బ్రహ్మముడి డిసెంబర్ 30 ఎపిసోడ్: కావ్య కడుపులో బిడ్డ చనిపోయేలా తల్లి కూతురు ప్లాన్- కషాయంలో పసరు కలిపిన రుద్రాణి, రేఖ

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో కావ్య మీద రాజ్ చూపించే ప్రేమను చూసి ఓర్వలేకపోతుంది రేఖ. వెళ్లి మందు తాగుతుంటే రాహుల్ తిడుతుంటాడు. రాజ్ వెళ్లి అడిగితే రేఖ బ్రేకప్ గురించి చెబుతాడు రాహుల్. దాంతో రేఖపై రాజ్ కన్సర్న్ చూపిస్తాడు. అంతా కావ్యపై ప్రేమ చూపిస్తుంటే సహించలేకపోతుంది రేఖ.

Published on: Dec 30, 2025, 07:54:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ బావను నాకు ఇచ్చి పెళ్లి చేసుంటే నాకు ఈ గతి పట్టేదా. నీవల్లే నా జీవితం ఇప్పుడు ఇలా తగలబడింది అని రేఖ అరిచి వెళ్లిపోతుంది. తర్వాత రేఖ మందు తాగుతుంటే రాహుల్ తిడుతుంటాడు. రాజ్ వచ్చి ఎందుకు తిడుతున్నావని అడుగుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 30 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 30 ఎపిసోడ్

బ్రేకప్ చేసుకుని వచ్చింది

ఫారెన్‌లో ఒకడిని ప్రేమించి బ్రేకప్ చేసుకుని వచ్చింది. చూడు ఎలా తాగుతుందో అని రాహుల్ అంటాడు. అది చూసి షాక్ అవుతాడు రాజ్. రాహుల్ తిడుతుంటే రేఖతో నేను మాట్లాడుతాను. నువ్వెళ్లు అని రాహుల్‌ను పంపిస్తాడు. రేఖకు మూవ్ ఆన్ అవ్వమని నచ్చజెపుతాడు రాజ్. నీలా నాకు ఇంట్లో ఎవరు చెప్పట్లేదు అని రేఖ అంటుంది. ఇంట్లో అందరికి నీ మీద కన్సర్న్ ఉంది. నా సపోర్ట్ నీకుంటుంది. ఈ చెత్త నుంచి బయటకి రా అని రాజ్ చెబుతాడు.

అదంతా ఈజీ కాదు బావ. కానీ, ట్రై చేస్తాను అని రేఖ అంటుంది. మరుసటి రోజు ఉదయం కావ్యను రాజ్ నడిపిస్తూ ప్రేమ చూపిస్తుంటే రేఖ చూసి జెలసీ ఫీల్ అవుతుంది. ఇంకో రెండు రౌండ్స్ నడవమని రాజ్ చెబితే నడవలేనని కావ్య అంటుంది. జ్యూస్ తీసుకొస్తాను. తాగి నడు అని వెళ్లి జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తుంటే రేఖ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది.

అది చూసి ఇవి వేసుకుంటే డిప్రెషన్ పోదు. నువ్వు పోతావ్ అని ట్యాబ్లెట్స్ పక్కన పడేస్తాడు రాజ్. పరిస్థితులను మనమే మార్చుకోవాలని, మనుషులతో కలువు. యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేయు. ఇలాంటి జ్యూస్ తాగు అని రాజ్ చెబుతాడు. దాంతో ఆ జ్యూస్ తీసుకుని తాగుతుంది రేఖ. ఈ జ్యూస్ నాకోసమేనా బావ అని పదే పదే అడుగుతుంది రేఖ. అలాగే అనుకో అని రాజ్ అంటాడు.

కావ్య జ్యూస్ రేఖకు

థ్యాంక్స్ బావ అని రాజ్‌ను హగ్ చేసుకుంటుంది రేఖ. అది కావ్య చూస్తుంది. కావ్య తాగాల్సిన జ్యూస్‌ను రేఖ తీసుకుని తాగుతుంది. కావ్యను రాజ్ చూసి ఏదో కవర్ చేస్తాడు. జ్యూస్ ఏదని కావ్య అడిగితే.. పాపం రేఖ.. డిప్రెషన్‌లో ఉందిగా. జ్యూస్ లాక్కుంది అని రాజ్ అంటాడు. ఇంకో జ్యూస్ తీసుకొస్తానని రాజ్ అంటే అక్కర్లేదని కావ్య వెళ్లిపోతుంది.

సుభాష్, ప్రకాశం ఆఫీస్‌కు వెళ్లడానికి ఫీల్ అవుతారు. స్కూల్ పిల్లాళ్ల మారం చేస్తారు ఇద్దరు. ఇంతలో కావ్య వస్తే భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని ఇందిరాదేవి అడుగుతుంది. లేదని కావ్య చెబితే.. పని మనిషికి చెప్పి పంపించాను అని అపర్ణ చెబుతుంది. ఈ పని మనిషి ఏం చేస్తుందని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు రేఖ చెప్పిన పాస్తా చేస్తుంది పని మనిషి.

ఇందిరాదేవి వాళ్లు వెళ్లు అడుగుతారు. రేఖ చెప్పింది, పాస్తా చేయరావట్లేదని పని మనిషి అంటుంది. ఇంతలో రేఖ వచ్చి పాస్తా రెడీనా అని అడుగుతుంది. నువ్వు వండుకోవే. లేదా దానికి వచ్చిన వంటలు చేయించుకో. ఫస్ట్ కావ్యకు ఇవ్వాలి. కావ్య ఆరోగ్యం ముఖ్యం. పని మనిషి టైమ్‌ను వేస్ట్ చేయకు అని గద్దిస్తుంది ఇందిరాదేవి. దాంతో కోపంగా రేఖ వెళ్లిపోతుంది.

కావ్య బిడ్డ చనిపోయేలా

అదంతా రాజ్, కావ్య చూస్తారు. ఇదెక్కడి గొడవరా బాబు. అది ముందే డిప్రెషన్‌లో ఉంది. పాస్తా ఆర్డర్ పెడితే అయిపోతుందని పెట్టి రేఖ దగ్గరికి వెళ్లి రాజ్ మాట్లాడుతాడు. ఇక్కడ కూడా ఒంటరిదాన్ని అయ్యాను అని రేఖ అంటుంది. నీకు నేను ఉన్నాను. ఏదైనా నన్ను అడుగు. నీకు పాస్తానే కావాలి. ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను అని రాజ్ చెప్పగానే పాస్తా వస్తుంది.

దాంతో రాజ్‌ను రేఖ హగ్ చేసుకుంటుంది. అదంతా కావ్య చూస్తుంది. రాజ్ కావ్యను చూసి భయపడిపోతాడు. ఏమైందే అని ఇందిరాదేవి అడుగుతుంది. జరిగింది చెబుతుంది కావ్య. తర్వాత కావ్య కడుపులో పిండం చనిపోయేలా కషాయంలో పసరు మందు కలుపుతారు తల్లీ కూతురు రుద్రాణి, రేఖ. ఆ కషాయాన్ని తాగమని కావ్యకు ఇస్తాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More