యానిమల్ పార్క్ స్టోరీ చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆగలేకపోతున్నానంటూ రణ్‌బీర్ కపూర్ కామెంట్
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ రానుంది. ఈ మూవీ స్టోరీని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చెప్పేశాడు.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రా అండ్ బోల్డ్ గా నటించారు. పూర్తి వైలెన్స్ తో కూడిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ రాబోతుంది. యానిమల్ పార్క్ స్టోరీపై సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ కామెంట్లు వైరల్ గా మారాయి.

యానిమల్ పార్క్ స్టోరీ
యానిమల్ పార్క్ స్టోరీపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘‘నేను ఇప్పుడు ఒక మూవీ (స్పిరిట్) చేస్తున్నా. అది కంప్లీట్ కాగానే యానిమల్ పార్క్ స్టార్ట్ చేస్తా. అజీజ్ (సినిమాలో క్యారెక్టర్) కూడా ఓ యానిమల్ లాంటి పాత్ర. సీక్వెల్ లో మరిన్ని యానిమల్స్ లాంటి క్యారెక్టర్లు ఉంటాయి. అందుకే సినిమాకు యానిమల్ పార్క్ అనేది పర్ఫెక్ట్ టైటిల్ అని ఫీలయ్యా. ఇది ఒకేలాగా కనిపించే ఇద్దరు బ్రదర్స్ మధ్య వార్. 2027లో షూటింగ్ స్టార్ట్ చేస్తా’’ అని సందీప్ తెలిపాడు.
ఆగలేకున్నా
యానిమల్ పార్క్ సినిమా షూటింగ్ కోసం ఆగలేకపోతున్నానని హీరో రణ్‌బీర్ కపూర్ అన్నాడు. ‘‘సందీప్‌తో కలిసి సెట్‌లోకి తిరిగి రావడానికి, ఈ పాత్రను పోషించడానికి ఆగలేకపోతున్నా. సీక్వెల్ లో నాది మరో క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇది కొనసాగుతున్న కథ కాబట్టి పార్ట్ 1 షూటింగ్ అప్పుడే పార్ట్ 2 గురించి సందీప్ కు క్లారిటీ ఉంది. మేమిద్దరం నిరంతరం చాట్ చేస్తూ, వివిధ ఆలోచనలను చర్చిస్తూ ఉంటాం’’ అని రణ్‌బీర్ కపూర్ చెప్పాడు.
జపాన్ లో యానిమల్
సందీప్ రెడ్డి వంగా- రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ యానిమల్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు జపాన్ లోనూ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 13న జపాన్ లో యానిమల్ మూవీ విడుదల అవుతుంది. ఈ సందర్భంగా సందీప్, రణ్‌బీర్ కపూర్ ఆడియన్స్ తో మాట్లాడుతూ పైన పేర్కొన్న కామెంట్లు చేశారు. యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
స్పిరిట్ తో బిజీ
ప్రస్తుతం స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇందులో ప్రభాస్ హీరో. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ పార్క్ తెరకెక్కించనున్నాడు సందీప్. మరోవైపు రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ & వార్', నితీష్ తివారీ దర్శకత్వంలో 'రామాయణ: పార్ట్ వన్'లో నటిస్తున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


