పవన్ కల్యాణ్ బిగ్గెస్ట్ డ్యాన్స్ బస్టర్.. దేఖ్‌లేంగే సాలా సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పవర్ స్టార్ అదిరిపోయే స్టెప్పులు
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది. దేఖ్‌లేంగే సాలా అంటూ సాగిపోయే ఈ పాట డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. పవన్ బిగ్గెస్ట్ డ్యాన్స్ బస్టర్ అంటూ మేకర్స్ ఈ పాట గురించి చెప్పడం విశేషం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అదిరిపోయే స్టెప్పులేశాడు. అతడు నటిస్తున్న నెక్ట్స్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి దేఖ్‌లేంగే సాలా ఫస్ట్ సింగిల్ ప్రోమోను మంగళవారం (డిసెంబర్ 9) సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ స్టైలిష్ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

దేఖ్‌లేంగే సాలా ప్రోమో రిలీజ్
హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ దేఖ్‌లేంగే సాలా డిసెంబర్ 13న రాబోతోంది. అయితే మంగళవారం (డిసెంబర్ 9) ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కేవలం 25 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో పవన్ వేసిన స్టైలిష్ స్టెప్పులు చూపించి ఈ పాటపై అంచనాలు పెంచేశారు.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాటను బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ పాడాడు. భాస్కరబట్ల పాట రాశాడు. పవన్ కల్యాణ్ బిగ్గెస్ట్ డ్యాన్స్ నంబర్ అంటూ ఈ పాటను మేకర్స్ పరిచయం చేయడం విశేషం. ఈ లెక్కన ఈ పాటలో పవర్ స్టార్ స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
రంపంపం రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం.. దేఖ్‌లేంగే సాలా అంటూ ఈ పాట సాగిపోయింది. డిసెంబర్ 13న పూర్తి పాట రిలీజ్ కానుంది. ఈ చిన్న ప్రోమోలో పవన్ స్టైలిష్ స్టెప్పులే ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి..
హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాశీ ఖన్నా, శ్రీలీల ఇందులో ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చి ఒక బ్లాక్‌బస్టర్ అందుకున్న పవన్ కల్యాణ్.. వచ్చే ఏడాది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ మూవీ నుంచి రానున్న ఫస్ట్ సింగిల్ లోనే పవన్ ను స్టైలిష్ లుక్ లో చూపిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓజీ మూవీని మించి ఈ మూవీ సక్సెస్ అవుతుందన్న నమ్మకం వాళ్లలో కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


