బ్రహ్మముడి డిసెంబర్ 23 ఎపిసోడ్: పెళ్లి అయిన ఆడవాళ్లే అశోక్ టార్గెట్- ధాన్యలక్ష్మీకి ఇందిరాదేవితో రివర్స్ ట్రీట్‌మెంట్

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 23 ఎపిసోడ్‌లో లలితను రౌడీల నుంచి అప్పు కాపాడుతుంది. లలితను ఇంట్లో డ్రాప్ చేసిన అప్పు అక్కడ అశోక్ ఫొటోలు చూసి అంతా ఆరా తీస్తుంది. అశోక్‌ను పట్టుకుని నిజం రాబట్టి రేణుకకు పాపను అప్పజెబుతుంది అప్పు. అది తెలిసిన ధాన్యలక్ష్మీ అప్పు ఇక పోలీస్ జాబ్ చేయకూడదని ఆర్డర్ వేస్తుంది.

Published on: Dec 23, 2025, 08:02:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఒకావిడను రౌడీలు తరుముతుంటే అప్పు దగ్గరికి వెళ్తుంది. పోలీసులను చూసి రౌడీలు పారిపోతారు. మెడలై చైన్ లాక్కున్నారు. ఇంకా నా వెంట పడ్డారు అని ఆమె చెబుతుంది. చైన్ స్నాచర్స్‌ను పట్టుకోమని కానిస్టేబుల్స్‌కు అప్పు చెబుతుంది. వాళ్లు మళ్లీ వస్తారేమో అని ఆవిడ భయపడితే నేను డ్రాప్ చేస్తానని అప్పు చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 23 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 23 ఎపిసోడ్

అశోక్ రెండో భార్య

దాంతో ఆవిడ ఇంటికి అప్పు వెళ్తుంది. ఇల్లు బాగా రిచ్‌గా ఉంటుంది. ఇంట్లో అశోక్‌ ఫొటోను చూసి అప్పు షాక్ అవుతుంది. అశోక్ గురించి ఆవిడను అడుగుతుంది అప్పు. అశోక్ నా భర్త. నాకు ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాడు. నా మొదటి భర్త పోయిన తర్వాత నేను, నా కూతురు పింకీ ఒంటరివాళ్లం అయ్యాం. అప్పుడే అశోక్ మాకు అండగా నిలుచుని నన్ను ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడ. ఈ ఇల్లు కూడా ఆయనే కొన్నాడు అని ఆవిడ చెబుతుంది.

అంటే పెళ్లయిన ఆడవాళ్లే అశోక్ టార్గెట్ అన్నమాట అని అప్పు అనుకుంటుంది. బయటకు వెళ్లిన అప్పు అశోక్‌ను ఈడ్చుకురుమ్మని కానిస్టేబుల్స్‌కి చెబుతుంది అప్పు. మరోవైపు ఇంట్లో అందరిని పిలిచి యాడ్ ఫిల్మ్ రెడీ అయిందని చూపిస్తారు రాజ్, కావ్య. యాడ్ చూసి అంతా అదోలా ఫేస్ పెడతారు. నచ్చిందా లేదా అని రాజ్, కావ్య టెన్షన్ పడతారు.

కాసేపటికి అంతా సూపర్ ఉందని మెచ్చుకుంటారు. ఈ యాడ్‌కు బిజినెస్‌కు తిరిగే లేదురా అని ప్రకాశం అంటాడు. ఈ యాడ్ గోల్డ్ మార్కెట్‌ను షేక్ చేస్తుందని సుభాష్ అంటాడు. రాజ్ గొప్ప అని ఇందిరాదేవి, కావ్య గొప్ప అని అపర్ణ వాదించుకుంటారు. రాహుల్‌ను తిడుతుంది రుద్రాణి. వాడు చేసిన డిజైన్స్ మార్కెట్‌లోకి వెళ్లవు. వాడి క్లయింట్స్ అంతా నా గుప్పెట్లో ఉన్నారని రాహుల్ అంటాడు.

