బ్రహ్మముడి డిసెంబర్ 15 ఎపిసోడ్: రాహుల్‌కు రాజ్ కాస్ట్‌లీ గిఫ్ట్- కల్యాణ్ బాగోతం చూసిన ప్రకాశం- తల్లిని ఏమార్చిన కొడుకు!

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 15 ఎపిసోడ్‌లో అప్పును ఇంట్లో ఎవరికి తెలియకుండా దొంగలా బయటకు పంపిస్తాడు కల్యాణ్. అది ప్రకాశం చూసి నిలదీస్తాడు. అప్పుకు జ్వరం అని నమ్మిస్తాడు. రాహుల్ అవార్డ్ ఫంక్షన్‌కు రాజ్, కావ్య వెళ్తారు. రాహుల్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇస్తాడు రాజ్. నిన్ను తొక్కేస్తానని రాహుల్ అనుకుంటాడు.

Published on: Dec 15, 2025, 07:15:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కళావతి సమస్య పూర్తిగా తీరిపోయిందని రాజ్ చెబుతాడు. ఇంట్లో అంతా సంతోషిస్తారు. నెల రోజులు గురువు గారు చెప్పిన మందులు వాడితే కళావతి సంతోషంగా బిడ్డను కంటుందని చెప్పారని రాజ్ అంటాడు. రుద్రాణి నమ్మదు. దాంతో రిపోర్ట్స్ చూపిస్తాడు రాజ్. ఇక కళావతి ధైర్యంగా ఇంటి వారసుడిని ఇస్తుందని రాజ్ అంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 15 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 15 ఎపిసోడ్

అవార్డ్ ఫంక్షన్ గురించి

రాజ్ నీ బాధ్యతలను చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నావని సీతారామయ్య మెచ్చుకుంటాడు. ఇంతలో రాజ్‌కు రమాకాంత్ కాల్ చేసి ఈవెనింగ్ అవార్డ్ ఫంక్షన్ గురించి చెబుతాడు. ఏం ఫంక్షన్ అని రాజ్ అంటే.. మీ ఫంక్షన్ గురించి మీకు తెలియదా.. నైట్ పదికి వచ్చేయండి అని రమాకాంత్ కాల్ కట్ చేస్తాడు. కాల్ గురించి సుభాష్‌ను రాజ్ అడిగితే రాహుల్ కంపెనీ తక్కువ టైమ్‌లో ఎక్కువ మార్కెటింగ్ చేసిన కంపెనీగా గుర్తించబడిందని స్వప్న అంటుంది.

రాహుల్‌కు అవార్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారని స్వప్న చెబుతుంది. దాంతో ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పవేంట్రా అని కంగ్రాట్స్ చెబుతారు రాజ్, కావ్య. నువ్ అవార్డ్ తీసుకుంటుంటే మేము రాకుండా ఉంటామా అని కావ్య అంటుంది. మరోవైపు అప్పుతో నువ్వు ఒక్కదానివే ఎవరికి చెప్పకుండా వెళ్లు. నాకు వర్క్ ఉంది. కానీ, ఇంట్లో మ్యానేజ్ చేస్తాను. నువ్వు బెడ్ రూమ్‌లో ఉన్నట్లు మ్యానేజ్ చేస్తానని కల్యాణ్ అంటాడు.

కారులో అప్పును ఎక్కించి పంపిస్తాడు కల్యాణ్. అది ప్రకాశం చూస్తాడు. వీడేంటీ అప్పును దొంగలా కారులో ఎక్కిస్తున్నాడు. ఏమైందని అనుకుంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ అప్పుకు జ్యూస్ ఇస్తానంటే కల్యాణ్ ఇస్తానంటాడు. అప్పు బెడ్ రూమ్‌లో ఉందంటాడు. తర్వాత బాత్రూ‌మ్‌లో ఉందంటాడు కల్యాణ్. అది విన్న ప్రకాశం వీడేంటీ అబద్ధం చెబుతున్నాడనుకుంటాడు.

