బ్రహ్మముడి డిసెంబర్ 16 ఎపిసోడ్: ఇంటి దొంగను పట్టుకున్న రాజ్, కావ్య.. రాహుల్‌ను కాపాడిన స్వప్న.. కల్యాణ్‌కు ప్రకాశం సాయం

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్ లో ఇంటి దొంగను రాజ్, కావ్య పట్టుకుంటారు. అటు అందరి ముందూ రాహుల్ పరువు పోకుండా స్వప్న కాపాడుతుంది. ధాన్యం నుంచి కల్యాణ్ ను ప్రకాశం రక్షిస్తాడు.

Published on: Dec 16, 2025, 07:56:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 905వ ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠగా సాగింది. రాజ్, కావ్యలకు రాహుల్ షాకివ్వడం, ఎమోషనల్ అయిపోయిన స్వప్న అతన్ని రాజ్ నుంచి రక్షించడం, అటు అప్పు విషయంలో కల్యాణ్ ను తండ్రి ప్రకాశం ఆదుకోవడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి డిసెంబర్ 16 ఎపిసోడ్: ఇంటి దొంగను పట్టుకున్న రాజ్, కావ్య.. రాహుల్‌ను కాపాడిన స్వప్న.. కల్యాణ్‌కు ప్రకాశం సాయం
బ్రహ్మముడి డిసెంబర్ 16 ఎపిసోడ్: ఇంటి దొంగను పట్టుకున్న రాజ్, కావ్య.. రాహుల్‌ను కాపాడిన స్వప్న.. కల్యాణ్‌కు ప్రకాశం సాయం

అంజలి బతికే ఉందన్న అప్పు.. సీఐని కన్విన్స్ చేసి..

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్ అంజలి కేసు విషయంలో సీఐని అప్పు కన్విన్స్ చేసే సీన్ తో మొదలవుతుంది. తప్పిపోయిన అంజలికి సంబంధించిన రిపోర్టులు రావడంతో ఏడాది కిందటి పోస్టుమార్టమ్ రిపోర్టులకు, అంజలికి ఎలాంటి సంబంధం లేదని తేలుతుంది. దానినే సీఐకి చూపించి ఆ పాప బతికే ఉందని, ఆమెను తీసుకొస్తానని చెప్పడంతో సీఐ ఆమెను అభినందించి కేసు కొనసాగించమని అంటాడు.

రాజ్, కావ్యలకు షాక్ ఇచ్చిన రాహుల్

ఇటు రాహుల్ కు బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు కోసం రాజ్, కావ్య, స్వప్న కూడా వెళ్తారు. రాహుల్ ను పొగుడుతూ ఆర్గనైజర్ అవార్డు అందుకోవడానికి స్టేజ్ మీదికి రావాల్సిందిగా కోరతాడు. అప్పుడు రాహుల్ డిజైన్లను స్క్రీన్ పై చూపిస్తారు. అది చూసి రాజ్, కావ్య షాక్ తింటారు. అప్పుడే వెళ్లి రాహుల్ ను నిలదీయాలని రాజ్ భావించినా కావ్య అతన్ని అడ్డుకుంటుంది. రాజ్ ఆవేశంతో రగిలిపోతుంటాడు.

రాజ్ చేతుల మీదుగా అవార్డు

అటు అవార్డు అందుకోవడానికి ముందు రాహుల్ మాట్లాడతాడు. తనకు ఈ ఘనత దక్కడానికి రాజ్, కావ్య కారణమని అంటాడు. ఈ క్రమంలో తనకు వెన్నంటి ఉన్న తన భార్య స్వప్నకు అవార్డును అంకితమిస్తాడు. అంతేకాదు రాజ్ చేతుల మీదుగా ఆ అవార్డు అందుకోవాలనుకుంటాడు. దీంతో ఇష్టం లేకపోయినా రాజ్ స్టేజ్ మీదికి వెళ్లి ఆ అవార్డు ఇచ్చి కంగ్రాట్స్ చెబుతాడు. కిందికి రాగానే కావ్య, రాజ్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతారు.

కల్యాణ్‌ను కాపాడిన ప్రకాశం

ఇటు ఇంట్లో అప్పు కోసం ధాన్యలక్ష్మి భోజనం తీసుకెళ్తుండగా కల్యాణ్ అడ్డుకుంటాడు. అయినా ఆమె వినకుండా రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ప్రకాశం నిండా కప్పుకొని పడుకొని ఉంటాడు. అతన్ని చూసి అప్పుయే అనుకొని ఆమెకు ఇంకా జ్వరం తగ్గలేదా అని కల్యాణ్ ను ధాన్యం అడుగుతుంది.

అప్పు వచ్చేసిందనుకొని కల్యాణ్ ఊపిరి పీల్చుకుంటాడు. తాను తినిపిస్తానని, నువ్వు వెళ్లు అని తల్లిని పంపించేస్తాడు. ఆ తర్వాత అక్కడుతున్నది ప్రకాశం అని తెలియక బెడ్ పైకి వెళ్లి సరసాలు ఆడతాడు. అప్పుడే ప్రకాశం లేవడంతో అతన్ని చూసి కల్యాణ్ షాక్ తింటాడు.

రాజ్‌ను ఆపిన కావ్య.. నిందించిన రాజ్

ఇటు రాజ్ ఆవేశంతో రగిలిపోతాడు. మన డిజైన్లను దొంగిలించి అవార్డు అందుకున్నాడు.. అతన్ని అందరి ముందూ నిలదీస్తానని అంటాడు. దీంతో అలా చేస్తే మన ఇంటి పరువే పోతుందని కావ్య అతన్ని ఆపుతుంది. అయినా వినకుండా అందరి ముందూ రాహుల్ పరువు తీస్తానని ముందుకు వెళ్తాడు.

అప్పుడే స్వప్న ఎమోషనల్ అవుతూ రాజ్ ముందుకు వస్తుంది. ఇదంతా నీ వల్లే సాధ్యమైందని రాజ్ ను పొగుడుతుంది. తన భర్తకు ఈ విలువ కోసమే తాను ఎదురు చూశానని, ఇక నుంచి మీ మాట నిలబెడతాడని, కష్టపడి పని చేసి ఎదుగుతాడని స్వప్న కంటతడి పెడుతూ రాజ్ తో అంటుంది. ఆమె మాటలు విన్న రాజ్ రాహుల్ ను నిలదీయడాన్ని విరమించుకుంటాడు.

మరోవైపు ఆఫీసులో ఆ డిజైన్లను రాహుల్ కు చేరవేస్తున్న దొంగను పట్టుకోవడానికి రాజ్, కావ్య ప్లాన్ చేస్తారు. ఆఫీసులో అందరినీ నిలదీస్తారు. వాళ్లందరి ముందే కావాలని కొత్త డిజైన్లు తమ క్యాబిన్ లో పెడుతున్నామని కావ్య అంటుంది. ఆ డిజైన్లను దొంగిలిస్తుండగా దొంగను రాజ్, కావ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More