బ్రహ్మముడి జనవరి 23 ఎపిసోడ్: డీఎన్ఏ రిపోర్ట్స్ మార్చిన మంత్రి- పాప గుండె సమస్యతో బయటపడిన నిజం- రాజ్, కావ్య షాక్!

బ్రహ్మముడి సీరియల్ జనవరి 23 ఎపిసోడ్‌లో డీఎన్ఏ రిపోర్ట్స్‌లో తను కావ్య పాపే అని వస్తుంది. దాంతో కావ్య ఒప్పుకోదు. ఇంటిల్లిపాది ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. రిపోర్ట్స్ మార్చినందుకు మంత్రికి కంగ్రాట్స్ చెబుతుంది రుద్రాణి. తర్వాత కళావతి పాపకు నురగ రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు కావ్య, రాజ్.

Published on: Jan 23, 2026, 07:52:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంట్లో డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా రావట్లేదని మాట్లాడుకుంటారు. 24 గంటల్లో మెయిల్‌కు వస్తుందని రాజ్ చెబుతాడు. కావ్య మాత్రం పాపను ఆడిస్తుంటుంది. మాకు చాలా టెన్షన్‌గా ఉంది. నువ్వు మాత్రం చాలా కూల్‌గా ఉన్నావని కావ్యను అడుగుతారు.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 23 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 23 ఎపిసోడ్

రిపోర్ట్స్ చూసి షాక్

మీరు కాగితాలను నమ్ముతారు. నేను తల్లి ప్రేమను నమ్ముతున్నాను. నాకు రిపోర్ట్స్‌లో ఏం వస్తుందో నాకు తెలుసు కాబట్టి నిదానంగా ఉన్నాను అని కావ్య అంటుంది. ఇంతలో రిపోర్ట్స్ వస్తాయి. రాజ్ వచ్చాయని చెబుతాడు. రిపోర్ట్స్ చూసి రాజ్ షాక్ అవుతాడు. కల్యాణ్ కూడా చూసి షాక్ అవుతాడు. రిపోర్ట్స్‌లో ఏముందని అంతా అడుగుతారు.

ఈ పాప మన పాపే అని వచ్చిందమ్మా. పాప డీఎన్‌ఏ కళావతి డీఎన్ఏతో మ్యాచ్ అయిందని రాజ్ అంటాడు. దాంతో నో అని గట్టిగా అరుస్తుంది కావ్య. అంతా అబద్ధం అని గొడవ చేస్తుంది కావ్య. ఎవరో నా మీద కుట్ర చేస్తున్నారు. ఈ పాప నా పాప అంటే ఒప్పుకోను. టెస్ట్‌లతో నన్ను మోసం చేయలేరు అని రచ్చ చేస్తుంది కావ్య.

ఇంట్లో వాళ్లు నచ్చజెప్పడానికి చూస్తారు. కానీ, కావ్య వినదు. షటప్ కళావతి. కాస్తా బుర్రపెట్టి ఆలోచించు. డాక్టర్స్ టెస్ట్ చేసి పంపిన రిపోర్ట్స్ ఇవి. పిచ్చిదానిలా అనకు. మూర్ఖత్వంతో కాదు మాతృత్వంతో ఆలోచించు అని రాజ్ అంటాడు. కాస్తా మనసు పెట్టి ఆలోచించు అని అంతా అంటారు.

నా ప్రాణం పోయిన ఒప్పుకోను

ఇప్పటివరకు నువ్వు చెప్పింది నేను విన్నా. ఇకపై నేను చెప్పింది నువ్వు విను. ఈ పాప మన పాప అని ఒప్పుకో అని రాజ్ అంటాడు. ఒప్పుకోను. నా ప్రాణం పోయినా ఒప్పుకోను. నా భర్త, కుటుంబం అండగా నిలబడకపోయినా నేను నా కూతురు ఎక్కడుందో నేను వెతికి తెచ్చుకుంటాను అని కావ్య తేల్చి చెప్పి వెళ్లిపోతుంది.

