నిన్ను కోరి జనవరి 26 ఎపిసోడ్: విరాట్‌ను కాపాడిన చంద్రకళ- బెడిసికొట్టిన శాలిని స్కెచ్- జల్ రాజ్ 10 లక్షల ప్లాన్ ఫెయిల్

నిన్ను కోరి సీరియల్ జనవరి 26 ఎపిసోడ్‌లో క్రాంతి దగ్గర విరాట్‌ను ఇరికిస్తుంది శాలిని. దాంతో అన్నయ్యను క్రాంతి నిలదీస్తాడు. కానీ, చంద్ర క్రాంతి నుంచి భర్తను కాపాడుతుంది. దాంతో శాలిని ప్లాన్ బెడిసికొడుతుంది. మరోవైపు రఘురాం దగ్గర జల్ రాజ్ పది లక్షల కొట్టేసేందుకు ప్లాన్ వేస్తాడు. అది ఫెయిల్ అవుతుంది.

Published on: Jan 26, 2026, 09:04:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కాపురం సరిగా చేస్తేనే అంతా సంతోషంగా ఉంటారు అని చంద్రకళ అంటే.. కామాక్షి వచ్చి సెటైర్లు వేస్తుంది. సమయానికి తగ్గట్లు సర్దుకుపోవాలి. నా భర్త మళ్లీ నా దగ్గరికి వస్తాడు. కొంతమంది అది చేతకాక మొగుడిని వదిలేసి తిరుగుతారు మీలాగా అని చంద్రకళ పంచ్ ఇస్తుంది.

నిన్ను కోరి సీరియల్ జనవరి 26 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జనవరి 26 ఎపిసోడ్‌

కొత్త అల్లుడికి మర్యాదలు

ఇంతలో శ్యామల వచ్చి పిలుస్తుంది. జల్ రాజు, శ్రుతికి బట్టలు పెడతారు. కొత్త అల్లుడికి మర్యాదలు అని చెబుతారు. బట్టల్లో డబ్బులు ఉన్నాయా లేదా అని జల్ రాజు చూస్తాడు. వట్టి బట్టలే బ్రో అని విరాట్ అంటాడు. తర్వాత క్రాంతిని పక్కకు పిలిచి తీసుకెళ్తుంది శాలిని. లేట్ చేస్తే మినిస్టర్ గారి పీఏకి మన మీద నెగ్లెజెన్స్ ఫీలింగ్ వస్తుందని శాలిని అంటుంది.

అన్నయ్యకు చెబుతాను అని క్రాంతి అంటే.. అన్నింటికి అన్నయ్య మీద ఆధారపడితే ఎలా. నువ్వే చేయు అని శాలిని అంటుంది. దాంతో మంత్రి పీఏకి క్రాంతి కాల్ చేసి మీరు పంపిన పర్సన్‌ను కలవలేదు అని సారీ చెబుతాడు. అసలు నేను ఏ పర్సన్‌ను పంపలేదు. నేను విరాట్‌తో మాట్లాడనేలేదు అని పీఏ చెబుతుంది. దాంతో క్రాంతి షాక్ అవుతాడు.

నువ్వు బిజినెస్‌లో ఎదగడం మీ అన్నయ్యకు ఇష్టం లేదు. అందుకే ఇవన్నీ డ్రామాలు ఆడారు అని రెచ్చగొడుతుంది శాలిని. అలా చేయడు. అలా అయితే గెస్ట్ హౌజ్‌ వరకు ఎందుకు తీసుకెళ్తాడు అని క్రాంతి అంటాడు. ఓసారి క్లారిటీ తీసుకో. మళ్లీ మీ మధ్య మనస్పర్థలు రావొద్దని చెబుతున్నా అని శాలిని అంటుంది. మరోవైపు రఘురాం నుంచి ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు లాగేయాలని ట్రై చేస్తాడు జల్ రాజ్.

జల్ రాజ్ 10 లక్షల ప్లాన్

చేపలు అమ్ముకుని ఎలా బతకాలి. వచ్చేదంతా శ్రుతి మేకప్‌కే సరిపోతుంది. ఏదైనా బిజినెస్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నా. అందుకు మీరు సహాయం చేస్తే అని రాజ్ అంటాడు. సరే బిజినెస్‌కు ఎంత కావాలి అని రఘురాం అంటాడు. పది లక్షలకు చేపల బిజినెస్ 20 శాతం ప్రాఫిట్ వస్తుందని రాజ్ అంటాడు. మంచి ఆలోచన అని రఘురాం అంటాడు.

దానికి సంతోషంలో అనుకోకుండా పక్కన ఉన్న ప్లేట్ కింద పడేస్తాడు రాజ్. ఆ సౌండ్‌కు రఘురాం మర్చిపోతాడు. రాజ్‌కు 10 లక్షలు ఇచ్చినట్లు, లాభం ఇవ్వమని రివర్స్‌లో అంటాడు రఘురాం. ఫ్యూజ్ కొట్టేసినట్లుంది, రివర్స్‌లో వస్తున్నాడని జల్ రాజ్ అనుకుంటాడు. నేను నీకు పది లక్షలు ఇచ్చాను. మర్యాదగా తిరిగి ఇచ్చేయ్ అని కాలర్ పట్టుకుని నిలదీస్తాడు రఘురాం.

తర్వాత మరో సౌండ్ రావడంతో రఘురాం కూల్ అవుతాడు. అలా జల్ రాజ్ పది లక్షల ప్లాన్ ఫెయిల్ అవుతుంది. తర్వాత చంద్రకళ, విరాట్ వస్తుంటే క్రాంతి పిలుస్తాడు. గెస్ట్ హౌజ్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లావ్ అని క్రాంతి అడిగితే.. పీఏ పర్సన్ కోసమని విరాట్ అంటాడు.

నిలదీసిన క్రాంతి

ఎందుకు అబద్ధం చెబుతావ్. నువ్వు అసలు పీఏ పర్సన్‌తో మాట్లాడనేలేదు. పీఏకు ఫోన్ చేశానని ఎందుకు మోసం చేశావ్. నేను బిజినెస్‌లో ఎదగడం నీకు ఇష్టం లేదా అని విరాట్‌ను నిలదీస్తాడు క్రాంతి. వాడు ఎందుకు అలా చేస్తాడురా అని అంతా అంటారు. అదే తెలియకా అడుగుతున్నా. పీఏకి కాల్ చేస్తే తనకు అన్నయ్య ఎలాంటి కాల్ చేయలేదని చెప్పిందని క్రాంతి అంటాడు.

ఇంతలో పక్కకు వెళ్లిన చంద్రకళ కావాలనే విరాట్‌కు కాల్ చేసి తాను పీఏలా మాట్లాడుతానని చెబుతుంది. దాంతో విరాట్ స్పీకర్ ఆన్ చేస్తాడు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న మీకోసం మీ తమ్ముడితో మీటింగ్ ఏర్పాటు చేస్తే కలవకపోవడం ఏంటీ అని మంత్రి పీఏలా మాట్లాడినట్లు ఫైర్ అవుతుంది చంద్రకళ. చిన్న ఎమర్జెన్సీ వచ్చి రాలేకపోయాను అని విరాట్ అంటాడు.

అదంతా క్రాంతి వింటాడు. విని షాక్ అవుతాడు. అదంతా చూసిన శాలిని అవాక్కవుతుంది. క్రాంతి దగ్గర విరాట్‌ను ఇరికించి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడదామనుకున్న శాలిని స్కెచ్ బెడిసికొట్టేలా చంద్రకళ చేస్తుంది. విరాట్‌ను చంద్ర కాపాడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More