బ్రహ్మముడి డిసెంబర్ 1 ఎపిసోడ్: రాజ్, కావ్య న్యూ ఇయర్ టార్గెట్- కష్టాన్ని దోచుకోనున్న రాహుల్- రాజ్‌ను పట్టించుకోని పంతులు

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 1 ఎపిసోడ్‌లో రాహుల్ చెప్పినదానికి సుభాష్ తిడితే రాజ్ వద్దంటాడు. ఇలా తేలికగా తీసుకోబట్టే వెనుకపడిపోతున్నామని సుభాష్ అంటాడు. న్యూ ఇయర్ లోపు కొత్తగా 100 డిజైన్స్ రిలీజ్ చేయనున్నట్లు కావ్య చెబుతుంది. ఆ కష్టాన్ని రాహుల్ దోచుకోవాలని ప్లాన్ వేస్తాడు.

Published on: Dec 1, 2025, 07:21:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మేనేజర్ సతీష్ తన కంపెనీలోకి వచ్చాడని, అక్కడ రిజైన్ చేసినట్లు తర్వాత తెలిసిందని, పర్వాలేదా అని అడుగుతాడు రాహుల్. నీకు తెలిసిన తర్వాత అయిన రాజ్‌కు చెప్పాలిగా, నీకు తప్పనిపించలేదా సుభాష్, ప్రకాశం అంటారు.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 1 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 1 ఎపిసోడ్

పోటీలో వెనుకపడి ఉన్నాం

రాహుల్‌కు ఎక్స్‌పీరియెన్స్ తక్కువ, ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవాళ్లను తీసుకుంటే మంచిదనిపించింది. నేను కొత్త వాళ్లను అపాయింట్ చేసుకుంటాను అని రాజ్ అంటాడు. అన్నింటిని తేలిక తీసుకోవడం వల్లే మనం పోటీలో వెనుకపడుతున్నాం అని చెబుతాడు సుభాష్.

వంద కొత్త డిజైన్స్

మళ్లీ నెంబర్ వన్‌లో ఉండేందుకు అన్ని కొత్త డిజైన్స్ తయారు చేయిస్తున్నాం. న్యూ ఇయర్ లోపు వంద కొత్త డిజైన్స్ రిలీజ్ చేస్తాం అని కావ్య, రాజ్ చెబుతారు. ఆ మాటలు విన్న రాహుల్ ఇంత తక్కువ టైమ్‌లో ఎలా చేస్తారు. నిజంగా సాధ్యమవుతుందా అని అడుగుతాడు. వ్యాపారం అంటే అదే. పోటీని తట్టుకోవాలంటే చేయాలని రాజ్ అంటాడు.

రాజ్ డిజైన్స్ ఐడియా

రాజ్ మీరేదైనా చేయండి. కానీ, అందరిని నమ్మకుండా చేయండి అని సుభాష్ అంటాడు. తర్వాత కావ్య డిజైన్స్ వేయడానికి కూర్చొంటుంది. ఎలా డిజైన్స్ వేయాలో చెప్పండని రాజ్‌ను అడుగుతుంది కావ్య. రాజ్ డిజైన్స్ ఐడియా చెబుతాడు. ఆ మాటలు రాహుల్ వెంటాడు. ఇద్దరి దగ్గరికి రాహుల్ వచ్చి మాటలు కలుపుతాడు.

నా బిజినెస్ ఐడియాలు చెప్పను

ఇప్పుడు మీ బిజినెస్ నీది నా బిజినెస్ నాది. సలహా ఇస్తాను కానీ నా బిజినెస్ ఐడియాలు చెప్పను అని రాజ్ అంటాడు. రాహుల్ మన ఐడియాస్‌ను వినేందుకు వచ్చినట్లున్నాడని కావ్య అంటుంది. నన్ను అంత రైవల్రీగా అప్పుడే చూస్తున్నారు అన్నట్లు సరే ఇద్దరిని పొగిడి వెళ్లిపోతాడు రాహుల్.

మీ కష్టాన్ని నేను దోచుకుంటాను

వెయ్యండి వెయ్యండి. మీరు కష్టపడే ప్రతి డిజైన్‌ను, కష్టాన్ని నేను వాడుకుంటాను అని రాహుల్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం పాప తండ్రి అశోక్ వచ్చాడని అప్పుకు కానిస్టేబుల్ కాల్ చేసి చెబుతాడు. వస్తున్నానని అప్పు చెబుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు కల్యాణ్‌ను దువ్వుతుంది అప్పు. ధాన్యలక్ష్మీకి ఏం అబద్ధం చెప్పాలో ఆలోచిస్తారు ఇద్దరు.

కల్యాణ్, అప్పు మరో అబద్ధం

డాక్టర్ చెకప్‌కు మళ్లీ రమ్మన్నారని చెప్పి వెళ్దామని కల్యాణ్ అంటాడు. వెళ్లేందుకు రాహుల్ వస్తాడు. ఆ వెంటే రాజ్, కావ్య వస్తాడు. కావ్య వద్దన్న పనిచేస్తుందని రాజ్ అబద్ధాలు చెబుతాడు. తర్వాత అంతా కావ్యను మెచ్చుకుంటారు. గుడికి వెళ్లి అటు నుంచి ఆఫీస్‌కు వెళ్తామని కావ్య అంటుంది. రాజ్, కావ్య, రాహుల్ వెళ్లిపోతారు.

పోలీస్ స్టేషన్‌కు అప్పు

ఇంతలో కల్యాణ్, అప్పు వస్తారు. హాస్పిటల్‌కు వెళ్తున్నామని కల్యాణ్ చెబితే ధాన్యలక్ష్మి కంగారుపడుతుంది. జెనరల్ చెకప్ అని కల్యాణ్ అంటాడు. మరి పాత రిపోర్ట్స్ ఏవి అని ధాన్యం అడిగితే.. కారులో ముందే పెట్టానంటాడు కల్యాణ్. దాంతో ధాన్యం ఒప్పుకుంటుంది. అప్పు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది.

ఫీల్ అయిన రాజ్

మరోవైపు కావ్యను పంతులు పలకరిస్తాడు. తనను పంతులు పట్టించుకోవట్లేదని రాజ్ ఫీల్ అవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More