బ్రహ్మముడి డిసెంబర్ 8 ఎపిసోడ్: రాజ్, కావ్య కిడ్నాప్- పోలీసుల చేతికి పెన్‌డ్రైవ్- అప్పుకు సీఐ ఆర్డర్-స్వప్నతో చెల్లి ఓటమి

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 8 ఎపిసోడ్‌లో పాప మిస్సింగ్ కేసు వదిలేయమని, ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో కేజీ బంగారం చోరీ కేసు చూడమని అప్పుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆర్డర్ ఇస్తాడు సీఐ. స్వప్నతో డిజైన్స్ సెలెక్ట్ చేయి తన చెల్లిని తనతోనే ఓడిస్తానని రాహుల్ చెబుతాడు. రాజ్, కావ్యను మోటు, చోటు కిడ్నాప్ చేస్తారు.

Published on: Dec 08, 2025 7:04 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆశ్రమంలో మరోసారి కావ్యను చెక్ చేస్తాడు గురూజీ. ఆయుర్వేదం అందిస్తారు. రాజ్ అక్కడ ఎదురుచూస్తుంటాడు. ఆ ఆశ్రమానికి చోటు, మోటు వస్తారు. రాజ్‌ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. నీ దగ్గర ఉంది నాకు కావాల్సింది ఇవ్వాలి అని మోటు అంటాడు. సరే అని మోటు చెంప పగులగొడుతాడు రాజ్.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 8 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 8 ఎపిసోడ్

చచ్చినవాడి అన్నకు

ఒకదాని కోసం వచ్చినప్పుడు ఇవన్నీ తప్పవని మోటు అంటాడు. చచ్చినవాడి అన్నకు ఏం ఇచ్చావని మోటు అడిగితే.. వీడే తెలియదు వాడెలా తెలుస్తుంది. నేను ఏం ఇస్తాను అని రాజ్ అంటాడు. ఇంతలో పెన్‌డ్రైవ్ ఉందా నీ దగ్గర అని చోటు నోరు జారుతాడు. పెన్‌డ్రైవా.. అదేంటీ. అలాంటిదేది నా దగ్గర లేదని రాజ్ అంటాడు.

పెన్‌డ్రైవ్ ఇస్తావా లేదా అని పదే పదే మోటు అడిగితే.. మరోటి చెంపపై కొడతాడు రాజ్. దాంతో మోటు, చోటు వెళ్లిపోతారు. అప్పుడే వచ్చిన కావ్య వాళ్లను చూస్తుంది. వాళ్లక వార్నింగ్ ఇచ్చి పంపించానని రాజ్ చెబుతాడు. ఇంతలో గురూజీ వచ్చి నేను చేస్తున్న చికిత్స మంచి ఫలితం ఇస్తుంది. ఇలాగే, నేను చెప్పింది చేస్తే మరో ఐదు రోజుల్లో మీరు సంతోషంగా ఇంటికి వెళ్లొచ్చు అని చెబుతాడు.

దాంతో సంతోషించిన రాజ్ ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందామంటాడు రాజ్. మరోవైపు పాప మిస్సింగ్ కేసులో సీసీ కెమెరాల గురించి అడుగుతుంది అప్పు. అవన్నీ డిలీట్ అయ్యాయని, తర్వాత పనిచేయలేదని కానిస్టేబుల్ చెబుతాడు. ఇంతలో సీఐ వచ్చి పాప కేసు వదిలేసి తాను ఇచ్చే వేరే కేసు చూడమని చెబుతాడు. రీ పోస్ట్‌మార్టమ్ గురించి పర్మిషన్ అడుగుతుంది అప్పు.

ఎమ్మెల్యే కొడుకు చోరీ కేసు

షటప్.. ఇకనుంచి పాప మిస్సింగ్ కేసు చూడకు. అది అయిపోయిన కేసు. ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో కేజీ బంగారం పోయిందట. అది ఇన్వెస్టిగేట్ చేయు. లేకపోతే ఇంట్లో కూర్చో అంతే అని ఆర్డర్ వేసి వెళ్లిపోతాడు సీఐ. మరోవైపు బాస్ దగ్గర చోటు మోటు ఉంటారు. మోటుతో గేమ్స్ ఆడి పట్టుకోలేకపోయావురా మోటు అని కొడతాడు బాస్.

