Spirit Movie: సందీప్ వంగాతో విభేదాలు.. ప్రభాస్ స్పిరిట్ నుంచి స్టార్ నటుడు ఔట్? షాక్‌లో ఫ్యాన్స్!

సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి వంగా మధ్య స్క్రిప్ట్ విషయంలో విభేదాలు తలెత్తాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నారనేది వైరల్ గా మారింది. 

Published on: Feb 9, 2026, 10:09:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ చుట్టూ వివాదాలు తప్పడం లేదు. పనిగంటల విషయంలో తేడా రావడంతో దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా సందీప్ రెడ్డి వంగాతో విభేదాల కారణంగా స్పిరిట్ నుంచి తప్పుకొన్నాడనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ ఔట్?
స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ ఔట్?

ఆ వాయిస్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న కాప్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్. ఇందులో ప్రకాష్ రాజ్ ది కీలక పాత్ర. గతంలో రిలీజ్ చేసిన స్పిరిట్ ఆడియో స్టోరీ టీజర్ మొత్తం ప్రకాష్ రాజ్ వాయిస్ లోనే సాగింది. ఇందులో ఆయన జైలు సూపరింటెండెంట్ గా నటిస్తారని తెలిసింది. ఇప్పటికే విడుదలైన లాంఛ్ వీడియోలో ఆయన వాయిస్ ప్రకాష్ రాజ్ పాత్రపై భారీ అంచనాలను పెంచింది.

స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ ఔట్?

అయితే ఇప్పుడు స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ ప్లే రిపోర్ట్ ప్రకారం.. స్పిరిట్ మూవీ షూటింగ్ కు ప్రకాష్ రాజ్ దూరమయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి వంగా మధ్య సెట్ లో స్క్రిప్ట్, ఒక స్పెషల్ సీన్ పై తీవ్రమైన విభేదాలు తలెత్తాయని తెలిసింది. దీంతో ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్పుకొన్నాడని అంటున్నారు. ఈ వార్త ఫ్యాన్స్ కు షాక్ కలిగించేదే.

తీవ్ర నిర్ణయం

‘‘కొన్ని సందర్భాలలో ప్రకాష్ రాజ్ ప్రవర్తన చిత్రనిర్మాతలకు నచ్చలేదని, దీంతో ఆయనను సినిమా నుంచి తొలగించే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సినిమా వర్గాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అధికారిక సమాచారం రాలేదు. కానీ ఈ వార్త సినిమా వర్గాలలో వేగంగా వ్యాపిస్తోంది’’ అని ఓటీటీ ప్లే రిపోర్ట్ పేర్కొంది. ప్రకాష్ రాజ్ తప్పుకొంటే ఆయనతో ఇప్పటికే తీసిన సీన్లను మళ్లీ వేరే నటుడితో రీషూట్ చేయాల్సి ఉంటుంది.

అప్పుడు దీపికా పదుకొణె

స్పిరిట్ సినిమాలో మొదట హీరోయిన్ గా దీపికా పదుకొణెను ఫిక్స్ చేశారు. పూర్తి స్క్రిప్ట్ కూడా వినిపించారు. కానీ పని గంటల సమయంలో డైరెక్టర్, దీపికా మధ్య తేడాలు వచ్చాయి. దీంతో దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్పిరిట్ మూవీ నుంచి ఆడియో స్టోరీ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 5, 2027న థియేటర్లలోకి రానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More