బ్రహ్మముడి డిసెంబర్ 12 ఎపిసోడ్: పాప కేసులో తండ్రే నిందితుడు- రాహుల్‌ను చెంపదెబ్బ కొట్టిన సుభాష్- బయటపడిన కావ్య సమస్య

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో అంజలి పాప మిస్సింగ్ కేసులో తండ్రే నిందితుడు అని అప్పుకు అనుమానం వస్తుంది. రాజ్, కావ్యలను మురుగన్ నుంచి ఎస్సై కాపాడుతాడు. రాజ్ క్లయింట్స్‌ను తనవైపుకు తిప్పుకున్నాడని రాహుల్‌ను చెంపదెబ్బ కొడతాడు సుభాష్. స్వప్న సాక్ష్యంగా నిలుస్తుంది. కావ్య సమస్య బయటపడుతుంది.

Published on: Dec 12, 2025, 07:03:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పోలీస్ స్టేషన్ నుంచి రేణుక వెళ్తుంటే తన భర్త వస్తాడు. రేణుక భర్తతో మీ పాప బతికే ఉందని అప్పు చెబుతుంది. దాంతో రేణుక భర్త షాక్ అవుతాడు. మీరేంటీ షాక్ అవుతున్నారు. బతికే ఉందంటే ఒక చిన్న క్లూ దొరికింది. మీ ఆవిడ సూసైడ్ చేసుకుంటే మీరేంటీ తాపిగా వచ్చారు అని అప్పు అంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 12 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 12 ఎపిసోడ్

పాప బాడీ రీ పోస్ట్‌మార్టమ్

దానికి మరింత కంగారుపడిపోతాడు రేణుక భర్త. పాప బాడీని రీ పోస్ట్‌మార్టమ్ చేయిస్తున్నామని, డీఎన్ఏ టెస్ట్‌లో కూడా ఎర్రర్ ఉండొచ్చని, అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయని అప్పు అంటుంది. దానికి కంగారుపడిన రేణుక భర్త అశోక్ అలా అయితే మంచిదేగా, వెళ్లొస్తాను అని వెళ్లిపోతాడు. అశోక్ డౌట్‌గా వెళ్లిపోతాడు.

మరోవైపు ఎలాగైనా తప్పించుకోవాలని రాజ్, కావ్య అనుకుంటారు. రాజ్ వెనుక ఉన్న బీర్ సీసా తీసుకుని పగులగొట్టి తాళ్లు కోస్తాడు. ఇంతలో రౌడీలు వచ్చి పెన్‌డ్రైవ్ ఎక్కడ అని అడుగుతారు. ప్యాంట్ పాకెట్‌లో ఉందని, దగ్గరికి రమ్మని చెప్పిన రాజ్ రౌడీలను కొడతాడు. కట్లు విప్పేసుకున్న రాజ్ రౌడీలను చితకబాదుతాడు. కావ్య కట్లు విప్పుతాడు.

రాజ్, కావ్య పారిపోతుంటే గన్ పట్టుకుని రౌడీ గ్యాంగ్ బాస్ మురుగన్ ఎంట్రీ ఇస్తాడు. పెన్‌డ్రైవ్ గురించి అడిగితే మా దగ్గర ఏం లేదు, మా భార్యకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలి, చనిపోయిన వాడికి మాకు సంబంధం లేదు అని రాజ్ చెబుతాడు. కానీ, మురుగన్ వినడు. కాల్చి చంపేస్తానంటాడు. చంపేయమని చోటు, మోటు అంటారు. ఇంతలో ఎస్సై వచ్చి మురుగన్‌కు గన్ పెడతాడు.

రాజ్, కావ్యను కాపాడిన ఎస్సై

పెన్‌డ్రైవ్ ఇచ్చేస్తే మేము వెళ్లిపోతామని మురుగన్ అంటే.. ఎందుకు మేమే తీసుకెళ్లి చిప్పకూడు తినిపిస్తాం. నీ బాగోతం వైరల్ అవుతోంది అని ఎస్సై అంటాడు. రాజ్ మీరు వెళ్లండి, వీళ్లను కేరళ పోలీసులకు అప్పగించి మేము హైదరాబాద్ వస్తామని ఎస్సై అంటాడు. దాంతో రాజ్, కావ్య వెళ్లిపోతారు. మరోవైపు సుభాష్‌కు కాల్ చేసిన శ్రుతి జూబ్లీహిల్స్ క్లయింట్స్ అంతా మనతో బిజినెస్ క్యాన్సిల్ చేసుకున్నారని చెబుతాడు.

