బ్రహ్మముడి డిసెంబర్ 13 ఎపిసోడ్: రాహుల్‌కు అవార్డ్- మోసం బయటపెడతానన్న సుభాష్- కావ్య వైద్యం ఫలించిందని ఇంట్లో చెప్పిన రాజ్
బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో కావ్యకు చేసిన ఆయుర్వేద వైద్యం ఫలించిందని గురూజీ చెబుతాడు. సంతోషంగా రాజ్, కావ్య వెళ్తారు. రాహుల్ మోసాన్ని బయటపెడతానని, మొదటిసారి ఓటమి చూశానని అపర్ణతో సుభాష్ అంటాడు. ఇంటికొచ్చిన రాజ్, కావ్యలను అపర్ణ నిలదీస్తుంది. దాంతో కావ్య వైద్యం గురించి చెబుతారు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్యకు వారం రోజులుగా ఇచ్చిన చికిత్సకు 99 శాతం ఫలితం వచ్చినట్లే. మేము అందించాల్సిన వైద్యం అందించాం. కానీ, మీరు ఇంటికి వెళ్లాక నెల రోజుల పాటు నేను ఇచ్చిన కషాయం తాగాల్సిందే. లేపనంతో మర్దనం చేయాలి. ఇవన్నీ క్రమంతప్పకుండా చేస్తే పూర్తి ఫలితం చూడొచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని గురూజీ చెబుతాడు.

గురూజీ జాగ్రత్తలు
నిర్లక్ష్యం చేయమని, మీ రూపంలో ఆ దేవుడే ఇదంతా చేశాడనిపించింది. మిమ్మల్ని మర్చిపోను అని రాజ్ సంతోషంగా చెబుతాడు. గురూజీ మందులు ఇచ్చి పంపిస్తాడు. రాజ్, కావ్య సంతోషంగా వెళ్తారు. మరోవైపు సుభాష్ కోపంగా ఉంటాడు. అపర్ణ వచ్చి మాట్లాడుతుంది. రాహుల్ వల్ల పది కోట్ల నష్టం వచ్చింది. వాడికి బిజినెస్ చేయాలనిపిస్తే కొత్త క్లయింట్స్‌ను చూసుకోవాలి కానీ మన క్లయింట్స్‌ను లాక్కోవడం ఏంటీ అని సుభాష్ అంటాడు.
మరి అదే అడక్కపోయారా అని అపర్ణ అంటే.. నగల డిజైన్స్ విషమయే నిరూపించలేకపోయాం. ఇప్పుడు అది అడిగితే వాళ్లే వచ్చారంటారు. మొదటిసారి ఓటమి చూశాను. అది నా ప్రమేయం లేకుండా. తప్పు ఎక్కడ జరిగిందో మొత్తం కనుక్కుంటా. అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటా అని సుభాష్ అంటాడు. మరోవైపు అప్పు ఒంటరిగా కూర్చుంటే కల్యాణ్ కాఫీ తీసుకొస్తాడు.
పోస్ట్‌మార్టమ్‌లో తెలుస్తుందిగా
అంజలి ఆచూకీ ఇంకా తెలియట్లేదు అని అప్పు డల్‌గా చెబుతుంది. ఇవాళ రీ పోస్ట్‌పార్టమ్ రిజల్ట్స్ వస్తుందిగా. పూర్తిగా తెలిసిపోతుంది. కేసు సాల్వ్ చేయడమే నీ పని. లేని మనుషులను తీసుకురాలేవుగా. వచ్చే రిజల్ట్స్‌ను బట్టి ఆలోచించు అని కల్యాణ్ అంటాడు. అత్తయ్య గుడికి వెళ్దామంటున్నారని అప్పు అంటే.. అది నేను చూసుకుంటానంటాడు కల్యాణ్.
మరోవైపు కావ్య గదిని పని మనిషి క్లీన్ చేస్తుంటే మెడికల్ ఫైల్స్ కింద పడతాయి. వాటిని రుద్రాణి చూస్తుంది. అవి తీసుకొచ్చి హాల్లో పడేస్తుంది. ఎందుకు అలా విసిరేసావని ఇందిరాదేవి అడిగితే.. అబద్ధాలతో, దాగుడుమూతలతో ఇల్లు ఉందనిపిస్తోందనిపిస్తోంది. అంతా కళ్లు తెరిచి ఆ ఫైల్ చూడమని చెబుతుంది. ఫైల్స్ చూసిన సుభాష్ కావ్య సమస్య తీరిపోలేదని, ఇంకా తన ప్రాబ్లమ్ అలాగే ఉందని అంటాడు.
బిడ్డను కంటే కావ్య చనిపోతుంది
కావ్యకు, బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదన్నది అబద్ధం. అందరికి అబద్ధం చెప్పించారు. కావ్య బిడ్డను కనకూడదు. కంటే బిడ్డ మాత్రమే బతుకుతుంది. కావ్య బతకదు అని రుద్రాణి చెబుతుంది. మరి ఇంత పెద్ద విషయాన్ని వాళ్లు ఎందుకు దాచారు అని అపర్ణ అంటుంది. ఇంతలో రాజ్, కావ్య ఇంటికి వస్తారు. ఎందుకు ఇంతల మోసం చేశారు అని కావ్య ప్రెగ్నెన్సీ సమస్య గురించి నిలదీస్తుంది అపర్ణ.
నిజం చెప్పే ధైర్యం లేదు. కావ్యకు అలా జరిగినప్పటి నుంచి ఎవరి మొహాల్లో ఆనందం లేదు. అందరూ జాలితో కావ్య ఉంటే చాలు అంటే తట్టుకోలేకపోయింది. తనకంటే బిడ్డే ముఖ్యమనుకుంది. కళావతిని ఎవరం ఒప్పించలేకపోయాం అని రాజ్ ఎమోషనల్‌గా చెబుతాడు. ఉన్నన్నాళ్లు మీ అందరితో సంతోషంగా గడపాలనుకుంది అని రాజ్ అంటాడు.
వైద్యం ఫలించింది
అవసరం అయితే వేరే దేశం తీసుకెళ్లయిన కావ్యను కాపాడుకునేవాళ్లం కదా అని సుభాష్, అపర్ణ అంటారు. ఆ అవసరం లేదు నాన్న. దేవుడే దారి చూపించారు. కేరళ వరసిద్ధి ఆచార్యుల వారి వైద్యం గురించి తెలిసింది. కేరళ టూర్ అని చెప్పి వైద్యానికి వెళ్లాం. ఆ వైద్యం ఫలించింది. కావ్య ఎలాంటి ప్రమాదం లేకుండా బిడ్డకు జన్మనివ్వొచ్చు అని రాజ్ చెబుతాడు.
తర్వాత కొత్త కంపెనీ పెట్టిన నెలలోపే అభివృద్ధిలోకి తీసుకొచ్చిన రాహుల్‌కు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్‌ను ఇస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


