బ్రహ్మముడి డిసెంబర్ 29 ఎపిసోడ్: కావ్యకు మొదలైన సవతి పోరు.. రాజ్‌ను వాటేసుకున్న రుద్రాణి కూతురు.. కొత్త మలుపు తిరిగిన కథ
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (డిసెంబర్ 29) ఎపిసోడ్ లో కావ్యకు సవతి పోరు మొదలవడం చూడొచ్చు. కథను పూర్తిగా మలుపు తిప్పుతూ రుద్రాణి కూతరు రేఖ సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది. దీంతో తనకు రాబోయే గండం ఇదే అని కావ్యకు అర్థమవుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 916వ ఎపిసోడ్ కథను పూర్తిగా ఓ కొత్త మలుపు తిప్పింది. కావ్య జీవితంలో రాబోయే కొత్త గండం రుద్రాణి కూతురు రేఖ అని తేలింది. రాజ్, కావ్య జీవితాలు రేఖ రాకతో ఎలా మారబోతున్నాయన్న ఉత్కంఠను ఈ ఎపిసోడ్ రేకెత్తించింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

రాహుల్‌కు సాండీ ఫోన్
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (డిసెంబర్ 29) ఎపిసోడ్ దొంగ బంగారం అంటూ వెళ్లిన సాండీని రాజ్ తిట్టి పంపించే సీన్ తో మొదలైంది. ఆ తర్వాత రాహుల్ కు శాండీ ఫోన్ చేస్తాడు. జరిగిన విషయం చెబుతాడు. నీ దొంగ బంగారం మొత్తం నేను కొంటాను.. కానీ నువ్వు రాజ్ దగ్గరికి వెళ్లిన సీసీటీవీ విజువల్స్ నాకు కావాలి.. దాని ద్వారా రాజ్ ను ఇరికిస్తానని రాహుల్ అంటాడు. ఇంత బిజినెస్ ఇస్తున్న నీకోసం జైలుకెళ్లడానికైనా రెడీ అని సాండీ చెబుతాడు. అప్పుడే స్వప్న వచ్చి పాపను రెడీ చేయమని చెప్పి వెళ్తుంది.
సమస్య రాబోతుందన్న పంతులుగారు.. పరిహారం లేదంటూ..
ఇటు ఇంట్లో వరుస అపశకునాలకు కంగారు పడి కావ్య, అపర్ణ, ఇందిరా దేవి.. పంతులుగారిని కలవడానికి వెళ్తారు. తన పీడకల, హారతి ఆరిపోవడం గురించి చెబుతారు. పంతులు గారు దివ్య దృష్టితో చూసి పెద్ద ప్రమాదమే బయటి నుంచి రాబోతుందని చెబుతాడు. దీంతో వాళ్లు కంగారు పడతారు. పరిహారం లేదా అని అడుగుతారు. గర్భవతిగా ఉంది కాబట్టి యజ్ఞాలు, హోమాలు చేయలేదని, రోజూ దేవుడి ముందు దీపారాధన చేయమని అంటాడు.
ఎంట్రీ ఇచ్చిన రుద్రాణి కూతురు రేఖ
ఆ తర్వాత రుద్రాణి కూతురు రేఖ సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే రుద్రాణి షాక్ తింటుంది. ఫారిన్ నుంచి చెప్పా పెట్టకుండానే ఎందుకు వచ్చావని అడుగుతుంది. కూతురు ఇన్నాళ్లకు వస్తే తల్లి హత్తుకుంటుంది కానీ.. నువ్వేంటి ఇలా అడుగుతున్నావని రేఖ అసహనం వ్యక్తం చేస్తుంది. ఆమె సమాధానం చెప్పకుండా లోనికి వెళ్లిపోతుంది. దీంతో ఇదేం చేసి వచ్చిందో అని రుద్రాణి అనుకుంటుంది.
రేఖను నిలదీసిన రాహుల్
ఇటు రేఖ వచ్చిన విషయం తెలుసుకున్న రాహుల్.. వెంటనే వెళ్లి ఆమెను నిలదీస్తాడు. తాము వద్దంటున్నా విదేశాలకు వెళ్లావు.. ఇప్పుడెందుకు వచ్చావు.. అక్కడికే వెళ్లు అంటాడు. అలా అంటావేంటిరా.. మనం ఎక్కడ ఉంటే అక్కడికే కదా రేఖ వస్తుందని రుద్రాణి అంటున్నా వినడు. ఆ వెంటనే కావ్య, అపర్ణ, ఇందిరా, రాజ్ కూడా వస్తారు. రేఖను చూసి ఆశ్చర్యపోతారు. ఆమెను నిలదీస్తున్న రాహుల్ ను రాజ్ మందిలిస్తాడు. దీంతో రాజ్ పై మరోసారి మనసు పారేసుకుంటుంది రేఖ.
కావ్య ఇక ఆఫీసుకు రాదని చెప్పిన అపర్ణ
అప్పుడే ఇక కావ్య ఆఫీసుకు రాదని, పంతులుగారు జాగ్రత్తగా ఉండమని చెప్పారని అపర్ణ అంటుంది. ఆమె వెళ్లకపోతే నేను కూడా వెళ్లనని రాజ్ అంటాడు. దీంతో సుభాష్, ప్రకాశం మళ్లీ తామే వెళ్లాలని ఉసూరుమంటారు. ఇక నుంచి కావ్యను అడుగు కింద పెట్టకుండా చూసుకుంటానంటూ అందరి ముందే ఆమెను ఎత్తుకొని వెళ్తాడు రాజ్. అది చూసి రేఖ కుళ్లుకుంటుంది.
మార్క్‌తో బ్రేకప్ అయిందన్న రేఖ
రేఖను బయటకు తీసుకొచ్చి ఎందుకు సడెన్ గా వచ్చావని రుద్రాణి నిలదీస్తుంది. మార్క్ అనే వాడిని ప్రేమించానన్నావ్.. వాడు బిలియనీర్ అన్నావ్ అని అడుగుతుంది. కానీ వాడు మోసగాడు అని, వాడితో బ్రేకప్ అయిందని రేఖ అంటుంది. అప్పుడే తనను రాజ్ బావకు ఇచ్చి పెళ్లి చేసి ఉంటే తాను విదేశాలంటూ వెళ్లేదాన్నే కాదని తల్లికే క్లాస్ పీకుతుంది.
ఇక మరుసటి రోజే తనకు పాస్తా కావాలని రేఖ ఆర్డర్ వేస్తుంది. ముందు కావ్యకు కావాల్సినవి ఇచ్చిన తర్వాతే ఎవరికైనా అని ఇందిర చెప్పడంతో రేఖ ఉడుక్కుంటూ బయటకు వెళ్తాడు. ఆమెను రాజ్ బుజ్జగిస్తాడు. ఆన్‌లైన్లో ఆర్డర్ ఇచ్చి పాస్తా తెప్పించడంతో రేఖ అతన్ని వాటేసుకుంటుంది. అది చూసి కావ్య కుళ్లుకుంటుంది. దీంతో కావ్యకు సవతి పోరు మొదలైనట్లే అని స్పష్టమవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