మరోవైపు డీఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసినందుకు మంత్రి ధర్మేంద్రకు రుద్రాణి కంగ్రాట్స్ చెబుతుంది. కానీ, చాలా ఖర్చు అయింది. కావ్య ఎక్కడికి వెళ్లిన డీఎన్ఏ రిపోర్ట్స్‌లో అదే వస్తుంది అని మంత్రి అంటాడు. మెల్లి మెల్లిగా ఆ పాప ఆరోగ్యం పాడవుతుంది. దాంతో దుగ్గిరాల కుటుంబం పిచ్చిది అవుతుంది. నాకు చేసిన అవమానానికి తగిన శిక్ష వేసినట్లు అవుతుందని రుద్రాణి అంటుంది.

దాంతో కాస్తా డల్ అవుతాడు మంత్రి. ఎక్కువ ఫీల్ అవ్వకండి. వాళ్ల గురించి ఇక పట్టించుకోకండి. ఏదో ఒక రోజు వచ్చి మీ సహాయం అడుగుతాను. అప్పుడు కచ్చితంగా చేయండి అని రుద్రాణి వెళ్లిపోతుంది. మంత్రిని భార్య తులసి పిలుస్తుంది. రుద్రాణి ఎవరండి. తరచూ వస్తుంది అని తులసి అడుగుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకో. తన వల్లే మనం ఇలా సంతోషంగా ఉన్నామని ధర్మేంద్ర అంటాడు.

మన బిడ్డ అని ఆలోచించు

తర్వాత పాపతో మన మధ్యలోకి ఎవరు రారు అని అని నోరు జారుతాడు ధర్మేంద్ర. అదేంటండి మన మధ్యలోకి ఎవరు వస్తారు అని తులసి అంటాడు. ఏదో సరదాగా అన్నాను అని కవర్ చేస్తాడు మంత్రి ధర్మేంద్ర. మరోవైపు బాధపడుతున్న కావ్యను రాజ్ వచ్చి ఓదారుస్తాడు. వాస్తవాన్ని గ్రహించమంటున్నాను. ఒక్కసారి ఆలోచించు. ఇది మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అని ఆలోచించు అని రాజ్ అంటాడు.

నువ్వు అన్నట్లు మనకు ఎవరైనా శత్రువులు ఉంటే మన పాపను ఎత్తుకెళ్తారు కానీ ఈ పాపను తీసుకొచ్చి ఎందుకు పెడతారు. నీ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే చూడలేకపోతున్నాను. నీ బాధ ఈ కుటుంబం మోస్తుంది. ఒక్కసారి ఈ పాప మనకు పుట్టిందని ఎందుకు ఆలోచించకూడదు. దయచేసి నన్ను ఏడిపించకు అని రాజ్ అనేసి వెళ్లిపోతాడు.

కృష్ణుడి దగ్గరికి వెళ్లి పాప గురించి మొర పెట్టుకుంటుంది కావ్య. నాకు ఏంటీ కష్టాలు. ఈ బిడ్డను అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకింత పరీక్షపెడుతున్నావని నిలదీస్తుంది కావ్య. నా బిడ్డ ఎక్కడుంతో దారి చూపించు. ఇప్పటికైనా ఈ తల్లి నమ్మకం నిజమని నిరూపించు అని కావ్య అంటుంది. ఇంతలో పాప నోటి నుంచి నురగ వస్తుంది.

పాప గుండె సమస్యతో కావ్యకు నిజం

రాజ్‌తో కలిసి పాపను హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది కావ్య. అక్కడ టెస్ట్ చేసిన డాక్టర్ పాపకు గుండె సమస్య ఉందని, బ్లడ్ పంపింగ్ సరిగా జరగదని చెబుతుంది. నా పాప ఆరోగ్యంగా ఉంది. అందుకే బిడ్డను మార్చారు అని కావ్య గొడవ చేస్తుంది. అలా పాపకున్న సమస్యతో కావ్యకు నిజం తెలుస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More