బ్రహ్మముడి జనవరి 3 ఎపిసోడ్: ఒకేసారి 3 దెబ్బలు- కావ్య కడుపు పోవడం, కంపెనీ నాశనం, రాజ్‌పై దొంగ బంగారం కేసు- కల్యాణ్ త్యాగం

బ్రహ్మముడి సీరియల్ జనవరి 3 ఎపిసోడ్‌లో కావ్యకు కడుపు పోయేలా చేసి, దొంగ బంగారం కేసులో రాజ్‌ను ఇరికించి జైలుకు పంపించాలని, కంపెనీని నాశనం చేయాలని రుద్రాణి, రాహుల్, రేఖ స్కెచ్ వేస్తారు. కనకం దుగ్గిరాల ఇంటికి వస్తుంది. సీమంతం గురించి కనకం చెబితే అత్తింట్లోనే చేపిద్దామని ఇందిరాదేవి చెబుతుంది.

Published on: Jan 3, 2026, 07:15:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌తో డ్యాన్స్ చేయడాన్ని తలుచుకుని మురిసిపోతుంది రేఖ. పక్కనే రుద్రాణి ఉంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి రాజ్ కార్ తీసుకుంది చూపిస్తాడు. రాజ్ కారులో దొంగ బంగారం పెట్టేయ్. దొంగ బంగారం కొన్నాడన్న కేసులో పూర్తిగా ఇరికించేయ్ అని రుద్రాణి అంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 3 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 3 ఎపిసోడ్

కావ్య కడుపు, రాజ్ ఇరుక్కోవడం

ఎవరు చూడని టైమ్‌లో పెట్టాలి. వెంటనే పోలీసులను రప్పించాలి. కంపెనీని పడగొట్టాలి అని రాహుల్ అంటాడు. రాజ్ బావను ఇరికిస్తారా. కాబోయే భర్త జైలులో ఉంటే బాగుండదుగా. బావను జైలుకు పంపిస్తే నా వాడు ఎలా అవుతాడు అని రేఖ అడుగుతాడు. నేను నెంబర్ వన్ కావాలంటే రాజ్ జైలుకు వెళ్లాలి అని రాహుల్ కోపంగా అంటాడు.

రాజ్‌కు అన్ని పోయి ఒంటరివాడు కావాలి. అప్పుడు మనం చెప్పినట్లు వింటాడు. కావ్య కడుపు పోవాలి, రాజ్ దొంగ బంగారం కేసులో ఇరుక్కోవాలి. ఈ రెండు జరుగుతునే రాజ్ నీవాడు అవుతాడు అని రుద్రాణి అంటుంది. రాజ్‌ను మళ్లీ నేను బెయిల్ మీద తీసుకొస్తా. అప్పుడు మన మీద కృతజ్ఞత భావం, నీ మీద లవ్ రెండు ఒకేసారి పుట్టుకొస్తాయని రాహుల్ అంటాడు.

కంపెనీ నాశనం, దాని కడుపు పోవడం రెండు ఒకేసారి జరిగిపోవాలి అని రుద్రాణి అంటుంది. మరోవైపు అప్పు, కావ్య అటు ఇటు నడుస్తుంటారు.ఇంతలో కనకం పంతులును తీసుకుని వస్తుంది. మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్లాలి. సీమంతం చేయాలి. నా చేత్తో పురుడు పోయాలని కనకం చెబుతుంది. అందరిని కావ్య పిలుస్తుంది. పురుడుకు పుట్టింటికి తీసుకెళ్లాలని పంతులును తీసుకొచ్చానని కనకం అంటుంది.

సీమంతం ఇక్కడే జరిపిద్దాం

ఇద్దరు కోడళ్లు వెళ్లిపోవడం అపర్ణకు నచ్చదని చెబుతుంది. ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉండాలని ఆశ పడుతుందని ఇందిరాదేవి చెబుతుంది. సీమంతం ఇక్కడే జరిపించి, ఆ తర్వాత పుట్టింటికి పంపిద్దామని ఇందిరాదేవి చెబుతుంది అంటుంది. దానికి అంతా ఒప్పుకుంటారు. పంతులును సీమంతానికి ముహుర్తం చూడమని చెబుతారు.