రాహుల్ మన క్లయింట్స్‌తో మాట్లాడి తనతో బిజినెస్ డీల్ చేసుకున్నారు. అంతేకాకుండా కావ్య వేసిన డిజైన్స్‌నే తన డిజైన్స్‌గా చూపించి అగ్రిమెంట్ చేయించుకున్నారు అని శ్రుతి చెబుతుంది. రాహుల్ అంత వెన్నుపోటు పొడుస్తాడని నేను అనుకోవట్లేదు. వాడికి అంత ధైర్యం లేదని సుభాష్ అంటాడు. మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఎక్కువగా చెప్పట్లేదు. కావ్య మేడమ్ డిజైన్స్, రాహుల్ చూపించిన డిజైన్స్ మీకు పంపిస్తానని కాల్ కట్ చేస్తుంది శ్రుతి.

ఆ డిజైన్స్ చూసి సుభాష్ షాక్ అవుతాడు. రాహుల్ తప్పు చేశాడు, వెన్నుపోటు పొడిచాడు. వీడిని అస్సలు విడిచిపెట్టకూడదు అని సుభాష్ అనుకుంటాడు. మరోవైపు కావ్యకు గురూజీ ట్రీట్‌మెంట్ చేస్తాడు. గురూజీ అయోమయంగా చూస్తాడు. మరోవైపు రాహుల్ తన డిజైన్స్‌ను, స్వప్న మోడలింగ్‌ను ఇంట్లోవాళ్లకు చూపిస్తాడు. అది చూసి అంతా మెచ్చుకుంటారు.

రాహుల్‌ను కొట్టిన సుభాష్

ఇంతలో సుభాష్ వచ్చి రాహుల్‌ను కొడతాడు. కోపంగా ఉంటాడు. నమ్మకద్రోహం చేశాడు. కావ్య వేసిన డిజైన్స్‌ను నీ డిజైన్స్ అని చూపించుకోడానికి సిగ్గులేదు అని రెండింటిని చూపిస్తాడు సుభాష్. కావ్య వేసిన డిజైన్స్ గురించి నాకు తెలియదు. నేను కష్టపడి వేయించాను అని రాహుల్ అంటే.. నిజమే అంకుల్. నేనే దగ్గరుండి చూశాను అని స్వప్న అంటుంది.

కావ్యకు వచ్చిన ఆలోచన రాహుల్ డిజైనర్‌కు వచ్చిందేమో అని రుద్రాణి అంటుంది. మమ్మీ ఆపు మావయ్య ఎక్కడో పొరపాటు పడి కంపెనీ పరువు పోతుందని చేయి చేసుకున్నారు. తండ్రి స్థానంలో ఉండి ఓ దెబ్బ కొట్టారనుకుంటాను. రెండు డిజైన్స్ ఒకేలా ఎలా ఉన్నాయో తెలియట్లేదు. నేను కష్టపడి వేయించాను. మీరు ఏ శిక్ష వేసిన అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వెళ్లిపోతాడు రాహుల్.

ఏం పర్ఫామెన్స్‌రా. అంతా నమ్మేశారు. ఇక నీకు తిరుగులేదు అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు కావ్యకు చేసిన వారం రోజుల చికిత్సకు 99 శాతం ఫలితం వచ్చినట్లే అని గురూజీ చెబుతాడు. దాంతో రాజ్ సంతోషిస్తాడు.

బయటపడిన కావ్య సమస్య

మరోవైపు కావ్య సమస్య గురించి ఇంట్లో బయటపడుతుంది. ఇంటికొచ్చిన రాహుల్, కావ్యను అపర్ణ వాళ్లు నిలదీస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More