బ్రహ్మముడి జనవరి 16 ఎపిసోడ్: బిడ్డను మార్చేశారని గుర్తించిన కావ్య.. మంత్రి అరాచకం.. గుండె సమస్య ఉన్న పాపను వదిలేసి..

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (జనవరి 16) ఎపిసోడ్ లో కావ్య తన పాపను మార్చేసినట్లు గుర్తిస్తుంది. గుండె సమస్య ఉన్న తన పాపను మార్చడానికి ఆరోగ్యంగా ఉన్న కావ్య పాపను మంత్రి ధర్మేంద్ర వాడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Published on: Jan 16, 2026, 08:17:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 931వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కావ్యతోపాటు దుగ్గిరాల కుటుంబానికి మరో సమస్య వచ్చి పడింది. రాజ్ విడుదలయ్యాడనే సంతోషం కంటే పాప మారిపోవడం వాళ్లకు కొత్త ఆందోళన తీసుకొచ్చింది.

బ్రహ్మముడి జనవరి 16 ఎపిసోడ్: బిడ్డను మార్చేశారని గుర్తించిన కావ్య.. మంత్రి అరాచకం.. గుండె సమస్య ఉన్న పాపను వదిలేసి..
బ్రహ్మముడి జనవరి 16 ఎపిసోడ్: బిడ్డను మార్చేశారని గుర్తించిన కావ్య.. మంత్రి అరాచకం.. గుండె సమస్య ఉన్న పాపను వదిలేసి..

తులసికి పుట్టిన బిడ్డకు గుండె సమస్య

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (జనవరి 16) ఎపిసోడ్ మంత్రి ధర్మేంద్ర భార్య తులసికి పుట్టిన కూతురికి గుండె సమస్య ఉన్నట్లు డాక్టర్లు గుర్తించే సీన్ తో ప్రారంభమైంది. అదే విషయాన్ని మంత్రికి చెబుతాడు డాక్టర్. అరుదైన గుండె వ్యాధితో పాప పుట్టిందని, సర్జరీ చేయాలని, అయితే అది కూడా ఇప్పుడే కాదని డాక్టర్ చెప్పడంతో ధర్మేంద్ర కుప్పకూలిపోతాడు. అతని పాపను కూడా కావ్య పాప ఉన్న ఇంక్యుబేటర్ పక్కనే పెడతారు. ఇదంతా రుద్రాణి గమనిస్తూ ఉంటుంది.

రాజ్‌ను కాపాడిన అప్పు.. మెచ్చుకున్న ఇంట్లో వాళ్లు

ఇటు కావ్యకు పాప పుట్టడంతో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఆమెకు స్పృహ రాగానే రాజ్ ను చూసి ఎంతో ఆనందిస్తుంది. అంతా అనుకున్నట్లుగా జరగడంతో ఇంట్లో వాళ్లందరు కూడా హ్యాపీగా ఉంటారు. అదే సమయంలో పోలీసులు వస్తారు. మీరు అడిగినట్లుగా తాము ఇంత వరకూ ఇక్కడే ఉండటానికి అంగీకరించామని, ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్దామని అంటారు. రాజ్ కూడా సరే అంటాడు.

అయితే అప్పుడే అక్కడికి వచ్చిన అప్పు అవసరం లేదని అంటుంది. రాజ్ నిర్దోషిగా తేలాడని, కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను చూపిస్తుంది. రాజ్ ను ఇరికించిన సాండీ నిజం ఒప్పుకున్నాడని, మీ ఎస్సైని అడిగి తెలుసుకోండని కానిస్టేబుల్స్ తో అప్పు అంటుంది. దీంతో వాళ్లు వెళ్లిపోతారు. అది చూసి ఇంట్లో వాళ్లందరూ అప్పును మెచ్చుకుంటారు. కూతురు పుట్టిన వేళా విశేషం.. రాజ్ పై పడిన నింద తప్పిపోయిందని అందరూ సంతోషిస్తారు. అప్పును కూడా మెచ్చుకుంటారు. అపార్థం చేసుకున్నందుకు క్షమాపణ కూడా చెబుతారు.

పాపను మార్చాలంటూ మంత్రి ధర్మేంద్ర దగ్గరికి రుద్రాణి

ఇటు తన పాప గురించి బాధపడుతూ కూర్చున్న మంత్రి ధర్మేంద్ర దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. తనను తాను పరిచయం చేసుకోకుండానే మీకు వచ్చిన సమస్యకు తన దగ్గర పరిష్కారం ఉందని చెబుతుంది. సర్జరీ చేసినా మీ పాప చనిపోతుందని, అలాంటి పాపను వదిలేసి మరో ఆరోగ్యంగా ఉన్న పాపను తీసుకోవాలని అంటుంది. ఆ పాప ఎక్కడుందో కూడా తనకు తెలుసని చెబుతుంది. దీంతో మంత్రి ఆమెపై కోప్పడతాడు. తాను అలాంటి పని చేయనని తేల్చి చెప్పి వెళ్లిపోతుంటే.. ఒకవేళ మనసు మార్చుకుంటే తనకు ఫోన్ చేయాలని తన కార్డు ఇస్తుంది.

కావ్య ఆందోళన.. ధైర్యం చెప్పిన రాజ్

ఇటు కావ్యలో ఆందోళన పెరుగుతుంది. ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదని రాజ్ తో అంటుంది. తాను గర్భం దాల్చినప్పుడు మొదట ఆ సమస్య, అది తీరిపోయిందనుకుంటే మిమ్మల్ని ఎవరో కావాలని ఇరికించి జైలుకు పంపించడం ఏంటని ఆందోళన చెందుతుంది. అసలు ఈ పని ఎవరు చేశారు.. ఎందుకు చేశారో తెలుసుకోవాలని అంటుంది. ఈ విషయంలో ఆందోళన వద్దని, పాప పుట్టినందుకు సంతోషంగా ఉండాలని రాజ్ ధైర్యం చెబుతాడు.

ఇటు మొదట వద్దని వెళ్లిపోయిన మంత్రి ధర్మేంద్ర తర్వాత మనసు మార్చుకొని తనకు పాప కావాలని రుద్రాణి దగ్గరికి వస్తాడు. కావ్య పాపను ఆమె చూపిస్తుంది. ఆ తర్వాత మంత్రి పాపను నర్సులు కావ్యకు ఇస్తారు. ఆమె వెంటనే ఆ పాప తన పాప కాదని గుర్తిస్తుంది. పాపను ఎవరో మార్చేశారని తెలిసిపోతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More