పెన్‌డ్రైవ్ దొరకలేదని చెప్పిన మోటు, చోటు ఇద్దరిని పిచ్చి పిచ్చి కొట్టుడు కొడతాడు బాస్. ఆ డేనియల్ గాడు చచ్చేముందు పెన్‌డ్రైవ్ ఇవ్వలేదు. దాని గురించి మర్చిపోండి అని మోటు అంటాడు. ఏంట్రా మర్చిపోయేది. ఆ పెన్‌డ్రైవ్ దొరక్కపోతే నా చావు కన్ఫర్మ్. దాంట్లో నా జీవితం ఉందిరా అని అందులో ఉన్న వీడియోను ఫోన్‌లో చూపిస్తాడు బాస్.

అది చూసి చోటు, మోటు సిగ్గు పడతారు. అందులో బాస్ ఇంటిమేట్ వీడియో ఉంటుంది. మీరు మంచి రసికులే అని చోటు అంటాడు. నేను రసికున్నే. కానీ, అది ఎమ్మెల్యే తాలుకా. ఆ వీడియో కాస్తా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నా పని అయిపోయింది. ఆ డానియల్ గాడు షార్ట్ ఫిల్మ్ తీశాడురా అని భయపడుతాడు బాస్. పెన్‌డ్రైవ్ కచ్చితంగా తీసుకురావాలని దండం పెడతాడు బాస్. దాంతో చోటు, మోటు పెన్‌డ్రైవ్ కోసం వెళ్తారు.

ఇందిరాదేవి సెటైర్లు

మరోవైపు కావ్య అందంగా రెడీ అయి వస్తుంది. పెళ్లాం అయిన నీకు సైట్ కొట్టాలనిపిస్తుందని రాజ్ అంటాడు. పెన్‌డ్రైవ్ అక్కడే పడి ఉంటుంది. ఇంతలో అపర్ణ కాల్ చేసి క్షేమసమాచారాలు అడుగుతుంది. రాజ్, కావ్య ఇంటిమేట్ అవడం గురించి ఇందిరాదేవి సెటైర్లు వేస్తుంది. రూమ్ క్లీన్ చేయమని హోటల్ వాళ్లకు చెబుతామని కావ్య అంటుంది.

మరోవైపు కావ్య వేసిన డిజైన్స్ రుద్రాణికి చూపిస్తాడు రాహుల్. కావ్యను మెచ్చుకున్న రుద్రాణి నీకోసం ఇలా కష్టపడాల్సి వస్తుందనుకోలేదు అంటుంది. స్వప్నను సగం నమ్మించాను. ఇప్పుడు తనతోనే ఈ డిజైన్స్ సెలెక్ట్ చేయించి పూర్తిగా నమ్మిస్తాను అని రాహుల్ అంటాడు. అంటే తన చెల్లెలిని తనతోనే ఓడిస్తున్నావన్నమాట అని రుద్రాణి అంటుంది.

స్వప్న చేసినదానికి ఇంకా బుద్ధి చెప్పాలని రుద్రాణి అంటుంది. ముందు ఇలా చేద్దాం. తర్వాత స్వప్న ఆస్తి రాయించుకుందాం. ఒక్కొక్కరిని ఆడుకుంటాను. వాళ్ల మంచితనమే వాళ్ల పతనానికి కారణం అవుతుంది. రాజ్‌ను గొప్ప బిజినెస్ మ్యాన్ అన్నారుగా. నేను ఎదిగి ఆ రాజ్‌నే నన్ను చూసి నేర్చుకోమనేలా ఎదుగుతాను. నా సాయం రాజ్, కావ్య వేడుకునేలా చేస్తాను అని రాహుల్ అంటాడు.

రాజ్, కావ్య కిడ్నాప్

మరోవైపు పోలీసుతో రాజ్, కావ్య మాట్లాడుతుంటారు. అది చోటు మోటు చూస్తారు. బయటకు వచ్చిన రాజ్, కావ్యను స్పృహ తప్పేలా చేసి కిడ్నాప్ చేస్తారు చోటు మోటు. మరోవైపు రాజ్, కావ్య రూమ్‌లో పెన్‌డ్రైవ్ దొరికిందని, అది వాళ్లకు ఇవ్వమని వెయిటర్‌కు ఒకతను ఇస్తే అతను తీసుకెళ్లి పోలీసుకు ఇస్తాడు.

ఆ పెన్‌డ్రైవ్ రాజ్ వాళ్లకు ఇద్దామని ఎస్సై వస్తుండగా.. రాజ్, కావ్యను కిడ్నాప్ చేయడం చూస్తాడు. వాళ్లను ఫాలో అవుతాడు ఎస్సై. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.