బ్రహ్మముడి డిసెంబర్ 4 ఎపిసోడ్: కేరళలో రాజ్, కావ్య ప్రాణాలకు ప్రమాదం- వారం రోజుల్లో జీవితాలన్ని నాశనం చేస్తానన్న రాహుల్

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 4 ఎపిసోడ్‌లో వారం రోజుల్లో కావ్యను పూర్తిగా నయంతో ఇంటికి తీసుకు రావాలని రాజ్, కేసు క్లోజ్ చేయాలని అప్పు అనుకుంటే.. అందరి జీవితాలను నాశనం చేస్తానని రాహుల్ అనుకుంటాడు. కేరళలో కావ్యకు గురూజీ చికిత్స ప్రారంభిస్తాడు. కానీ, రాజ్, కావ్యకు రౌడీల వల్ల ప్రమాదం ఏర్పడుతుంది.

Published on: Dec 4, 2025, 07:06:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో వారం రోజుల్లో నీకు పూర్తిగా నయం అయ్యాకే ఇంట్లో అడుగుపెట్టాలని కావ్యతో రాజ్ అంటాడు. వారం రోజుల్లో కేసు పూర్తి చేసి అత్త కోరుకున్న కోడలిగా ఇంట్లోనే ఉంటాను అప్పు అంటుంది. వారం రోజుల్లో మీ జీవితాలన్నీ పూర్తిగా నాశనం చేస్తాను అని రాహుల్ అనుకుంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 4 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 4 ఎపిసోడ్

ఇల్యూజనేషన్ ఎక్కువవుతోంది

మరోవైపు తన కూతురును చూసిన ప్లేసును అప్పుకు రేణుక చూపిస్తుంది. రేణుక భర్త వచ్చి మళ్లీ అలాగే మీకు చెప్పిందా. రోజు రోజుకు తన సమస్య ఎక్కువ అవుతుంది. ఇల్యూజనేషన్ ఎక్కువ అవుతుంది. మళ్లీ మీరు వచ్చి ఆశలు రేపుతున్నారు అని రేణుక భర్త అంటాడు. నిజ నిజాలు నేను తేలుస్తాను. మీరు రేణుకను లోపలికి తీసుకెళ్లండని అప్పు అంటుంది.

ఇంటి పక్కన ఉన్న ఒక ఆవిడను అడిగితే పాప చనిపోయిందని, ఆమె మాత్రం బతికే ఉందని చెబుతుందని చెబుతుంది. చుట్టు పక్కల వాళ్లను అడిగితే అదే చెబుతారు. రాజ్, కావ్య కేరళ వెళ్తారు. మరోవైపు కావ్య డిజైన్స్ దొంగతనంగా సతీష్ తీసుకొస్తాడు. అవి చూసి రాహుల్ మురిసిపోతాడు. కానీ, సతీష్ భయపడతాడు. రాజ్ సర్‌ చంపేస్తాడేమో అంటే పచ్చనోట్లతో బతికిస్తా అని రాహుల్ అంటాడు.

వీటిలాగే డిజైన్ చేయాలి

ఇప్పుడు ఈ డిజైన్స్ మనవి అనేలా లోకాన్ని నమ్మించాలి. మనకో కొత్త డిజైనర్ కావాలి. వాడు అచ్చం ఇలాగే వీటిని డిజైన్ చేయాలని రాహుల్ అంటాడు. సరేనని సతీష్ వెళ్లిపోతాడు. కేరళలోని సింధూర గ్రామంలో వరసిద్ధి ఆచార్యుల శిష్యుడు ఆశ్రమాన్ని చూపిస్తాడు. అక్కడ ఒకావిడ యాక్సిడెంట్‌లో కాళ్లు విరిగి నయం కావడాన్ని చెబుతుంది.

గురువు దగ్గరికి కావ్య, రాజ్ వెళ్తారు. కావ్య రిపోర్ట్స్ చూపిస్తాడు రాజ్. సమస్య అర్థమైందన్న గురూజీ సైన్స్‌కు అందనివి ప్రకృతి చూపిస్తుంది. ప్రకృతి అంటే అమ్మవారు. మన రుగ్మలతన్నీ దూరం చేస్తుంది అంటాడు. కావ్యను గదిలో చెక్ చేస్తాడు గురూజీ. పక్కనున్న కోమలితో తైలం రాయిస్తాడు. తర్వాత మళ్లీ చూసిన గురూజీ బయటకు వెళ్లి రాజ్‌తో మాట్లాడుతాడు.

గురూజీ ప్రకృతి వైద్యం

కంగారుపడాల్సిన అవసరం లేదు. మీరు బస చేసిన చోట నేను ఇచ్చిన కషాయం వాడాలి, అలాగే గుళికలు వేసుకోవాలి. తర్వాత తైలం తయారు చేస్తాను. దాన్ని సాయంత్రం అమ్మాయి పొట్ట మీద సున్నితంగా రాయాలి. ప్రతిరోజు ఉదయం ఇక్కడికి తీసుకురండి. ఆ ప్రకృతి ఒడిలో ధ్యానం చేయించాలి. కానీ, కషాయం, గుళికలను నిర్లక్ష్యం చేయొద్దు అని గురూజీ చెబుతాడు.

ఎంతో నమ్మకంతో వచ్చాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి అని రాజ్ అంటాడు. వ్యతిరేక భావన వదిలేయండి. ప్రకృతిని విమర్శించకండి. మా శిష్యుడు అన్ని మీకు చెబుతాడు అని పంపిస్తాడు గురూజీ. తాము ఉండేచోటుకు రాజ్, కావ్య వెళ్తారు. రాజ్ తెగ సంతోషంగా ఉంటాడు. నా కళావతి నాకు ఎప్పటికీ దూరం కాదని రాజ్ సంబరపడిపోతాడు.

శాలువ కప్పి

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆ పంతులు గారికి శాలువ కప్పి సన్మానం చేయాలని రాజ్ అంటాడు. మరోవైపు ఓ వ్యక్తిని రౌడీలు తరుముతుంటారు. ఆ వ్యక్తి రక్తపు మరకలతో రాజ్ కారుకు ఎదురుగా వచ్చి పడతాడు. దాంతో రాజ్ కారు ఆపుతాడు. అతనితో మాట్లాడుతాడు. అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అదంతా రౌడీలు చూస్తారు.

రాజ్‌కు వాళ్ల గురించి ఏదో చెప్పారని, రాజ్, కావ్యను వదలకూడదని రౌడీలు అనుకుంటారు. దాంతో కేరళలో రాజ్, కావ్యకు ప్రమాదం ఏర్పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More