెక్కనుంది.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

అల్లు అర్జున్ మూవీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలబోతున్నారు. సినిమా కోసం పనిచేయనున్నారు. ఏఏ23 (వర్కింగ్ టైటిల్)కు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ అయింది. నెలల తరబడి జరిగిన ఊహాగానాలకు తెరదించుతూ, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ భోగి పండుగ (జనవరి 14) రోజున ఈ చిత్రాన్ని ప్రకటించారు.

అఫీషియల్ అనౌన్స్ మెంట్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిక్కిిచ్చే న్యూస్ ఇది. మకర సంక్రాంతికి ముందు బుధవారం నాడు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రకటన చేస్తూ.. 'భారతీయ సినిమాలో శాశ్వతంగా నిలిచిపోయే కలయిక. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మైత్రి మూవీస్, అనిరుధ్ రవిచందర్. గొప్పతనం కోసం పోరాడండి’’ అని పోస్టు చేశారు.

ఇంట్రెస్టింగ్ వీడియో

ఏఏ23 అనౌన్స్ మెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో హైసెన్‌బర్గ్ రాసిన లిరిక్స్‌తో హెక్టర్ సలామాంకా పాడిన పాట వస్తుంది. కామిక్ లో అడవిలో గుర్రాలు పరుగెత్తుతాయి. ఓ గుర్రంపై హీరో క్యారెక్టర్ లా ఎంట్రీ ఉంది. ఆ తర్వాత తోడేళ్ల గుంపు, సింహం గర్జన కనిపించింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. 2026లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

అల్లు అర్జున్ పోస్ట్

అల్లు అర్జున్ కూడా ఈ ప్రకటన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘‘23 అని చెప్తున్నా. దూకుడుగా ముందుకు సాగుతున్నా. అతి తక్కువగా, మానసికంగా లాక్ అయ్యాను. అది గ్యారెంటీ! మెవ్రిక్ లోకేష్ కనగరాజ్, అలాగే సోదరుడు బ్రదర్ అనిరుధ్ రవిచందర్ తో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు ఉత్సాహంగా ఉన్నా. దీని కోసం వేచి ఉండలేను’’ అని రాసుకొచ్చాడు.

రీసెంట్ మూవీస్

2020లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ 'అల వైకుంఠపురములో' తర్వాత అల్లు అర్జున్ తన ఐదేళ్ల జీవితాన్ని సుకుమార్ పుష్ప చిత్రాలకు అంకితం చేశారు. 'పుష్ప: ది రైజ్' 2021లో విడుదలైంది. 'పుష్ప 2: ది రూల్' 2024లో విడుదలైంది. మొదటి పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు వసూలు చేయగా, పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్లు వసూలు చేసింది.

2023లో వచ్చిన విజయ్-స్టారర్ 'లియో' తర్వాత, లోకేష్ చివరిగా రజినీకాంత్, నాగార్జున, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ తదితరులు నటించిన కూలీ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.518 కోట్లు వసూలు చేసింది. లోకేష్ ఇప్పుడు అరుణ్ మాథెస్వరన్ దర్శకత్వంలో 'DC' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More