బ్రహ్మముడి జనవరి 1 ఎపిసోడ్: కావ్య, అప్పుకు టార్చర్- ప్రకాశంకు నిద్రలో నడిచే అలవాటు- కావ్య కడుపు పోయేందుకు 2 పసరు మందులు
బ్రహ్మముడి సీరియల్ జనవరి 1 ఎపిసోడ్‌లో ఏ పని లేకుండా ఇంట్లో బోరింగ్‌గా ఉందని అనుకున్న అప్పు, కావ్య వెళ్లి కల్యాణ్, రాజ్‌ల వల్ల టార్చర్ కనిపిస్తుందంటారు. దాంతో హౌజ్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేశామని రాజ్, కల్యాణ్ చెబుతారు. కావ్య కడుపు పోవాలంటే 2 పసరు మందులు తాగించాలని రుద్రాణికి ఈరయ్య చెబుతాడు.
అంటుంది. కావ్య కడుపు సంగతి నేను చూసుకుంటా.. రాజ్ గాడి సంగతి నువ్వు చూసుకో అని రుద్రాణి అంటే.. అదే పనిలో ఉన్నానని రాహుల్ అంటాడు.

ప్రశాంతంగా ఉంచకూడదు
మరోవైపు అప్పు దగ్గరికి కావ్య వస్తుంది. ఇద్దరు కలిసి హాల్లో టీవీ చూస్తారు. ఇలా తిని కూర్చోవడం బోరింగ్‌గా ఉందని అప్పు అంటుంది. మన హీరోలకు చెప్పి ఏదోటి చేయాలని ఇద్దరు కల్యాణ్, రాజ్‌ను చూస్తారు. వాళ్లు ఇద్దరు పనిలో ఉన్నారని కావ్య అంటే.. వాళ్లను ప్రశాంతంగా ఉంచకూడదు అని అప్పు అంటుంది. వారి దగ్గరికి వెళ్లి మమ్మల్నీ టార్చర్ చేస్తున్నారు.. మీరే అని అంటారు.
వాళ్లు ఏ పనిలేక పడుతున్న బాధల గురించి చెబుతారు అప్పు, కావ్య. అయితే, మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాం. అది రేపే చూడండి అని కల్యాణ్, రాజ్ వెళ్లిపోతారు. రాత్రి 12 గంటలకు రుద్రాణికి పసరు మందు ఈరయ్య కాల్ చేస్తాడు. ఎవరికి తెలియకుండా కిందకు వస్తుంది రుద్రాణి. వెనక్కి తిరగ్గానే ప్రకాశం ఉంటాడు. అది చూసి బెంబెలెత్తిపోతుంది రుద్రాణి.
రుద్రాణి ఏం మాట్లాడిన ప్రకాశం ఉలకడు పలకడు. ప్రకాశంకు నిద్రలో నడిచే అలవాటు ఉందని రుద్రాణి అనుకుంటుంది. రుద్రాణికి పసరు మందు ఇచ్చి ఇది కడుపులోకి వెళ్తే పిండం కకావికలం అవుతుంది. రేపు ఇంకో మందు ఇస్తాను. అది పూర్తిగా క్లీన్ చేస్తుందని ఈరయ్య చెప్పి వెళ్లిపోతాడు. కావ్య ఈ పసరు మందు వల్ల నా కూతురు ఈ ఇంటికి కోడలు కాబోతుంది. ఆస్తి మొత్తం వచ్చేలా చేయనుంది అని రుద్రాణి అనుకుంటుంది.
నిద్రలో నడిచే అలవాటు
మరుసటి రోజు ఉదయం ప్రకాశం రాత్రి హాల్లో పడుకున్న విషయం గురించి ధాన్యలక్ష్మీ అడుగుతుంది. తెలియదని ప్రకాశం అంటాడు. ఇంతలో రాజ్ వచ్చి ఇవాళ ఎవరు ఎక్కడికి వెళ్లకూడదు. ఈరోజు హౌజ్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని రాజ్ అంటాడు. దానికి సుభాష్, ప్రకాశం తెగ సంతోషిస్తారు.
రాజ్, కావ్య గదిలోకి వెళ్లి కషాయంలో పసరు మందు కలుపుతారు రుద్రాణి, రేఖ. అడవిలో నుంచి తీసుకొచ్చిన ఈ మందు కచ్చితంగా కడుపులో ఉన్న పిల్లాడిని హరి అనేలా చేస్తుంది. ఈ పసరు కలిపిన కషాయం ఒక్కరోజులో రెండు సార్లు తాగితే చాలింక కడుపు పోతుంది అని రుద్రాణి హామీ ఇస్తుంది. అంటే బావ త్వరలోనే నా సొంతం అవుతాడని రేఖ అంటుంది.
గదిలో నుంచి రుద్రాణి, రేఖ వెళ్లిపోతారు. అంతా హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో రాజ్, కల్యాణ్ వస్తారు. బౌల్‌లోని చిట్టీల్లో ఒక్కో యాక్టివిటీ ఉంది. అందులో ఉన్నట్లు చేయాలి అని రాజ్ చెబుతాడు. రేఖకు డ్యూయెట్ సాంగ్ వస్తుంది. సింగిల్‌గా ఎలా చేస్తాను అని రేఖ అంటే.. నీకోసం హీరో వస్తాడా అని ధాన్యం అంటుంది.
కషాయం తాగిన కావ్య
హీరో ఇక్కడే ఉన్నాడని రాజ్‌ను చూపిస్తుంది రేఖ. నేనా.. నేను చేయను అని రాజ్ చెబుతాడు. దాంతో రేఖ నిరాశపడుతుంది. కావ్యకు కషాయం ఇస్తాడు రాజ్. పసరు కలిపిన కషాయాన్ని కావ్య తాగుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


