నిన్ను కోరి జనవరి 31 ఎపిసోడ్: అన్న సక్సెస్, తమ్ముడు ఫెయిల్- క్రాంతి ప్రాజెక్ట్ గోవిందా- విరాట్‌ను బాగా ఇరికించిన శాలిని
నిన్ను కోరి సీరియల్ జనవరి 31 ఎపిసోడ్‌లో విరాట్‌కు కాల్ చేసిన మంత్రి పీఏ క్రాంతి ల్యాండ్ ప్రపోజల్ పంపించమని చెబుతుంది. అదే విషయం క్రాంతికి చెప్పబోతుంటే శాలిని ఎదురుపడుతుంది. క్రాంతికి చెప్పమని శాలినికి చెబుతాడు విరాట్. కానీ, శాలిని చెప్పదు. విరాట్ ల్యాండ్‌కు జీహెచ్ఎంసీ పర్మిషన్ వస్తుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ కోసం విరాట్ తెచ్చిన మల్లెపూలను సోఫాలో చూస్తాడు రఘురాం. నీకోసమేగా వీడు పూలు కొన్నది అని రఘురాం అంటాడు. దాంతో డైనింగ్ టేబుల్‌పై ఉన్న గ్లాస్ కింద పడేస్తుంది చంద్రకళ. దాంతో జరిగింది మర్చిపోతాడు రఘురాం. ఇంతలో అంతా వస్తారు. చేతిలో మల్లెపూలు ఏంటని శ్యామల అడుగుతుంది.

జగదీశ్వరి కోసమే మల్లెపూలు
జగదీశ్వరి కోసమే రఘురాం మల్లెపూలు కొన్నాడని కామాక్షి అంటుంది. కానీ, శాలినికి మాత్రం చంద్ర కోసం విరాట్ పూలు కొన్నాడని, మావయ్య మతిమరుపుతో డైవర్ట్ చేసుకున్నాడని అర్థం చేసుకుంటుంది శాలిని. నీకోసం అప్పుడప్పుడు ఇలాగే పూలు తెచ్చేవాడిని కదా అని రఘురాం అంటే సిగ్గుందా అండి. పిల్లల ముందు అలా అంటారేంటీ అని జగదీశ్వరి అంటుంది.
అయితే రూమ్‌లో అను అన్నయ్య అని రఘురాం, జగదీశ్వరిని గదిలోకి పంపించేస్తారు శ్యామల, కామాక్షి. ప్రకాష్ ఉండుంటే నాకు కూడా ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఉండేవని శ్యామల అంటుంది. సరేలే నేను కొనిస్తాలే మల్లెపూలు అని కామాక్షి అంటుంది. బతికిపోయామని విరాట్ అనుకుంటాడు. చంద్రకళ తెగ నవ్వుతుంది. మల్లెపూల మీద చంద్రకళ కవిత్వం చెబుతుంది.
నా ప్లాన్ ఫెయిల్ అయిందని ఏడుస్తుంటే ఎటకారం చేస్తావా అని చంద్ర వెంట పడతాడు. ఇంతలో మంత్రి పీఏ విరాట్‌కు కాల్ చేసి ల్యాండ్ ప్రపోజల్స్ గురించి చెబుతుంది. క్రాంతి ఐడియాను ఎగ్జిక్యూట్ చేయాలని, ల్యాండ్‌కు ప్రపోజల్ పంపించమని, నచ్చితే వెంటనే లాక్ చేస్తారని పీఏ చెబుతుంది. దాంతో విరాట్ సంతోషిస్తాడు. అదే చంద్రకళకు చెబుతాడు విరాట్.
శాలినికి చెప్పిన విరాట్
తర్వాత క్రాంతి దగ్గరికి వెళ్తాడు విరాట్. శాలిని దర్శనం ఇచ్చి క్రాంతి లేడని, మీటింగ్‌లో ఉన్నాడని చెబుతుంది. మినిస్టర్ పీఏ గురించి చెప్పి క్రాంతికి చెప్పమని చెబుతాడు విరాట్. మరోవైపు శ్రుతి తింటూనే ఉంటుంది. రాజ్‌ను తల్లి మారిపోయావని తిడుతుంది. నువ్వు ధన పిశాచివి, అందుకే నీ కొడుకును నా మీదకు ఉసిగొలిపావని శ్రుతి అంటుంది.