సీమంతానికి ఏమేం కావాలో రాజ్, కల్యాణ్ లిస్ట్ రాస్తారు. కావ్య, అప్పు భర్తలను వెతుక్కుని వస్తారు. సినిమాలు చూసి సీమంతం చేస్తాం. ఏ సినిమాలో చేయనంత గ్రాండ్‌గా సీమంతం చేస్తామని రాజ్ అంటాడు. ఇంతలో కనకం వచ్చి డబ్బు ఇస్తుంది. సీమంతం కోసం మీ మావయ్య డబ్బు పొదుపు చేశారు. పుట్టింట్లో జరిగితే ఈ డబ్బు బయటకు వచ్చేది కాదు. కానీ, తండ్రి బాధ్యతగా డబ్బు తీసుకోమని కనకం చెబుతుంది.

మీ తృప్తి కోసం ఈ డబ్బు తీసుకుంటాను అని రాజ్ తీసుకుంటాడు. ఇంతలో రేఖ వచ్చి సీమంతంలో ఏమైనా డౌట్ ఉంటే చెప్పమని, ఫారెన్‌లో ఇలాంటివి చాలా ఆర్గనైజ్ చేశానని చెబుతుంది. నువ్ చేసినవి పార్టీ కల్చర్‌వి. ఇక్కడ అలా చేస్తే మా కొంప కొల్లేరు అవుతుందని రాజ్ అంటాడు. దానికి కావ్య, అప్పు నవ్వుతారు. అందుకు రేఖ అవమానంగా ఫీల్ అయి కోప్పడుతంది.

సుభాష్ డ్రింకింగ్

మరోవైపు సుభాష్ ఆనందంలో తాగుతుంటాడు. ఆనందం ఎందుకు అని అపర్ణ అడుగుతుంది. రాజ్ లేని టైమ్‌లో 2 కోట్ల నష్టం వచ్చింది కదా. దాన్ని రాజ్, కావ్య పూడ్చేశారని సుభాష్ చెబుతాడు. ఆ విషయంలో రాహుల్‌కు బుద్ధి చెప్పకుండా వదిలేసినందుకు కోపంగా ఉంది. రాహుల్ మారుతాడని నాకు నమ్మకం లేదని అపర్ణ అంటుంది.

కావ్య సీమంతం ముందు ఇవన్నీ ఎంత చెప్పు. ఏ గండం లేకుండా కావ్య బిడ్డను కంటే చాలు అని సుభాష్ అంటాడు. మరోవైపు రెడ్ కలర్ పట్టుచీర సీమంతానికి నా పొట్టి కట్టుకుంటే అదిరిపోతుందని కల్యాణ్ అనుకుంటాడు. ఇంతలో అప్పు వచ్చి కల్యాణ్‌కు సర్‌ప్రైజ్ అని గిఫ్ట్ ఇస్తుంది. అందులో బ్లూ కలర్ పట్టుచీర ఉంటుంది. అమ్మ నాకోసం కంచి నుంచి తీసుకువచ్చింది. ఎంత కష్టపడిందో అని అప్పు అంటుంది.

అయితే, ఈ చీరనే కట్టుకో అని కల్యాణ్ అంటాడు. దాంతో కల్యాణ్ సర్‌ప్రైజ్ ఇద్దామనుకంటే షాక్ ఎదురవుతుంది. ఇంతలో చేతిలో ఏముందని లాక్కుని తీసుకుంటుంది అప్పు. ఇంతమంచి చీర తీసుకొచ్చి దాస్తావేంటని అడుగుతుంది అప్పు. మీ అమ్మగారు కూడా చీర తీసుకొచ్చారుగా.

అత్త కోసం కల్యాణ్ త్యాగం

నువ్వు ఏ చిన్న విషయంలో కూడా ఇబ్బంది పడకూడదని చూపించట్లేదు. మీ అమ్మగారు తెచ్చిన చీర కట్టుకో. ఆవిడ నీకోసం ఎంతో చేశారు అని కల్యాణ్ తను తీసుకొచ్చిన చీర విషయంలో త్యాగం చేస్తాడు. దానికి సరేనని అప్పు అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More