బ్రహ్మముడి డిసెంబర్ 31 ఎపిసోడ్: రాజ్ కారులో దొంగ బంగారం- రాహుల్‌పై అప్పు డౌట్- కల్యాణ్ మాయ-రేఖ సూసైడ్, కావ్య స్థానంలోకి!

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 31 ఎపిసోడ్‌లో సాండీ దగ్గర నుంచి దొంగ బంగారం తీసుకున్న రాహుల్ రాజ్ కారులో పెట్టాలని ట్రై చేస్తాడు. కానీ, ఇంతలో అప్పు చూసి అనుమానిస్తుంది. దానికి రాహుల్ కంగారు పడతాడు. మరోవైపు రేఖ సూసైడ్ చేసుకుంటే రాజ్ కాపాడుతాడు. రుద్రాణి దగ్గరికి వెళ్లి రాజ్ బావ కావాలని అడుగుతుంది రేఖ.

Published on: Dec 31, 2025, 08:23:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ మనసులో, కళ్లలో, ఒళ్లంతా కావ్య అని నాకు తెలుసు. కానీ, ఆయన్ను ఏడిపించడానికి నాకు టైమ్ దొరికింది. అందుకే కాస్తా ఏడిపిస్తున్నా అని కావ్య అంటుంది. ఎంతటీ ఖిలాడీవే నువ్వు అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు సాండీ దగ్గర నుంచి స్మగ్‌ల్డ్ గోల్డ్ తీసుకుంటాడు రాహుల్.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 31 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 31 ఎపిసోడ్

రాజ్ బతిమిలాట

అది రాజ్ కారులో పెట్టగలిగితే ఆట రసవత్తరంగా ఉంటుంది అని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు కావ్యను అన్నం తినమని రాజ్ బతిమిలాడుతాడు. అన్నం తిని కషాయం తాగాలి అని రాజ్ అంటే మాకు పాస్తాలు తెప్పించండి అని కావ్య ఏడిపిస్తుంది. ఆ మాటలు రేఖ వింటుంది. ఇంకోసారి అవన్నీ జరగవు. నువ్వు తిట్టు కొట్టు కానీ అన్నం తినకుంటే నా మీద ఒట్టు అని రాజ్ అంటాడు.

దాంతో కావ్య అన్నం తింటుంది. అది చూసి అసూయ పడుతుంది రేఖ. మరోవైపు రాత్రి దొంగ బంగారం ఉన్న బ్రీఫ్ కేస్ రాజ్ కారులో పెట్టాలని కారు దగ్గర ఉండి ఆలోచిస్తాడు రాహుల్. ఇంతలో అప్పు వచ్చి ఏం చేస్తున్నావ్. రాజ్ బావ కారు వైపే అలా ఎందుకు చూస్తున్నావ్ అని అడుగుతుంది. ఈ కారు బాగుంది. ఇలాంటిదే తీసుకుందామని కంగారుపడుతాడు రాహుల్.

మరి దానికి చెమటలు ఎందుకు పడుతున్నాయి. చేతిలో ఆ బ్రీఫ్ కేస్ ఏంటీ. ఎక్కడి నుంచి వస్తున్నావ్ అని అప్పు అడుగుతుంది. చెమటులు జిడ్డుతో అంటూ రాహుల్ అంటుంటే స్వప్న వచ్చి అడ్డుపడుతుంది. రాహుల్ వచ్చి అని అప్పు అంటే.. రాహుల్ కాదు బావ. బావ అని పిలువు అని స్వప్న అంటుంది. అదే బావ వచ్చి కంగారుపడుతుంటే అని అప్పు దొంగలా కనిపిస్తున్నాడా అని స్వప్న అంటుంది.