సాయంత్రం తగ్గిపోతుంది

ధాన్యలక్ష్మీ ఆగకపోయేసరికి అప్పుకు జ్వరం వచ్చిందని, ఈరోజు సాయంత్రం వరకు తగ్గిపోతుందని అబద్ధం చెబుతాడు కల్యాణ్. అయినా ధాన్యం ఆగదు. కిచెన్‌లో పాలు మాడిపోతున్నాయని చెప్పి పంపిస్తాడు కల్యాణ్. ఇంతలో ప్రకాశం ఉండి అప్పు గురించి అడుగుతాడు. కారులో పంపించింది ఎవరిని, అమ్మకు అబద్ధం ఎందుకు చెప్పావ్ అని ప్రకాశం అడుగుతాడు.

అప్పు ఇంట్లోనే ఉందని, నీకు మతిమరుపు అని, వెళ్లి చిలుక జోస్యం చెప్పించుకోమని కన్‌ఫ్యూజ్ చేస్తాడు కల్యాణ్. దాంతో ఇదేంటీ అప్పు ఇంట్లోనే ఉందా. జ్యూస్ గ్లాస్ తీసుకెళ్తున్నాడంటే ఇంట్లోనే ఉండి ఉంటుందని ప్రకాశం అనుకుంటాడు. తర్వాత రాహుల్ అవార్డ్ ఫంక్షన్‌కు రాజ్, కావ్య వెళ్తారు. రాహుల్ భలే ప్లాన్ చేశావురా అని రాజ్ అంటే.. కంగారుపడతాడు.

ఇదేరా బిజినెస్ బాగా ప్లాన్ చేసుకున్నావ్ అని రాజ్ మెచ్చుకుంటాడు. రాజ్ చేతికి ఉన్న వాచ్‌ను రాహుల్‌కు గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఎందుకు అని రాహుల్ డ్రామా చేస్తాడు. ఇలాగే ట్రై చేస్తే ఏదో ఒకరోజు నాకు ఈక్వల్‌గా మార్కెట్‌లో నిలబడతావ్. ఈ అవార్డ్స్ మన కష్టానికి గుర్తింపు అని రాజ్ ఎంకరేజ్ చేస్తాడు. నీతో ఈక్వల్‌గా కాదురా నిన్ను వాడుకుంటూ నీకన్నా బాగా ఎదుగుతాను. నువ్వు నిస్సహాయస్థితిలో చూస్తూ ఉండిపోతావ్ అని రాహుల్ మనసులో అనుకుంటాడు.

కావ్యకు డౌట్

ఇంతలో రమాకాంత్ వచ్చి అందరిని ఆహ్వానిస్తాడు. రాహుల్ మన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అని రాజ్ అంటాడు. ఇంత తక్కువ టైమ్‌లో క్లయింట్స్‌ను ఎలా పట్టుకున్నావ్. ఎలా హ్యాండిల్ చేశావ్ అని కావ్య అడుగుతుంది. దీనికి వెంటనే డౌట్ వస్తుంది అని మనసులో అనుకున్న రాహుల్ అంత స్టాఫ్‌తో ముందుకు వెళ్లానని చెబుతాడు.

రాహుల్ తిండి, నిద్ర మానేసి కష్టపడేవాడు. కొత్త డిజైన్స్ చేయించేవాడు. రాహుల్ కష్టాన్ని మాటల్లో చెప్పలేను అని స్వప్న చెబుతుంది. నీలో వచ్చిన మార్పు ముందు ఈ అవార్డ్స్ చాలా చిన్నవి అని రాజ్ అంటాడు. ఇప్పుడేముందిరా అందరిముందు నీ పెళ్లాం వేసిన డిజైన్స్ నావి అని చెబుతుంటే అప్పుడు ఉంటుంది అసలైన షాక్ అని రాహుల్ అనుకుంటాడు.

రాహుల్‌కు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇస్తున్నట్లు ప్రకటించి డిజైన్స్ చూపిస్తారు. అవి చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More