బ్రహ్మముడి డిసెంబర్ 24 ఎపిసోడ్: ధాన్యలక్ష్మీకి శిక్ష- పెరిగిన రాజ్ బిజినెస్- రాహుల్‌కు దూరమైన క్లయింట్స్-రుద్రాణి ప్లాన్
బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 24 ఎపిసోడ్‌లో జీవితంలో అప్పు పోలీస్ జాబ్ చేయకూడదని, రిజైన్ చేయాలని ఆర్డర్ వేసి వెళ్తుంది ధాన్యలక్ష్మీ. కోడలి అన్నదానాన్ని ఇందిరాదేవి అడ్డుకుంటుంది. రాజ్ బిజినెస్ పెరిగిపోతుంది. రాహుల్‌కు తన క్లయింట్స్ దూరమవుతారు. దాంతో రుద్రాణి కొత్త ప్లాన్ చెబుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పు డ్యూటీ చేయడంపై ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. అందరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. నేను దాని ఆరోగ్యం, క్షేమం కోసమే కదా వద్దన్నాను. జరగరానిది ఏమైనా జరిగిది పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నాను అని ధాన్యలక్ష్మీ కోప్పడుతుంది.

తల్లి అవుతున్నా కదా
మీరు చెప్పింది నిజమే అత్తయ్య. కానీ, ఆ తల్లిని చూసి చలించలేకపోయాను. నేను కూడా తల్లి అవుతున్నా కదా అని అప్పు అంటుంది. నువ్ను నన్ను మోసం చేశావ్. చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే. ఇక జీవితంలో అది పోలీస్ ఉద్యోగం చేయడానికి వీళ్లేదు. ఇంత జరిగాక దీన్ని క్షమించను. అప్పు శాశ్వతంగా జాబ్ మానేయాలి. జాబ్ రిజైన్ చేయాల్సిందే. నేను ముఖ్యమే జాబ్ ముఖ్యమో తేల్చుకో అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ.
తర్వాత అప్పు బాధపడుతుంటే కావ్య, రాజ్ వచ్చి ఓదారుస్తారు. పాప విషయంలో నువ్వు చేసింది గర్వపడాల్సిన విషయం అంటారు. కానీ, ఇకనుంచి నేను పోలీస్ డ్రెస్ వేసుకోలేనుగా అని అప్పు అంటుంది. పిన్ని తన నోటీతోనే నువ్వు జాబ్ చేయొచ్చు అని చెబితే సరిపోతుంది. ఇది మా వల్ల కూడా జరిగింది కాబట్టి మేమే దాన్ని ఫిక్స్ చేస్తామని రాజ్ అంటాడు.
మరుసటి రోజు ఉదయం రాజ్ చేసిన జ్యూవెలరీ యాడ్ చాలా బాగా వచ్చిందని పేపర్ చూసి చెబుతాడు సీతారామయ్య. ఎప్పుడు లేనిది ఇంత పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నావ్ అని అడుగుతాడు. కేరళ వెళ్లినప్పుడు సేల్స్ పడిపోయాయి. అవి రికవరీ చేయాలంటే ఈ మాత్రం చేయాలని రాజ్, కావ్య చెబుతారు. పబ్లిసిటీ చేసే బదులు రాహుల్‌లా క్లయింట్స్‌కు డిస్కౌంట్ ఇస్తే సరిపోతుందిగా అని స్వప్న అంటుంది.
కాపీ కొట్టినట్లు ఉంటుందని
అది వ్యాపార లక్షణం కాదు అని రాజ్ అంటాడు. రాహుల్‌లా చేస్తే వాడి ఐడియాను కాపీ కొట్టినట్లు ఉంటుందని, రాజ్‌కు చిన్నతనంగా ఉంటుందని వద్దంటున్నాడు అని రుద్రాణి అంటుంది. కాదు. నాణ్యత మెయింటేనే చేయాలి. ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తే డౌట్ వస్తుంది. ఇవాళ డిస్కౌంట్ ఇస్తావ్. మరి రేపు. నీ లాభం లేకుండా డిస్కౌంట్ ఇస్తూ పోతే కంపెనీ ఎలా రన్ చేస్తావ్. రేపు డిస్కౌంట్ ఇవ్వకుంటే నీ వైపు అస్సలు చూడరు అని రాజ్ చెబుతాడు.
