బ్రహ్మముడి డిసెంబర్ 22 ఎపిసోడ్: రాజ్ యాడ్ షూట్ సక్సెస్- కిడ్నాప్ అయిన పాపను కనిపెట్టిన అప్పు- కోడలికి ధాన్యలక్ష్మీ శిక్ష
బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 22 ఎపిసోడ్‌లో డైరెక్టర్‌గా వచ్చిన మణి వర్మ పరాట మాస్టర్ అని ప్రకాశం కనిపెట్టేస్తాడు. దాంతో రాజ్ డైరెక్టర్‌గా మారి యాడ్ షూట్ కంప్లీట్ చేస్తాడు. అది అంత బాగా రాదని, తనకే స్వరాజ్ కంపెనీని తాతయ్య అప్పజెబుతాడని రాహుల్ అంటాడు. మిస్ అయిన పాపను అప్పు కనిపెడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఫేక్ డైరెక్టర్ మణి వర్మ యాడ్ షూట్ చేస్తూ హడావిడి చేస్తాడు. ఇంతలో కిచెన్‌లో నుంచి వాసన రావడంతో ఎవరో ఇక్కడ పరాటలు చెడగొడుతున్నారని కిచెన్‌లోకి వెళ్లిపోతాడు మణి వర్మ. పరాటలు ఎవరైనా ఇలా చేస్తారా, పిండి ఇలా కలుపుతారా అని పని మనిషిపై అరిచి తానే పరాటాలు చేస్తాడు.

పరాట మాస్టర్
ఇంతలో రాజ్ వచ్చి డైరెక్టర్ గురించి అడిగితే.. కిచెన్‌లో ఉన్నాడని చూపిస్తారు. మణి వర్మ పరాటలు చేస్తూ కనిపిస్తాడు. ఇంతకీ అతను డైరెక్టరేనా అని కావ్య అడిగితే.. కాదు పరాట మాస్టర్ అని ప్రకాశం అంటాడు. ఇప్పుడు నిరూపిస్తానని కిచెన్‌లోకి పరాట రేట్ అడుగుతాడు. మణి వర్మ చెబుతాడు. దాంతో మణి వర్మను లాక్కొచ్చి నేను చెప్పాను కదా అంటాడు ప్రకాశం.
మరి డైరెక్టర్‌గా ఇక్కడికి ఎందుకు వచ్చావురా, ఎవరు పంపించారని నిలదీస్తాడు రాజ్. రాహుల్ చెప్పొద్దని సైగ చేస్తాడు. మీ కో ఆర్డినేటర్ డైరెక్టర్ కోసం వెతుకుతుంటే డబ్బుకు కక్కుర్తి పడి ఆయనను నమ్మించి వచ్చాను. నన్ను క్షమించండి అని పారిపోతాడు మణి వర్మ. అంత అయిపోయింది. మిగిలిన ఒక్కరోజు కూడా పోయిందని బాధగా రాజ్ బయటకు వెళ్లిపోతాడు.
కావ్య వెళ్లి మాట్లాడుతుంది. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అని రాజ్ అంటే మీ ఆలోచనల్లోనే తప్పుందని కావ్య అంటుంది. మీరే డైరెక్టర్ అవ్వొచ్చుగా అని కావ్య అంటుంది. ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్ లేని నేను ఎలా తీయను అని రాజ్ అంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌ను పిలిచి అతను మీకు సహాయం చేస్తాడని కావ్య అంటాడు. నేను కొన్ని యాడ్ షూట్‌కు పనిచేశాను. మనసు పెట్టి చేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి అని అతను అంటాడు.
డైరెక్టర్‌గా రాజ్ యాడ్ షూట్
దానికి రాజ్ ఒప్పుకుంటాడు. ఇంట్లోకి ఈ యాడ్‌ను మా ఆయన షూట్ చేయబోతున్నాడని రాజ్ అంటాడు. అందరికి అక్కడ కాన్సెప్ట్ చెబుతాడు రాజ్. రాజ్ డైరెక్టర్ అయి ఇదంతా చేస్తాడా అని రుద్రాణి అంటే.. ఇది అంత ఈజీ కాదని రాహుల్ అంటాడు. తర్వాత యాడ్ షూట్‌లో రాజ్ కూడా ఉండాలని అంతా పట్టుబడితే ఒప్పుకుంటాడు. రాజ్ డైరెక్టర్‌గా మారి యాడ్ షూట్ పూర్తి చేస్తాడు.
తర్వాత రాజ్ యాడ్ షూట్ పూర్తి చేశాడని రుద్రాణి టెన్షన్ పడుతుంది. రాజ్ చేసిన యాడ్ ఫెయిల్ అవుతుంది మమ్మీ. అది పూర్తి కాలేక తల బాదుకుంటాడు. ఇంతలో నా డిజైన్స్ మార్కెట్‌లో పెట్టేస్తాను. లాభాలు నాకు నష్టాలు రాజ్‌కు. అదంతా చూసిన తాతయ్య రాహుల్ స్వరాజ్ కంపెనీని కూడా నువ్వే చూసుకోవాలంటాడు అని రాహుల్ అంటాడు.
మరోవైపు షూట్ ఎలా వచ్చిందో అని రాజ్ టెన్షన్ పడుతుంటాడు. కావ్య వచ్చి సర్ది చెబుతుంది. మోటివేషన్ డైలాగ్స్ చెబుతుంది. యాడ్ సక్సెస్ అవుతుందని చెబుతుంది. మరుసటి రోజు ఉదయం ఒకావిడను ఇద్దరు రౌడీలు తరుముతుంటారు. అక్కడే ఉన్న అప్పు దగ్గరకు వెళ్తుంది. అప్పును చూసి రౌడీలు పారిపోతారు. ఆమె ద్వారా రేణుక పాప అంజలిని పట్టుకుంటుంది అప్పు.
అప్పుకు అత్త శిక్ష
మరోవైపు ఇంట్లో రాజ్ చేసి యాడ్ చాలా బాగా వచ్చిందని అంతా మెచ్చుకుంటారు. రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. ఇంతలో తన పాపను కాపాడింది అప్పు మేడమ్ అని మీడియా వాళ్లతో రేణుక చెప్పేది ఇంట్లోవాళ్లంతా చూస్తారు. అప్పు చేసిన తప్పుకు ధాన్యలక్ష్మీ శిక్ష వేస్తుంది. ఇక జీవితంలో పోలీస్‌గా అప్పు చేయకూడదని కండిషన్ పెడుతుంది ధాన్యం. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


