బ్రహ్మముడి జనవరి 17 ఎపిసోడ్: ఆస్పత్రిలో అందరి పాపలను చెక్ చేసిన కావ్య- తప్పించుకున్న మంత్రి-ధర్మేంద్ర కోటి రూపాయల కానుక!
బ్రహ్మముడి సీరియల్ జనవరి 17 ఎపిసోడ్‌లో బిడ్డలను మార్చేందుకు రుద్రాణితో చేతులు కలుపుతాడు మంత్రి ధర్మేంద్ర. నర్స్‌ను డబ్బుతో కొని బిడ్డలను మార్చేలా చేస్తాడు మినిస్టర్. తన దగ్గరికి తీసుకొచ్చిన పాపను ఎత్తుకున్న కావ్య తనకు పుట్టలేదని గోల చేస్తుంది. ఆస్పత్రిలో అందరి పాపలను ఎత్తుకుని చెక్ చేస్తుంది కావ్య.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పాప గురించి తులసి అడిగితే మంత్రి ధర్మేంద్ర ఇంక్యూబెటర్‌లో పెట్టారని చెబుతాడు. దాంతో పాపకు ఏమైందని కంగారుగా అడుగుతుంది తులసి. డాక్టర్ చిన్న సమస్య ఉందని నిజం చెప్పబోతుంటే ధర్మేంద్ర ఆపుతాడు. పెద్ద సమస్య కాదు. చిన్నదే. పాప బరువుగా పుట్టింది. అందుకే వెయిట్ పెరగడానికి ఇంక్యూబెటర్‌లో పెట్టారని చెబుతాడు.

తులసికి అబద్ధం
డాక్టర్ మా ఆయన చెప్పేది నిజమేనా అని తులసి అడుగుతుంది. పాప పుట్టగానే నన్ను నమ్మట్లేదా. డాక్టర్స్ చెబితేనే నమ్ముతావా అని ధర్మేంద్ర అంటాడు. దాంతో పాపను నేను చూడాలని తులసి అంటే.. తీసుకెళ్లి చూపిస్తాడు ధర్మేంద్ర. పాపను చూసి సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది తులసి. నా పాపను బాగా చూసుకుంటాను, ఇకనుంచి నన్ను గొడ్రాలు అనరు అని భర్త గుండెలపై పడి బాధపడుతుంది తులసి.
మరోవైపు ఏదో ప్లాన్ చేశావు. ఏంటది అని రుద్రాణిని అడుగుతారు రాహుల్, రేఖ. నువ్వు ఒక దొంగల హాస్పిటల్‌లో తిరుగుతున్నావ్. నాకు ఇచ్చిన మాట మర్చిపోయావ్ అని రేఖ అంటుంది. వాళ్ల జీవితం అల్లకల్లోలం కానుంది. మినిస్టర్ కలిసినప్పటి నుంచి దుగ్గిరాల ఇంట్లో కన్నీళ్లు మొదలవుతాయి. అతని ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నాను అని మంత్రితో మాట్లాడింది మొత్తం చెబుతుంది రుద్రాణి.
రుద్రాణితో కుమ్మక్కైన మంత్రి
ఇంతలో రుద్రాణికి మినిస్టర్ కాల్ చేస్తాడు. మంత్రి నాతో చేతులు కలుపుతున్నాడు. రాజ్, కావ్యల కౌంట్‌డౌన్ మొదలైందని రుద్రాణి అంటుంది. నా భార్య బతకాలి, నా బిడ్డ ప్రమాదం గురించి తెలియకూడదు. నా బిడ్డ స్థానంలోకి మరో బిడ్డ రావాలి. బిడ్డలను మార్చడానికి నేను రెడీ అని మంత్రి అంటాడు. ఎవరి పాపను మార్చాలని మమత్రి అంటే.. రుద్రాణి చూపిస్తుంది.
రాజ్, కావ్యలను కూడా చూపిస్తుంది రుద్రాణి. మరి వాళ్లు నాకు ఇవ్వడానికి ఒప్పుకుంటారా అని మంత్రి అంటే.. ఎవరైనా నిజం చెబితే ఒప్పుకుంటారా. ఎవరికి చెప్పకుండా తల్లిదండ్రులకు తెలియకుండా పాపలను మార్చేయాలి. అందుకు డాక్టర్ చక్రవర్తిని కొనేయండి. అతనితో బిడ్డలను మార్చండి అని రుద్రాణి చెబుతుంది. చక్రవర్తి ఒప్పుకోడు, నిజాయితీపరుడు అని మంత్రి అంటాడు.
నర్స్‌ను కొనేసిన మంత్రి
అయితే, నర్స్ నీలవేణి ఒప్పుకుంటుందిగా. తనకు జీతం 15 వేలు అని రుద్రాణి అంటుంది. దానికి సరే అంటాడు మంత్రి. ముందు నీలవేణిని కొనేయండి. అర్ధరాత్రి 12 గంటలకు ముహుర్తం అని రుద్రాణి అంటుంది. సరే ఇదంతా మీరెందుకు చేస్తున్నారని మంత్రి అడిగితే.. నా పిల్లల భవిష్యత్తు కోసం అని రుద్రాణి అంటుంది. తర్వాత రాత్రి నర్స్ నీలవేణి ఇద్దరు బిడ్డలను మార్చేస్తుంది.
కొన్ని రోజుల తర్వాత కావ్య దగ్గరికి వచ్చిన డాక్టర్ పాప ఇప్పుడు బాగుంది. ఇంకా ఒక్కరోజు గడిస్తే మీ దగ్గరికి పాప వస్తుందని డాక్టర్ చెబుతుంది. తర్వాతి రోజు హాస్పిటల్‌కు దుగ్గిరాల ఇంటిల్లిపాది వస్తారు. ఈరోజు పాపను ఇంక్యూబెటర్ నుంచి తీసుకొస్తారుగా. అలాంటప్పుడు ఇంట్లో ఎలా ఉంటాం అని అంటారు. తర్వాత మంత్రి పాప కావ్య దగ్గరికి డాక్టర్, కావ్య బిడ్డను తులసి దగ్గరికి నర్స్ తీసుకెళ్లి ఇస్తారు.
హాస్పిటల్ పిచ్చిదానిలా కావ్య
పాపను చూసి తులసి మురిసిపోతుంది. తిరుమల దర్శనం చేసుకోవాలని తులసి అంటే.. శ్రీవారికి కోటి రూపాయల కానుక కూడా వేస్తానని మొక్కుకున్న అంటాడు మంత్రి ధర్మేంద్ర. మరోవైపు పాపను ఎత్తుకున్న కావ్య ఈ పాప మన పాప కాదు అంటుంది. దానికి అంతా షాక్ అవుతారు. ఈ పాప నాకు పుట్టిన పాప కాదు అని కావ్య అంటే.. ఎందుకిలా చేస్తున్నావ్ అని డాక్టర్ అంటుంది.
మీరు అబద్ధం చెబుతున్నారు. ఈ పాపను హత్తుకుంటే నాకు తల్లి ఫీలింగ్ రావట్లేదు అని గోల చేస్తుంది కావ్య. తర్వాత హాస్పిటల్‌లో ఉన్న పాపలను ఎత్తుకుంటూ పిచ్చిదానిలా చేస్తుంది కావ్య. కావ్య అందరి పాపలను చెక్ చేస్తుందని వెంటనే డిస్‌ఛార్జ్ అయి వెళ్లిపోండని మంత్రికి చెబుతుంది రుద్రాణి. దాంతో మంత్రి తప్పించుకుని వెళ్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