రాహుల్ కంగారు

అలా అడుగు అని రాహుల్ అంటే.. నువ్వింకా సమాధానం చెప్పలేదని అప్పు అంటుంది. నా ఫ్రెండ్ ఊరేళ్లాడు. అతను వచ్చే వరకు ఈ బ్రీఫ్ కేసు నా దగ్గర ఉంచమన్నాడు. రేపు ఇవ్వొచ్చులే అని తీసుకొచ్చాను. సరిపోయిందా సమాధానం అని రాహుల్ అంటాడు. సరిపోయింది. నువ్వు వెళ్లు రాహుల్ అని స్వప్న అంటుంది. దాంతో రాహుల్ వెళ్లిపోతాడు.

అలా రాహుల్‌ను అప్పు నుంచి స్వప్న కాపాడుతుంది. మరోవైపు రాజ్ ఫోన్ కాల్ మాట్లాడుతుంటే రేఖ కత్తితో సూసైడ్ చేసుకోవాలని చూస్తుంది. అది చూసిన రాజ్ వెళ్లి కత్తి తీసుకుని దూరంగా పడేస్తాడు. చనిపోతేనే ప్రశాంతత. ఒంటరితనం పట్టి పీడిస్తుంది అని రేఖ అంటుంది. నేనున్నాగా. ఓ గైడ్‌లా ఉంటా. కష్టం వస్తే తోడుగా ఉంటానని రాజ్ అంటాడు. ప్రామిస్ అని రేఖ అంటే.. ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని వెళ్లిపోతాడు రాజ్.

నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావ్ బావ. నువ్వే నాకు భర్తగా ఎందుకు రాకూడదు. నేనే నీ భార్య కాకూడదు. నా ఆలోచ కరెక్టే కదా అని రేఖ అనుకుంటుంది. మరోవైపు రాహుల్ చేసిన దాని గురించి అప్పు ఆలోచిస్తుంది. ఇంతలో కల్యాణ్ వచ్చి ఓ పాట రాశానని, అది నీ గురించే అని సంతోషంగా చెబుతాడు. అప్పు పరధ్యానంగా ఉంటే కల్యాణ్ అడిగితే.. రాహుల్‌ ప్రవర్తన అనుమానంగా ఉందని అప్పు చెబుతాడు.

కల్యాణ్ మాయ

దాంతో జరిగనవన్ని గుర్తు చేస్తుంది. పోలీస్‌లా ఆలోచిస్తున్నావ్ కాబట్టి అందరూ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది అని కల్యాణ్ నచ్చజెబుతాడు. నువ్వు ప్రతిదీ మాయ చేస్తావ్. సరే నాకోసం రాసిన పాట ఏది అని అప్పు అడిగితే కల్యాణ్ చెబుతాడు. దానికి అప్పు ఎమోషనల్ అవుతుంది. మరోవైపు తల్లి రుద్రాణి దగ్గరికి వెళ్లి చిర్రుబుర్రులాడుతుంది రేఖ.

ఏం కావాలే అని రుద్రాణి అడిగితే.. రాజ్ బావ కావాలి. కావ్యకు పంచే రాజ్ బావ ప్రేమ కావాలి. బావకు దూరంగా ఉండలేకపోతున్నా. కావ్య స్థానంలో నేను ఉండాలి అని రేఖ అంటుంది. అది జరగదు అని రుద్రాణి అంటే.. ఎందుకు జరగదు అని రాహుల్ ఎంట్రీ ఇస్తాడు. ఎన్నో గండాల తర్వాత కావ్య కడుపు నిలబడింది. కావ్యకు ఒక్కటే సంతానం. ఆ బిడ్డ కావ్య కడుపులోనే చస్తే అని రాహుల్ అంటాడు.

ఇంటికి వారసుడు కోసం ఏం చేస్తారు. ఇంట్లోవాళ్లు ఊరుకున్నా కావ్య మాత్రం ఊరుకోదు. ఇచ్చిన మాట ప్రకారం ఇంకో పెళ్లి చేసి అయినా సరే ఇంటికి వారసుడిని ఇవ్వాలనుకుంటుంది అని రాహుల్ అంటాడు. రుద్రాణి, రాహుల్, రేఖ ముగ్గురు ఒక్కటై కావ్య కడుపు పోయేందుకు ప్లాన్ చేస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More