రెహమాన్ నిజం మాట్లాడగానే అందరూ మొరుగుతున్నారు.. ఆమె సినిమా క్లాసిక్ కాదు ప్రాపగాండా: ప్రకాష్ రాజ్ కామెంట్స్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చుట్టూ ముసురుకున్న వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో రెహమాన్‌కు మద్దతుగా నిలిచిన అతడు.. నటి కంగనా రనౌత్‌పై తీవ్ర విమర్శలు చేశాడు.
ప్రకాష్ రాజ్ మరోసారి చెలరేగిపోయాడు. రెహమాన్ కు మద్దతుగా మాట్లాడుతూ తనకు అస్సలు నచ్చని వారిపై ప్రతాపం చూపించాడు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ‘క్రిమినలైజింగ్ డిసెంట్’ (వ్యతిరేకతను నేరంగా పరిగణించడం) అనే అంశంపై మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, దానిపై వచ్చిన విమర్శలను అతడు చెప్పుకొచ్చాడు.

రెండు ఆస్కార్స్ తెచ్చిన వ్యక్తిని అలా అంటారా?
రెహమాన్ వివాదంపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "ఏఆర్ రెహమాన్ విషయంలో ఏం జరుగుతుందో చూడండి. 'మా తుజే సలాం', 'జై హో' అంటూ దేశభక్తిని చాటారు. రెండు ఆస్కార్ అవార్డులు తెచ్చినప్పుడు మీరంతా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కేవలం ఒక నిజం చెప్పారు. గుర్తుంచుకోండి.. మీ దగ్గర పని కోసం ఆయన అడుక్కోవడం లేదు, ఆయన స్థాయి అది కాదు" అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశాడు.
కంగనా 'ఎమర్జెన్సీ'పై సంచలన కామెంట్స్
రెహమాన్‌ను విమర్శించిన కంగనా రనౌత్‌ను ప్రకాష్ రాజ్ ఏకిపారేశాడు. "ఆయన ఒక నిజం మాట్లాడగానే కొందరు మొరగడం మొదలుపెట్టారు. ఒక లేడీ డైరెక్టర్, నటి.. కేవలం ఆయన తన సినిమాకు పనిచేయలేదని రెహమాన్‌ను 'యాంటీ నేషనల్' (దేశద్రోహి) అని పిలుస్తోంది. కంగనా రనౌత్ తన 'ఎమర్జెన్సీ' సినిమాను ఒక క్లాసిక్ అని చెప్పుకుంటోంది. కానీ అదొక ప్రాపగాండా (ప్రచార) మూవీ. అందుకే రెహమాన్ ఆ సినిమా చేయడానికి నిరాకరించారు" అని ప్రకాష్ రాజ్ మండిపడ్డాడు.
అసలేం జరిగింది?
ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్.. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' (Chhaava) మూవీ సమాజంలో చీలిక తెచ్చేలా ఉందని, బాలీవుడ్‌లో తనకు మతపరమైన కారణాలతో అవకాశాలు రావడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. దీనిపై కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తీవ్రంగా స్పందించింది.
"నేను ఒక కాషాయ పార్టీకి మద్దతు ఇస్తున్నానని ఇండస్ట్రీలో వివక్ష ఎదుర్కొంటున్నాను. కానీ మీకంటే (రెహమాన్) ద్వేషం నిండిన మనిషిని నేను చూడలేదు. నా 'ఎమర్జెన్సీ' సినిమా కథ వినడానికి కూడా మీరు నిరాకరించారు. ప్రతిపక్ష నాయకులు, విమర్శకులు కూడా నా సినిమాను మెచ్చుకున్నారు. కానీ మీరు మాత్రం ద్వేషంతో గుడ్డివారైపోయారు" అని కంగనా విమర్శించింది.
ఈ వివాదం ముదురుతుండటంతో.. తాను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదని, భారత్‌ను, సంగీతాన్ని ప్రేమిస్తున్నానని రెహమాన్ ఒక వీడియో ద్వారా స్పష్టత ఇచ్చాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


