బ్రహ్మముడి జనవరి 5 ఎపిసోడ్: రుద్రాణి విష ప్రయోగం బయటపెట్టిన కనకం- సీమంతంలో పసరు మందు వీరయ్యను లాక్కొచ్చిన కావ్య తల్లి

బ్రహ్మముడి సీరియల్ జనవరి 5 ఎపిసోడ్‌లో పసరు మందు వీరయ్య దగ్గర మందు తీసుకుని రుద్రాణి వెళ్తుంటే కనకం ఆపుతుంది. ఏదోటి కవర్ చేసి వెళ్లిపోతుంది రుద్రాణి. రాజ్ బంగారు గాజులు తీసుకొస్తే మట్టి గాజుల గురించి గొప్పగా చెబుతుంది కనకం. సీమంతంలో కావ్యపై రుద్రాణి విష ప్రయోగం గురించి బయటపెడుతుంది కనకం.

Published on: Jan 5, 2026, 07:59:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పసరు మందు వీరయ్య కోసం రుద్రాణి ఎదురుచూస్తుంటుంది. ఇంతలో వస్తాడు. రెండో పసరు మందు ఇస్తాడు వీరయ్య. ఇది కడుపులోకి వెళితే పేగులతో సహా బయటకు వచ్చేయాల్సిందే అని వీరయ్య చెబుతాడు. ఆ మందు తీసుకుంటుంది రుద్రాణి. వీరయ్య వెళ్లిపోతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 5 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 5 ఎపిసోడ్

పసరు మందుతో దొరికిన రుద్రాణి

పసరు మందు పట్టుకుని రుద్రాణి కంగారుగా వస్తుంటుంది. ఇంతలో కనకం ఎదురు వస్తుంది. ఏంటది అని అడుగుతుంది. దేని గురించి అని రుద్రాణి అంటే.. నీ కొంగుచాటున దాచి ఉంచింది అని నిలదీస్తుంది కనకం. అలా పసరు మందుతో కనకంకు రుద్రాణి దొరికిపోతుంది. ఇదిగో చూడు. పసరు మందు. అజీర్తిగా ఉంది. అందుకు పసరు మందు తాగమన్నారు. అందుకే అని వెళ్లిపోతుంది రుద్రాణి.

అజీర్తికి అయితే పొద్దున, మధ్యాహ్నమమో, సాయంత్రమో తెప్పించుకోవాలి కానీ ఇంత రాత్రి పూట తెప్పించుకోవడం ఏంటీ. ఇదేదో తేడాగా ఉందే. తెలుసుకుని తీరాల్సిందే అని కనకం డౌట్ పడుతుంది. మరుసటి రోజు ఉదయం కావ్య, అప్పులకు సీమంతం ఏర్పాట్లు చేస్తుంటారు.

మట్టి గాజుల గొప్పతనం గురించి

ఇంతలో రాజ్ వచ్చి అప్పు, కావ్యకు స్పెషల్‌గా బంగారు గాజులు తయారు చేయించినట్లు చెప్పి చూపిస్తాడు. అవి చూసి అంతా సంతోషిస్తారు. మట్టి గాజులు ఏవి కనకం అడుగుతుంది. బంగారు గాజులు అలంకరణ కోసం, మట్టి గాజులు ఆరోగ్యం కోసం. గర్భవతికి వేసే మట్టి గాజులు సాంప్రదాయానికి సంబంధించి ఉంటుందని అని కనకం అంటుంది.

మట్టి గాజుల వల్ల వచ్చే ఉపయోగాలను కనకం చెబుతుంది. ఇందులో ఇంత సైన్స్ ఉందని తెలియకా బంగారు గాజులు తెప్పించాను. అరగంటలో మట్టి గాజులు తెప్పిస్తాను అని రాజ్ అంటాడు. మరోవైపు కావ్యకు రాజ్ సాంబ్రాణి తీసుకొచ్చి ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారో తెలుసు. ఈ టైమ్‌లో హద్దులు దాటితే కష్టం అని కావ్య అంటుంది. తర్వాత కావ్యను రాజ్ రెడీ చేస్తాడు.

లేడి ప్రవచనకర్తగా కనకం

మరోవైపు అప్పును కల్యాణ్ రెడీ చేస్తాడు. కల్యాణ్ దూస్తే పాపిడి తీయొద్దు. మా అమ్మ చెప్పిందని అప్పు అంటుంది. మీ అమ్మ లేడి ప్రవచనకర్తగా ఉన్నట్లు ఉందే అని కల్యాణ్ అంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ ఇలా చేస్తే ఇక రెడీ అయినట్లే అని కల్యాణ్‌ను పంపిస్తుంది. ధాన్యలక్ష్మీ చూపించే ప్రేమకు అప్పు ఎమోషనల్ అవుతుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా. క్షమించండి అని అంటుంది.

మొదట నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా కదా. నువ్వే నన్ను క్షమించాలని ధాన్యలక్ష్మీ అంటుంది. అప్పును రెడీ చేసి కుందనపు బొమ్మల ఉన్నావ్ అని హగ్ చేసుకుంటుంది అత్త. అప్పు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు కావ్య సీమంతం జరిగే రోజే నీకు, నీ బిడ్డకు ఆఖరు రోజు. రాజ్ గాడి లైఫ్ అల్లకల్లోలం కాబోతుంది అని రుద్రాణి అనుకుంటుంది.

రుద్రాణి బాగోతం బయటపెట్టిన కనకం

ఇంతలో రేఖ వచ్చి త్వరగా కషాయంలో పసరు మందు కలిపేద్దాం అని చెబుతుంది. కావ్య గదిలోనే ఉంటుంది. ఇది ఇంకా సింగారించుకుంటూనే ఉందని రుద్రాణి, రేఖ అనుకుంటారు. ఇంతలో కనకం వచ్చి కావ్య అత్తింటికి వచ్చిన మొదట్లో జరిగిన విషయాల గురించి తలుచుకుని ఏడుస్తుంది. అత్తింటి వారి గురించి గొప్పగా చెబుతుంది కావ్య.

కావ్య, అప్పుకు సీమంతం చేస్తారు. కావ్యకు రుద్రాణి బొట్టు పెడుతుంటే కనకం వచ్చి అడ్డుకుంటుంది. పసరు మందు వీరయ్యను కూడా లాక్కొచ్చి కావ్య తాగే కషాయంలో విషం కలిపే ప్రయత్నం చేసిందని రుద్రాణి బాగోతం అంతా చెబుతుంది. దానికి అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More