బ్రహ్మముడి జనవరి 2 ఎపిసోడ్: రాజ్ రేఖ రొమాంటిక్ డ్యాన్స్-అత్తింట్లోనే కావ్య అప్పు సీమంతం-రాజ్ కారు కీస్ దొంగలించిన రాహుల్
బ్రహ్మముడి సీరియల్ జనవరి 2 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇందులో రాజ్, రేఖ కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తారు. కావ్యకు రాజ్ కషాయం ఇస్తే తాగుతుంది. అదే సమయంలో రాజ్ కారు కీస్‌ను దొంగతనం చేస్తాడు రాహుల్. ఇంతలో కనకం వచ్చి సీమంతం గురించి అడుగుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సీతారామయ్య చీటి తీస్తే మంచి పద్యం పాడాలని వస్తుంది. తాతయ్య పద్యం చెబుతాడు. అందరు ఆశ్చర్యపోయి మెచ్చుకుంటారు. రాజ్‌తో రేఖ క్లోజ్‌గా ఉంటుంది. అది కావ్య చూసేసరికి రాజ్ భయపడి తప్పుకుంటాడు.

ప్రకాశం, ధాన్యం డ్యాన్స్
ప్రకాశం, ధాన్యలక్ష్మీ వచ్చి చీటి తీస్తే డ్యాన్స్ చేయాలని వస్తుంది. ఇదేమిటమ్మా మాయ మాయ పాటకు ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. రాహుల్, స్వప్న చీటి తీస్తే డమ్‌షరాడ్స్ వస్తుంది. రాహుల్ సినిమా పేరును సైగలతో చేస్తే స్వప్న చెప్పాలి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని గెస్ చేస్తుంది స్వప్న. తర్వాత రుద్రాణి చీటి చీస్తే బాలయ్య బాబు డైలాగ్ చెప్పాలని వస్తుంది.
తొడగొట్టిన రుద్రాణి
చూడు ఒకవైపే చూడు అనే డైలాగ్ చెప్పి రుద్రాణి తొడ కొడుతుంది. భయపడి చచ్చానని ఇందిరాదేవి, చెత్తలా ఉందని ధాన్యం అంటారు. కల్యాణ్ చీటి తీస్తే డమ్‌షరాడ్స్ వస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఈజీగా చెప్పేస్తుంది అప్పు. ఇంతలో రాజ్ కళావతి కషాయం తాగావా అని రాజ్ అడిగితే లేదని కావ్య చెబుతుంది. కషాయం కోసం రాజ్ రూమ్‌లోకి వెళ్తాడు.
రాజ్ కారు కీస్ దొంగతనం
రాజ్ కారు కీస్ తీసుకోడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని రాహుల్ వెళ్తాడు. అపర్ణ, ఇందిరాదేవి స్టేజీ పర్ఫామెన్స్ చేస్తారు. కావ్యకు రాజ్ కషాయం ఇస్తాడు. కావ్య పసరు కలిపిన కషాయం తాగుతుంది. మరోవైపు రాజ్ కారు కీస్ తీసుకుంటాడు రాహుల్. భార్య మనసులో ఏముందో గెస్ చేసి చెప్పాలని రాజ్‌కు చీటి వస్తుంది. కావ్య గురించి గొప్పగా చెబుతాడు రాజ్.
సుభాష్ డైలాగ్
అది చూసి ఓర్వలేకపోతుంది రేఖ. రాజ్ చెప్పినదానికి అంతా చప్పట్లు కొడతారు. సుభాష్‌ను డైలాగ్ చెప్పమని రాజ్ చెబుతాడు. భార్య ఎలా ఉండాలో కోడలికి చెబుతున్నట్లుగా సుభాష్ డైలాగ్ ఉంటుంది. దానికి అంతా మెచ్చుకుంటారు. తర్వాత రేఖ చీటి తీస్తే మంచి డ్యూయెట్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని వస్తుంది. ఒంటరిగా ఎలా చేయాలని రేఖ అంటుంది.
రాజ్, రేఖ రొమాంటిక్ డ్యాన్స్
నీకోసం హీరో వస్తాడా అని ధాన్యం అంటే.. హీరో ఇక్కడే ఉన్నాడుగా అని రాజ్‌ను అంటుంది రేఖ. రాజ్ చేయనంటాడు. చేయమని కల్యాణ్ చెబుతాడు. గువ్వ గోరింకతో పాటకు రాజ్, రేఖ కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తారు. ఇంతలో ఇంటికి కనకం వస్తుంది. ఇద్దరు కూతుళ్లను పుట్టింటికి తీసుకెళ్తానని చెబుతుంది కనకం.
అత్తింట్లోనే సీమంతం
అపర్ణకు మాత్రం కోడళ్లు తన ఇంట్లోనే ఉండాలని ఉందని చెబుతుంది. దాంతో కావ్య, అప్పు ఇద్దరికి ఇక్కడే సీమంతం జరిపిద్దామని చెబుతుంది కనకం. పసరు మందు ఈరయ్యను మరోసారి కలిసిన రుద్రాణి రెండో మందు తీసుకుంటుంది. అది కావ్య తినే అన్నంలో కలిపి ఇస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


