మామ‌య్య సినిమాపై కోడ‌లి రివ్యూ- ఇది మెగా సంక్రాంతి అంటున్న ఉపాస‌న- మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారులో చిరు యాక్టింగ్‌కు ఫిదా

మన శంకర వరప్రసాద్ గారు మూవీ థియేటర్లలో అదరగొడుతోంది. సంక్రాంతి 2026 సందర్బంగా రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా ఫిదా అయ్యారు. ఇది మెగా సంక్రాంతి అంటూ సోషల్ మీడియాలో తనదైన రివ్యూ ఇచ్చారు. 

Published on: Jan 13, 2026, 05:38:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు అన్ని వైపుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. సోమవారం (జనవరి 12) రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మెగా కోడలు ఉపాసన కూడా తన మామయ్య చిరంజీవి సినిమాపై రివ్యూ ఇచ్చారు. మెగాస్టార్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు.

చిరంజీవి, సురేఖ, ఉపాసన, రామ్ చరణ్ (x/upasanakonidela)
చిరంజీవి, సురేఖ, ఉపాసన, రామ్ చరణ్ (x/upasanakonidela)

మెగా సంక్రాంతి

మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై మెగాస్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. వింటేజీ లుక్ లో చిరంజీవి యాక్టింగ్ ఇరగదీశారని అంటున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవికి మంచి సినిమా పడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరు కోడలు ఉపాసన కూడా మన శంకర వరప్రసాద్ గారకు మూవీకి ఇంప్రెస్ అయ్యారు. ఇది మెగా సంక్రాంతి అంటూ పోస్ట్ పెట్టారు. చిరు తనయుడు రామ్ చరణ్ భార్య ఉపాసన.

కంగ్రాచ్యులేషన్స్ మామయ్య

‘‘ఇది మెగా సంక్రాంతి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మామయ్య’’ అని ఎక్స్ లో ఉపాసన కొణిదెల పోస్టు చేశారు. చిరంజీవి, నయనతార, సుస్మిత కొణిదెలను ట్యాగ్ చేశారు. మన శంకర వరప్రసాద్ గారులో చిరు సిగరెట్ తాగుతూ స్టైల్ గా ఎంట్రీ ఇస్తున్న సీన్ వీడియోను ఉపాసన పోస్టు చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రొడ్యూసర్లలో చిరు కుమార్తె సుస్మిత కూడా ఒకరు.

బ్లాక్ బస్టర్ టాక్

మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పక్కా పండగ సినిమా అని, సంక్రాంతి 2026 విన్నర్ అనే కామెంట్లు వస్తున్నాయి. పాజిటివ్ రివ్యూలతో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఇందులో చిరంజీవి, నయనతార, వెంకటేశ్, కేథరిన్ థెరిసా తదితరులు నటించారు. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించారు.

మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ

మన శంకర వరప్రసాద్ గారు మూవీలో టైటిల్ లీడ్ ప్లే చేసిన చిరంజీవి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. కేంద్రమంత్రి సెక్యూరిటీ ఆయన చూసుకుంటారు. మరోవైపు శశిరేఖ (నయనతార)తో పెళ్లవుతుంది. కానీ భార్య, పిల్లలకు వరప్రసాద్ (చిరంజీవి) ఉండాల్సి వస్తుంది. మరి వీళ్లు విడిపోవడానికి కారణం ఎవరు? తిరిగి కలిశారా? లేదా? అన్నది మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చూడాల్సిందే.

ముఖ్యంగా వింటేజీ లుక్ లో చిరంజీవి కామెడీ, యాక్షన్, ఫైట్స్ చూడాలంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీకి వెళ్లాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More