బ్రహ్మముడి జనవరి 19 ఎపిసోడ్: పుట్టుమచ్చతో తన పాప కాదని కనిపెట్టిన కావ్య- మంత్రి రాజకీయ వారసురాలిగా రాజ్ కూతురు

బ్రహ్మముడి సీరియల్ జనవరి 19 ఎపిసోడ్‌లో తనకు ఇచ్చిన పాప తన బిడ్డ కాదని, ఈ పాపకు పుట్టుమచ్చ లేదని కావ్య గోల చేస్తుంది. అందరి పాపలను ఎత్తుకుని టెస్ట్ చేస్తుంది. దాంతో డాక్టర్ వచ్చి తిడుతుంది. డిస్‌ఛార్జ్ అవ్వమని అంటుంది. కావ్య విషయం తెలిసి మంత్రి వాళ్లు కూడా డిస్‌ఛార్జ్ అవుతారు.

Published on: Jan 19, 2026, 07:58:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో తనకు ఇచ్చిన పాప తనకు పుట్టిన పాప కాదని, ఎత్తుకుంటే ఎలాంటి తల్లి ఫీలింగ్ కలగట్లేదు అని కావ్య అంటుంది. వారం రోజులు లేదు కాబట్టి అలా అనిపించొచ్చు అని డాక్టర్ అంటుంది. లేదు నెల రోజులు అయిన నా పాపను గుర్తు పట్టలేనా అని కావ్య అంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 19 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 19 ఎపిసోడ్

పుట్టుమచ్చ లేదు

అందరు నచ్చజెప్పాలని చూస్తే ఆపండి అని గట్టిగా అరుస్తుంది కావ్య. ఫస్ట్ టైమ్ వింటున్న ఈ హాస్పిటల్‌లో ఇలాంటి ఆరోపణ రావడం అని డాక్టర్ అంటుంది. నేను నా పాపను ఎత్తుకున్నప్పుడు చేతికి పుట్టుమచ్చ ఉంది. ఈ పాపకు లేదు. నా బిడ్డను ఎవరో మార్చారు అని కావ్య అంటుంది.

నేనే ఇంక్యూబెటర్‌లో పెట్టాను, ట్యాగ్ వేశాను. నేనే తీసుకొచ్చాను అని డాక్టర్ అంటుంది. అవన్నీ అబద్ధం, నా బిడ్డ మారిపోయింది అని పానిక్ అవుతూ స్పృహ తప్పిపోతుంది కావ్య. అందరిని వెళ్లమని ట్రీట్‌మెంట్ ఇస్తుంది డాక్టర్. మరోవైపు కూతురుని ఎత్తుకుని మురిసిపోతాడు మంత్రి ధర్మేంద్ర. మహారాణిలా చూసుకుంటానంటాడు.

మీ రాజకీయాలకు దూరంగా ఉంచమని తులసి అంటే.. అదేంటీ బారసాల గ్రాండ్‌గా చేసి నా రాజకీయ వారసురాలిగా ప్రకటిద్దామనుకుంటున్నా అని ధర్మేంద్ర అంటాడు. అంటే రాజ్, కావ్యల కూతురు ధర్మేంద్ర రాజకీయ వారసురాలిగా పెరగనుందని తెలుస్తోంది. కానీ, దానికి తులసి ఒప్పుకోదు. ఒక మంచి మనిషిలా పెరిగితే చాలు అని తులసి అంటుంది.

కావ్య గుర్తు పట్టేసింది

ఇంతలో రుద్రాణి వచ్చి అర్జంట్‌గా మాట్లాడాలని బయటకు తీసుకెళ్తుంది. వెంటనే డిస్‌ఛార్జ్ అయి వెళ్లిపోవాలని, కావ్య తనకు ఇచ్చిన పాప కాదని గుర్తు పట్టేసింది, కానీ, మీ పాప తన పాప కాదని తెలియదు. పుట్టిన పాపకు పుట్టుమచ్చ చూసిందట. మీ పాపకున్న పుట్టుమచ్చ చూసిందంటే అంతా అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వెంటనే వెళ్లిపోండి అని రుద్రాణి హెచ్చరిస్తుంది.

మరోవైపు కావ్య అలా ఎందుకు ప్రవర్తిస్తుందో, కావ్య ఎందుకు అనుమానిస్తుంది అని మాట్లాడుకుంటారు. బిడ్డ ఎలా మారిపోతుంది. రోజు పదిసార్లు చూశాం అని రాజ్ అంటాడు. రుద్రాణి అత్త, నీ అరెస్ట్ అన్నింటివల్ల డిస్టర్బ్ అయినట్లుందని కల్యాణ్ అంటాడు. అందరం కలిసి నెమ్మదిగా చెబుతాం అని అప్పు అంటే.. రాహుల్, రేఖ నవ్వుతారు.