నువ్వు మీ అమ్మ రాకాసి తెగకు చెందినవాళ్లు అని రాజ్ తల్లి అంటుంది. శ్రుతి పుట్టింటికి వెళ్తానని బెదిరిస్తే రాజ్ బతిమిలాడుతాడు. నా భార్యను, అత్తగారిని అంటే ఊరుకునేది లేదని రాజ్ తల్లిని మందలిస్తాడు. రేపటి నుండి అది మార్కెట్‌కు రాకూడదు అని తల్లి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం చంద్రకళ పూజ చేస్తుంది.
విరాట్ హారతి అయిష్టంగా తీసుకుంటాడు. ఇంకా చంద్ర మీద కోపం పోలేదా అని రఘురాం నిలదీస్తాడు. అలా అడగండి అని చంద్ర అంటే.. నా కూతురు విషయంలో మూటగట్టుకున్న పాపం ఊరికే పోతుందా అని కామాక్షి నిందిస్తుంది. ఎంత తిట్టిన దులుపేసుకుంటావ్. సిగ్గులేకుండా అని శ్యామల అంటుంది. మీరు మాత్రం వెళ్లారా. అంత ఒకే కుంపటి అని చంద్రకళ రివర్స్ పంచ్ ఇస్తుంది.
కోట్లల్లో లాభాలు
ఇంతలో మ్యానేజర్ వస్తాడు. మీరు ఎదురుచూసిన వెంచర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చిందని చెబుతాడు. ఇది ఎక్స్‌ట్రార్డినరీ న్యూస్ అని విరాట్ అంటాడు. రేట్ పెరిగినట్లేగా అని జగదీశ్వరి అంటే నాలుగు రెట్లు పెరిగినట్లు అని చంద్రకళ అంటుంది. మంచి రోజు చూసి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని రఘురాం అంటాడు. అదంతా శాలిని చూస్తుంది.
అంతా విరాట్‌కు కంగ్రాట్స్ చెబుతారు. ఈ న్యూస్ వాడుకుని క్రాంతిని రెచ్చగొట్టాలని శాలిని అనుకుంటుంది. క్రాంతి చాలా సంతోషంగా ఉంటాడు. ఒక్క పర్మిషన్ వస్తే చాలు సక్సెస్ సాధించినట్లే అని క్రాంతి అంటాడు. మీ అన్నయ్య ఆల్రెడీ సక్సెస్ సాధించిన సంతోషంలో ఉన్నాడు. ఎప్పుడో కొన్న ల్యాండ్‌కు రేట్ పెరిగిందని, కోట్లల్లో లాభాలు వస్తాయని పొంగిపోతున్నారని శాలిని అంటుంది.
త్వరలో నేను కూడా సక్సెస్ సాధిస్తే అంతా సంతోషిస్తారు అని క్రాంతి అంటాడు. బావ గారు నీ పని చూస్తూనే తన పని చేసుకుని సక్సెస్ అయ్యారు. నువ్వు కూడా సొంతంగా పనులు చేయడం నేర్చుకో. అప్పుడే సక్సెస్ అవుతావ్. బావగారు బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. మినిస్టర్ గారి పీఏతో నువ్వే డైరెక్ట్ మాట్లాడు. నీకు క్లారిటీ వస్తుందని శాలిని అంటుంది.
విరాట్‌ను ఇరికించిన శాలిని
దాంతో మినిస్టర్ పీఏకి క్రాంతి కాల్ చేస్తాడు. నిన్న విరాట్‌కు చెప్పి ల్యాండ్ ప్రపోజల్ పంపించమన్నానుగా. ఎందుకు పంపలేదు. ఇప్పుడు మినిస్టర్ గారి దగ్గర బంధువుకు ఇచ్చేశారు. మీరు ఆశలు వదులుకోండి. నిన్న నేను ఫోన్ చేసిన వెంటనే ఫైల్ పంపిస్తే మీకే వచ్చేది. మీరు పంపించకుంటే ఎలా అని పీఏ కోప్పడుతుంది.
అదే విషయం వెళ్లి విరాట్‌ను అడుగుతాడు క్రాంతి. నిన్నే నీకు చెప్పాను కదా అని శాలినిని విరాట్ అంటాడు. నాకు ఎప్పుడు చెప్పారు అని అబద్ధం చెబుతుంది శాలిని. అలా తమ్ముడి దగ్గర విరాట్‌ను ఇరికిస్తుంది శాలిని. దాంతో విరాట్, చంద్ర షాక్ అవుతారు. ఇక బిజినెస్ లో అన్న సక్సెస్ అయితే తమ్ముడు ఫెయిల్ అవుతాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


