పవన్ కల్యాణ్ స్టైలిష్ స్టెప్పులు.. ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ వీడియోతో టీమ్ షేర్ చేసింది.

Published on: Dec 1, 2025, 20:18:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది రెండు సినిమాల్లో కనిపించిన పవన్ కల్యాణ్ ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో మూవీతో రాబోతున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఆ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. మూవీ టీమ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది.

పవన్ కల్యాణ్ స్టైలిష్ స్టెప్పులు.. ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది
పవన్ కల్యాణ్ స్టైలిష్ స్టెప్పులు.. ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్

పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రానుందంటూ సోమవారం (డిసెంబర్ 1) ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. అయితే దీనికి యాడ్ చేసిన వీడియో పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఇందులో పవర్ స్టార్ ఆ సాంగ్ లోని స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ బిహైండ్ ద సీన్స్ వీడియోను షేర్ చేశారు.

అందులో పవన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేయడం చూడొచ్చు. డైరెక్టర్ హరీష్ శంకర్ అతడు వేసిన స్టెప్పులు చూసి తెగ నవ్వడం, అది చూసి పవర్ స్టార్ కూడా పగలబడి నవ్వడం వీడియోలో కనిపిస్తోంది. డిసెంబర్ నెలలోని ఇంగ్లిష్ పదాల్లో డీసీఎం అనే అక్షరాలను హైలైట్ చేస్తూ.. ఫస్ట్ సింగిల్ త్వరలోనే రానుందని మేకర్స్ వెల్లడించారు.

మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ ఇలా..

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “మీరు ప్రేమించే ఎనర్జీ.. మీరు ఎంజాయ్ చేసే డ్యాన్స్.. మీరు సెలబ్రేట్ చేసుకునే ఆటిట్యూడ్.. మీరు పూజించే మనిషి.. వీటన్నింటినీ ఒక్క పాటలో ఉండేలా చూసుకున్న మా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ అతి త్వరలోనే.. డిసెంబర్ నెలను సెలబ్రేట్ చేసుకోండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక డైరెక్టర్ దశరథ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. రవిశంకర్, నవీన్ యెర్నేని కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More