నిజం చెప్పిన అశోక్

మరోవైపు అశోక్‌ను కానిస్టేబుల్ కుర్చీలో కట్టేసి కొడతారు. రేణుక, లలిత గురించి అడుగుతుంది అప్పు. అశోక్ చెప్పకపోవడంతో కొడుతుంది. దాంతో నిజం చెబుతాడు. ఇంతకుముందు దొంగతనాలు చేసేవాడినని, ఆర్గాన్స్ ముఠాతో పరిచయం ఉందని, డైరెక్ట్ పిల్లలను కిడ్నాప్ చేస్తే రిస్క్ అని పెళ్లయిన ఆడవాళ్లను టార్గెట్ చేసుకుని పిల్లలను కిడ్నాప్ చేస్తున్నా అని అశోక్ చెబుతాడు.

మరి అంజలిని కిడ్నాప్ చేసి సంవత్సరం అవుతుంది. ఇంకా ఎందుకు ముఠాకు అప్పజెప్పలేదని అప్పు అడిగితే.. ఆపరేషన్ చేయాలి కదా మేడమ్. దానికి ఇంకా టైమ్ ఉందన్నారు అని అశోక్ చెబుతాడు. అశోక్‌ను కొట్టి ప్రెస్ మీట్ పెడుతుంది అప్పు. రేణుక వచ్చి పాపను ముద్దాడుతుంది. అప్పుకు థ్యాంక్స్ చెబుతుంది. ప్రెస్ మీట్ తర్వాత రేణుకతో మీడియా మాట్లాడుతుంది.

అప్పు వల్లే తన పాప దొరికిందని రేణుక చెబుతుంది. అదంతా టీవీలో రుద్రాణి చూస్తుంది. ఇంట్లో అందరిని పిలుస్తుంది. అందరిని న్యూస్ చూడమంటుంది. రేణుక చెప్పడం, అప్పు కనిపించడం అంతా చూస్తారు ఇంట్లోవాళ్లు. మీడియా గొప్పగా ప్రశంసిస్తుంటే రుద్రాణి ధాన్యలక్ష్మీకి ఎక్కిస్తుంది. ఇంతలో అప్పు, కల్యాణ్ వస్తారు. ఇద్దరిపై ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మీ.

ధాన్యలక్ష్మీ ఆర్డర్

నీ భార్య బయటకెళ్లి జాబ్ చేస్తే బెడ్ రూమ్‌లో ఉందని మాయ చేస్తావా, ఏమారుస్తావా అని కల్యాణ్‌ను తిడుతుంది ధాన్యలక్ష్మీ. ఇదేనా మాట నిలబెట్టుకోవడం, గౌరవం ఇవ్వడమంటే, ఇచ్చిన మాట తప్పడమా నీ పుట్టింటి సంస్కారం, ఇదేనా నీ కన్నవాళ్లు నేర్పింది అని గట్టిగానే తిడుతుంది ధాన్యలక్ష్మీ.

నేను చెప్పడం వల్లే అప్పు బయటకు వెళ్లింది. ఒక తల్లి ఆవేదన, కన్నీళ్లు బయటకు వెళ్లేందుకు కారణమయ్యాయి. నీకు చెప్పే వెళ్తానంది. కానీ, నేనే వద్దన్నాను. అప్పు నిన్ను మోసం చేయలేదు అని కల్యాణ్ చెబుతాడు. రాజ్ కూడా మేమే వద్దన్నాం అని చెబుతాడు. అంతా బాగానే డ్రామా ఆడారు. ఇక అప్పు జీవితంలో పోలీస్ డ్యూటీ చేయకూడదని ఆర్డర్ వేసి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ.

దాంతో అప్పు బాధపడుతుంది. రాజ్, కావ్య ఓదారుస్తారు. ఇందిరాదేవితో ధాన్యలక్ష్మీకి రివర్స్ ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More