వావ్ నీ బుర్రే బుర్రా రాజ్. నీలా నేను ఎప్పుడు బిజినెస్ మ్యాన్ అవుతానో ఏంటో అని రాహుల్ అంటాడు. అది ఎప్పటికీ జరగదులే అని సుభాష్ అంటాడు. తొందర్లో మీరే చూస్తారుగా అని రాహుల్ అంటే.. దాంతోపాటు నిజాయితీ కూడా ఉండాలి. కంపెనీ అన్నాక కొన్ని నియమాలు ఉండాలి అని రాజ్ అంటాడు. సరే అని రాహుల్ వెళ్లిపోతాడు.
మరోవైపు అప్పుకు ధాన్యలక్ష్మీ టిఫిన్ పెట్టి తిడుతుంది. అదంతా ఇందిరాదేవి, రాజ్, కావ్య వింటారు. ఆరోజు జ్వరం పడుకున్నావుగా. అసలు ఎప్పుడు బయటకు వెళ్లావ్ అని ధాన్యం అడుగుతుంది. ఆరోజు పడుకుంది నేను కాదు మావయ్య అని ప్రకాశం పేరు చెబుతుంది అప్పు. అయిపోయింది. ఈ పొట్టిది నా కొడుకును ఇరికించేసింది అని ఇందిరాదేవి అంటుంది.
రాజ్, కావ్య ప్లాన్
దీని వెనుక ఆయన హస్తం కూడా ఉందా ఆయన సంగతి చెబుతాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ధాన్యలక్ష్మీ మనసు మారేలా మేము ఒక ప్లాన్ వేశాం. చిన్నత్తయ్య ప్రతి నెల గుడిలో అన్నదానం చేయిస్తారు కదా. అది మాట్లాడటానికి ఇవాళ పంతులు వస్తారు. దాన్ని నువ్వు ఆపాలి అని రాజ్ చెబుతాడు. సరే అని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో పంతులు వస్తాడు.
ధాన్యలక్ష్మీ డబ్బు తీసుకొచ్చి ఇస్తుంది. ఇందిరాదేవి ఆగమని చెబుతుంది. ఇలా ఇష్టానుసారంగా ఎవరి పర్మిషన్ లేకుండా అన్నదానాలు చేయడానికి ఇదేం సత్రం కాదు తిడుతుంది. ఇంట్లో నేనున్నాను. నీకు నచ్చినట్లు చేయడానికి వీళ్లేదు అని ఇందిరాదేవి. మనం చేసే మంచి ఒకరికి నచ్చక్కర్లేదు అత్తయ్య. అది నలుగురికి మంచి చేస్తే చాలు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
అవతలి వాళ్ల మంచే చూడాలి కానీ, అత్తల ఇష్టాఅయిష్టాలను చూడకూడదా అని ఇందిరాదేవి అంటుంది. అంతేకదా అని ధాన్యలక్ష్మీ అంటే.. మరి ఈ బుద్ధి, తెలివి నీ కోడలి విషయంలో ఏమైంది. నీకు చెప్పకుండా అప్పు ఓ మంచి పని చేసింది. అది మంచి విషయం కాదా. నీ గొప్ప విషయం కాదా. నీలాగే నా కోడలు కూడా నాకు నచ్చినట్లు చేయాలి కదా. నీకు శిక్ష వేయాలి కదా అని ఇందిరాదేవి అంటుంది.
రుద్రాణి కొత్త ప్లాన్
తర్వాత రాజ్ యాడ్ నచ్చి క్లయింట్స్ అంతా జ్యూవెలరీ కోసం తెగ ఫోన్స్ చేస్తున్నారని శ్రుతి కాల్ చేసి చెబుతుంది. మరోవైపు రాహుల్ బిజినెస్ దెబ్బతింటుందని ఫీల్ అవుతాడు. వాళ్లను ఎమోషనల్‌గా ఫూల్స్‌ను చేసి నీ బిజినెస్‌ను లాభాల్లోకి తెచ్చుకో అని రుద్రాణి కొత్త ప్లాన్ చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