ఇంతలో నర్స్ వచ్చి పిల్లలందరిని లాక్కుంటూ గొడవ చేస్తుందని, తల్లులంత భయపడుతున్నారని చెబుతుంది. మరోవైపు కావ్య అందరి పిల్లలను ఎత్తుకుని చూస్తూ నా పాప కాదంటూ పిచ్చిదానిలా చేస్తుంది. రాజ్ వాళ్లు వచ్చి కావ్యను ఆపుతారు. నా పాపను నేను కనిపెట్టేస్తాను అని పదే పదే అదే మాట్లాడుతుంది కావ్య. అదంతా నీ భ్రమ అని రాజ్ నచ్చజెబుతాడు.

డాక్టర్‌పై కావ్య రివర్స్

ఎవరు ఏం చేయలేదు అని అపర్ణ అంటుంది. నన్ను నమ్మండి అని కావ్య అలాగే గొడవ చేస్తుంది. డాక్టర్ వచ్చి తిడుతుంది. దానికి కావ్య రివర్స్ అవుతుంది. నా బిడ్డను ఎందుకు మార్చారు అని అడుగుతుంది. బిడ్డను మార్చడం అంత ఈజీనా. ముందు మీ భార్యను తీసుకెళ్లండి అని అంటుంది. కావ్యను తీసుకెళ్తారు రాజ్ వాళ్లు.

మరోవైపు డాక్టర్ చక్రవర్తి తులసి దగ్గరున్న పాపను చెక్ చేస్తాడు. పాపకున్న సమస్య గురించి చక్రవర్తి చెబుతుంటే మంత్రి ధర్మేంద్ర వచ్చి మమ్మల్ని వెంటనే డిస్‌చార్జ్ చేయమని డాక్టర్‌ను పక్కకు తీసుకెళ్తాడు. పాపకు వెంటనే ఆపరేషన్ చేయాలి కదా. డిస్‌చార్జ్ అంటారేంటీ అని డాక్టర్ చక్రవర్తి అంటాడు.

నా పాపకు ఇక్కడ ట్రీట్‌మెంట్ చేయట్లేదు. దానికి నాకు ఒక మార్గం దొరికింది అని మంత్రి అంటాడు. ఎక్కడైనా ఈ ప్రోసీజర్ ఫాలో అవ్వాలిగా అని చక్రవర్తి అంటే.. హేయ్ నేను చెబుతున్నాగా. చెప్పింది చేయు అని మంత్రి ధర్మేంద్ర అంటాడు. దాంతో చక్రవర్తి సరే అంటాడు.

వెంటనే డిస్‌చార్జ్ అవండి

మరోవైపు కావ్య గురించి డాక్టర్, రాజ్ మాట్లాడుకుంటారు. కావ్య ఒత్తిడితో ఏం చేస్తుందో తెలియట్లేదు. అలాంటివి రిపీట్ కాకూడదంటే వెంటనే డిస్‌చార్జ్ అయి వెళ్లండి అని డాక్టర్ అంటుంది. తను ఎప్పుడు ఇలా చేయలేదు అని రాజ్ అంటాడు. పిల్లలు పుట్టగానే మెంటల్ కండిషన్ కూడా మారిపోతుందని డాక్టర్ అంటుంది.

కావ్య చెప్పిందాంట్లో అనుమానం ఉంది. అందులో కొంత నిజం కూడా ఉందనుకోవచ్చుగా. ఓ డాక్టర్‌గా మీరు ఎందుకు ఆలోచించకూడదు అని రాజ్ అంటాడు. మీరు కూడా అలాగే మాట్లాడితే ఎలా. ఇంత సెక్యురిటీ నుంచి మీ పాపను ఎందుకు మారుస్తారు. ఆ అవసరం ఎందుకు ఉంటుంది అని డాక్టర్ అంటుంది.

మీ భార్యకు ప్రేమగా అన్ని చెప్పండి. ఇక్కడ మాత్రం ఉండకండి అని డాక్టర్ చెబుతుంది. తర్వాత కావ్య, తులసి ఇద్దరు డిస్‌చార్జ్ అయి వెళ్లిపోతారు. ఆ పాప తన బిడ్డ కాదని, తన కూతురు ఎక్కడున్న కనిపెడతానని కావ్య అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More