అదిరిపోయే ఓటీటీ న్యూస్- సూపర్ హిట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు మరో ప్రీక్వెల్- ట్రైలర్ రిలీజ్- తెలుగులో స్ట్రీమింగ్- ఎప్పుడంటే?
గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఓటీటీలో సూపర్ హిట్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ నుంచి మరో ప్రీక్వెల్ రానుంది. ఈ సిరీస్‌కు వందేళ్ల క్రితం నాటి కథతో ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు.
ఓటీటీ కంటెంట్‌లో, స్టోరీ, నెరేషన్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ కేవలం ఓటీటీ సిరీస్ మాత్రమే కాదు ఆ ఫ్యాన్స్‌కు ఓ ఎమోషన్ కూడా. అలాంటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమానలకు మేకర్స్ అయన హెచ్‌బీఓ గుడ్ న్యూస్ చెప్పింది.

మరో ప్రీక్వెల్
ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి, ఇప్పటికీ సోషల్ మీడియాలో సీన్స్ వైరల్ అవుతున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి మరో ప్రీక్వెల్ సిరీస్ రానుంది. ఇదివరకే ప్రీక్వెల్‌గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఓటీటీ రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు మరోటి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
ఆ సిరీసే ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ (A Knight of the Seven Kingdoms). ఇటీవలే ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌కు వందేళ్ల కాలానికి ముందు, హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌కు వందేళ్ల తర్వాత జరిగిన కథతో ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్‌ను రూపొందించారు.
నవలల ఆధారంగా
అలాగే, జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన టేల్స్ ఆఫ్ డంక్ అండ్ ఎగ్, ది హెడ్జ్ నైట్ నవలల ఆధారంగా ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో పీటర్ క్లాఫీ పోషించిన 'సర్ డన్‌కన్ ది టాల్' పాత్రను తొలిసారిగా చూపించారు.
అంతేకాకుండా గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో చూపించిన ట్రయల్ బై కంబాట్‌ను ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్‌లో మరింత వివరంగా, సరికొత్తగా చూపించనున్నారు. ఈ సిరీస్‌లో ట్రయల్ బై సెవెన్‌గా సర్వైవల్ ఫైట్‌ను పరిచయం చేయనున్నారు. ఇక ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ట్రైలర్ కామెడీ, యాక్షన్, ఫాంటసీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో సాగింది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో, భారీ అంచనాలతో ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ క్రేజీ బజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇంతటి ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీలోకి వచ్చేయనుంది. వచ్చే ఏడాది అంటే కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 18న ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
అదే ఇండియాలో అయితే జనవరి 19న ఉదయం ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ రిలీజ్ కానుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో కూడా ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్‌లు కూడా తెలుగులో ఉన్నాయి.
తెలుగులోనూ స్ట్రీమింగ్
కాబట్టి, ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ సిరీస్ కూడా తెలుగులో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. డన్‌కన్ అలియాస్ డంక్, టార్గేరియన్ అయిన ఏగాన్ వీ అలియాస్ ఎగ్ కథలను చెప్పే ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్స్‌తో రానుంది.
ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో వారం హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. అలాగే, మొత్తంగా మూడు సీజన్లతో ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఓటీటీ సిరీస్ తెరకెక్కనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


