బ్రహ్మముడి ప్రోమో: రాజ్, కావ్యపై అస్త్రంగా స్వప్న- రాహుల్ సాయం అడుక్కునేలా స్కెచ్- పెన్‌డ్రైవ్ కోసం కొత్త విలన్ ఎంట్రీ

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్ కోసం కొత్త విలన్ ఎంట్రీ ఇస్తాడు. చోటు మోటు వెయిటర్స్‌గా మారి తిప్పలు పడుతుంటారు. మరోవైపు స్వప్నను నమ్మించిన రాహుల్ రాజ్, కావ్యలపై అస్త్రంగా వాడతానని అంటాడు. నట్టేట ముంచి చివరికి తన సాయం కోసం అడుక్కునేలా చేస్తానంటాడు రాహుల్.

Published on: Dec 7, 2025, 08:38:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ఆఫీస్‌లో స్వప్న వచ్చిందని తెలిసి డిజైన్స్ కోసం మరింత డ్రామా చేస్తాడు రాహుల్. అదంతా చూసిన స్వప్న నమ్మేస్తుంది. రాహులే స్వయంగా డిజైన్స్ తయారు చేయించినట్లుగా స్వప్నను నమ్మిస్తాడు.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

అందాల రాశి ఆరోగ్యం

మరోవైపు రెస్టారెంట్‌లో రాజ్, కావ్య కూర్చొంటారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నా అందాల రాశి ఆరోగ్యం కుదుటపడి అద్భుతం జరిగబోతున్న శుభసందర్భంలో నచ్చిన ఫుడ్‌తో మెచ్చిన తీరుగా పార్టీ సెలబ్రేషన్స్ అని రాజ్ అంటాడు. మీరు అంత ఓవర్ చేస్తుంటే నాకు సిగ్గేస్తుందని కావ్య అంటుంది.

ఒక్కసారి సిగ్గుపడు

ఇదే కళావతి నాకు ఇదే కావాల్సింది అని రాజ్ అంటాడు. నేను సిగ్గుపడితే మీకు అంత బాగుంటుందా అని కావ్య సిగ్గు పడుతూ అంటుంది. ఒక్కసారి సిగ్గు పడ్డావనుకో చూసి తరించాలని ఉంది కళావతి అని రాజ్ రిక్వెస్టింగ్‌గా అడుగుతాడు. దానికి కావ్య సిగ్గు పడుతుంది. అది చూసి రాజ్ మురిసిపోతాడు.

వెయిటర్స్‌గా చోటు మోటు

రాజ్ దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్ కోసం చోటు మోటు వస్తారు. అయితే వారిని గుర్తు పట్టకుండా ఉండేందుకు వెయిటర్ డ్రెస్సులో ఉంటారు ఇద్దరు. చోటు మోటు వచ్చి రాజ్, కావ్య ఏం మాట్లాడుకుంటున్నారో వింటారు. కానీ, వారికి పెన్‌డ్రైవ్ గురించి ఏం తెలియకుండా ఉంటుంది.

కొత్త విలన్ ఎంట్రీ

చోటు మోటులను వెయిటర్‌ అనుకుని రాజ్ పిలుస్తాడు. వారి మొహాలు చూపించకుండా ఆర్డర్ తీసుకుని వెళ్లిపోతారు. అలాగే వచ్చి ఫుడ్ పెడతారు. అదంతా కామెడీగా సాగుతుంది. చోటు మోటు ఎంత ట్రై చేసిన పెన్‌డ్రైవ్ దొరకదు. దాంతో అదే విషయం తన బాస్‌కు చెబుతారు చోటు మోటు. అప్పుడే కొత్త విలన్ ఎంట్రీ ఇస్తాడు.

నాకు చావు కన్ఫర్మ్‌రా

పెన్‌డ్రైవ్ తీసుకురాలేకపోయినందుకు మోటును కొడతాడు ఆ విలన్. దాంతో చోటు భయపడిపోతాడు. పెన్‌డ్రైవ్ గురించి విలన్ అడిగితే ఒకరి దగ్గర ఉందని డౌట్‌గా ఉందని రాజ్ గురించి చెబుతాడు చోటు. దాంతో కోపంతో ఊగిపోయిన విలన్ ఆ పెన్‌డ్రైవ్ ఎవరి చేతుల్లో పడ్డా నాకు చావు కన్ఫర్మ్‌రా. ఆ పెన్‌డ్రైవ్ నాకు కావాలి అని అరుస్తాడు.

నా కొడుకువి అనిపించావ్

దాంతో భయపడిన మోటు ఆ పెన్‌డ్రైవ్‌తోనే తిరిగి వస్తామని మళ్లీ వెళ్తారు. మరోవైపు కావ్య చేసిన డిజైన్స్ దొంగలించి అచ్చం అలాగే తయారు చేయించినట్లు రుద్రాణికి చూపిస్తాడు రాహుల్. రాజ్, కావ్య మంచిగా ఆలోచించి నీకు ఆఫీస్ పెట్టిస్తే నువ్వు వాళ్లకే ఎసరు పెడుతున్నావురా. నా కొడుకువి అనిపించావ్ అని రుద్రాణి పొగుడుతుంది.

రాజ్ కావ్య అడుక్కునేలా చేస్తా

ఇప్పుడు ఆ మంచితనమే వాళ్ల పతనానికి కారణం అవుతుంది. ఈ డిజైన్స్‌ను అడ్డుపెట్టుకుని రాజ్ కంపెనీ క్లైంట్స్ అందరిని నావైపు లాక్కుంటాను. వాళ్లు ఎదురు తిరిగితే స్వప్నను రాజ్, కావ్యపై అస్త్రంగా వాడతాను. వారిని నట్టేట ముంచి ఆఖరికి నా సహాయం కోసం ఆ రాజ్, కావ్య అడుక్కునేలా చేస్తాను అని రాహుల్ తన స్కెచ్ గురించి చెబుతాడు.

అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More