బ్రహ్మముడి డిసెంబర్ 2 ఎపిసోడ్: కావ్యకు చికిత్స కోసం కేరళకు రాజ్.. స్వరాజ్ గ్రూపును లేకుండా చేస్తానన్న రాహుల్
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 2) ఎపిసోడ్ లో కావ్య ప్రాణాలు కాపాడుకోవడానికి రాజ్ కు ఓ మార్గం దొరుకుతుంది. దీనికోసం వాళ్లు కేరళ బయలుదేరంగా.. ఈవారం రోజుల్లో స్వరాజ్ గ్రూపును లేకుండా చేస్తానని రాహుల్ అనుకుంటాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు అంటే 893వ ఎపిసోడ్ లో రాజ్, కావ్యకు పెద్ద ఊరట కలిగించే కేరళ వైద్యం గురించి తెలుస్తుంది. దీంతో కావ్యను బతికించుకోవచ్చని రాజ్ సంబరపడిపోగా.. అదే సమయంలో స్వరాజ్ కంపెనీని దెబ్బ తీయడానికి రాహుల్ ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుడిలో కళ్లు తిరిగి పడిపోయిన కావ్య
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 2) ఎపిసోడ్ గుడిలో రాజ్, కావ్య ఒకరినొకరు టీజ్ చేసుకోవడంతో మొదలవుతుంది. పంతులుగారు తనను గుర్తు పట్టకపోవడంతో రాజ్ కాస్త ఉడుక్కుంటాడు. దీంతో కావ్య అతన్ని మరింత టీజ్ చేస్తుంది.
ఆ తర్వాత గుడిలో కూర్చొందామని ఇద్దరూ వెళ్తుండగా.. కావ్యకు కళ్లు తిరుగుతాయి. కింద పడిపోతుండగా రాజ్ ఆమెను పట్టుకుంటాడు. వెంటనే హాస్పిటల్ కు వెళ్దామని రాజ్ అనడంతో.. ఇలా అప్పుడప్పుడూ జరుగుతుందని డాక్టర్ ముందే చెప్పిందిగా అని కావ్య అంటుంది.
రాజ్, కావ్యలకు పరిష్కారం చెప్పిన పంతులు
అందుకే బిడ్డ వద్దు అబార్షన్ చేసుకోమంటే వినలేదు అని కావ్యను మరోసారి రాజ్ మందలిస్తాడు. వాళ్ల మాటలను విన్న పంతులుగారు అలా అంటావేంటి బాబు అని అడుగుతాడు. ఆడదానికి గర్భం దేవుడిచ్చిన వరం.. దానిని తీసేయమంటావేంటని అంటాడు. బిడ్డను కంటే కావ్య చనిపోతుందని రాజ్ చెబుతాడు.
తన కూతురికీ ఇలాంటి సమస్యే వచ్చిందని, అయితే ఆ దేవుడే దారి చూపించి కేరళలోని అలెప్పీ దగ్గర ప్రకృతి వైద్యంతో నయమైందని పంతులు చెబుతాడు. దీంతో రాజ్, కావ్య చాలా సంతోషిస్తారు. వెంటనే కేరళ వెళ్దామని డిసైడవుతారు. ఇంట్లో టూర్ కెళ్తున్నామని చెప్పాలనుకుంటాడు.
రాహుల్‌కు షాకిచ్చిన స్వరాజ్ క్లైంట్లు
ఇటు స్వరాజ్ గ్రూపు క్లైంట్లను తన వైపుకు తిప్పుకోవడానికి రాహుల్ వాళ్లను తన కంపెనీకి పిలిపిస్తాడు. మీరు స్వరాజ్ కంపెనీని వదిలేసి తనతో చేతులు కలిపితే వాళ్ల కంటే ఎక్కువ మార్జిన్ ఇస్తానని ఆఫర్ ఇస్తాడు. కానీ వాళ్లు మాత్రం అతని మాటలను నమ్మరు.
ఆ గ్రూపు చాలా పాతది.. అక్కడ కావ్య చేసే డిజైన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.. మీ కంపెనీని ఎవరు నమ్ముతారు.. ఇది కోట్లకు సంబంధించిన విషయం.. మేము వచ్చే ప్రసక్తే లేదని చెప్పి వెళ్లిపోతారు. దీంతో రాహుల్.. కావ్య వేసిన డిజైన్లను తాను తీసుకొస్తానని మేనేజర్ మూర్తితో చెబుతాడు.
కొత్త డిజైన్లు శృతికి ఇచ్చిన రాజ్, కావ్య
ఇటు ఆఫీసుకు వచ్చిన రాజ్, కావ్య కొత్త డిజైన్లను శృతికి ఇస్తారు. కొత్త ఏడాదిలోపు వీటిని మార్కెట్ లోకి తీసుకురావాలని, అప్పటి వరకూ ఈ డిజైన్లు లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని రాజ్ ఆమెకు చెబుతాడు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి ఎవరూ రాకుండా చూడాలని, సెక్యూరిటీని పెంచాలంటాడు. ఇటు కావ్య కూడా అదే చెబుతుంది. తాము కొన్ని రోజులు ఆఫీసుకు రామని చెబుతారు. తాను చూసుకుంటానని శృతి అంటుంది.
కేరళ వెళ్తున్నామని చెప్పిన రాజ్, కావ్య
ఇటు ఇంట్లో సుభాష్, ప్రకాశం తమ పెళ్లాలతో ఆడుకుంటూ ఉంటారు. కాఫీలో చక్కెర ఎక్కువైందని, టీలో డికాక్షన్ తక్కువైందని వాళ్లు అంటారు. కోడళ్లకు ఎందుకు అలా వేధిస్తున్నారని ఇందిరా దేవి తన కొడుకులను తిడుతుంది. ఇక నుంచి ఆ సమస్య ఉండదంటూ రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. తాము వారం రోజులు ఉండబోమని, మీరే ఆఫీసుకు వెళ్లాలని తండ్రి, బాబాయ్ లతో చెబుతాడు రాజ్.
అప్పుడే రాహుల్ కూడా ఇంటికి వస్తాడు. కావ్య డిజైన్లను తీసుకోవడానికి ఇదే సరైన టైమ్ అని అనుకుంటాడు. ఇటు రాజ్, కావ్య కేరళ టూర్ కు బయలుదేరుతారు. వారం రోజుల్లో కావ్యకు పూర్తిగా నయమవ్వాలని రాజ్ కోరుకుంటాడు. అటు ఇదే వారం రోజుల్లో పాప మిస్సింగ్ కేసును పరిష్కరిస్తానని అప్పు అనగా.. ఈ టైమ్ లోనే స్వరాజ్ కంపెనీని లేకుండా చేస్తానని రాహుల్ శపథం చేస్తాడు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


