బ్రహ్మముడి జనవరి 12 ఎపిసోడ్: పోలీస్ స్టేషన్‌లో బాంబ్- తప్పించుకున్న రాజ్- కావ్యను చూడనివ్వకుండా అడ్డు పడిన ఎస్సై అప్పు!
బ్రహ్మముడి సీరియల్ జనవరి 12 ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌కు కావ్య వస్తుంది. రాజ్‌ను తనతోపాటు రమ్మంటుంది. ఇంతలో నొప్పులు రావడంతో కావ్యను తీసుకెళ్తాడు కల్యాణ్. మంత్రి ధర్మేంద్ర భార్య తులసి డెలివరికి అంతా రెడీ చేస్తారు. పోలీస్ స్టేషన్‌లో బాంబ్ ఉందని కల్యాణ్ కాల్ చేసి చెబుతాడు. దాంతో రాజ్ తప్పించుకుంటాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఉన్న హాస్పిటల్‌కే మంత్రి ధర్మేంద్ర తన భార్య డెలివరికి వస్తారు. డెలివరి బాగా అయ్యేలా తాము చూసుకుంటామని డాక్టర్ చక్రవర్తి చెబుతాడు. ఈసారైన అమ్మా అని పిలిపించుకుంటానా అని తులసి అంటుంది. చక్రవర్తి చెబుతున్నాడుగా. మనకు బిడ్డ పుడుతుంది. గ్రాండ్‌గా బారసాల చేస్తాం అని ధైర్యం చెబుతాడు మినిస్టర్ ధర్మేంద్ర.

వదినను తీసుకొస్తా
మరోవైపు బెడ్ మీద కావ్య ఉండదు. డాక్టర్ షాక్ అవుతుంది. ఉదయం వరకు ఇక్కడే ఉంది. ఇంతలోనే అని నర్స్ చెబుతుంది. కావ్య మిస్సింగ్ అనేది అపర్ణ వాళ్లకు డాక్టర్ చెబుతుంది. ఎక్కడికి వెళ్లిందో అని అంతా కంగారుపడతారు. వదిన ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసు. అన్నయ్య దగ్గరికే వెళ్లి ఉంటుంది అని కల్యాణ్ తీసుకొస్తా అంటాడు.
మరోవైపు పోలీస్ స్టేషన్‌కు కావ్య వెళ్తుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్న కావ్యను చూసి పోలీసులు షాక్ అవుతారు. ఈ కండిషన్‌లో ఎందుకు వచ్చావని రాజ్ బాధగా అంటాడు. మీరు ఎలా ఉన్నారో అని, మీరు దొంగ బంగారం కొనడం ఏంటీ వంటి అన్ని విషయాలు మాట్లాడుతుంది కావ్య. హాస్పిటల్‌కు వెళ్లమని రాజ్ అంటాడు. మీతోపాటే వెళ్తాను అని ఎస్సైని అడుగుతుంది కావ్య.
నా భర్త చాలా నిజాయితీపరుడు. వదిలిపెట్టండి అని దండం పెట్టి అడుగుతుంది కావ్య. మీ భర్త గురించి నాకు తెలుసు. కానీ, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. కోర్టులో చూసుకోండి అని ఎస్సై అంటాడు. దాంతో వెనక్కి తిరుగుతుంది కావ్య. ఎవరండి మన మీద ఇంత కుట్ర చేసింది అని ఏడుస్తుంది కావ్య. ఇంతలో కల్యాణ్ వస్తాడు. మీరే మన బిడ్డను మొదటగా చూడాలి అని రాజ్‌తో కావ్య అంటుండగా కావ్యకు నొప్పులు వస్తాయి.
డాక్టర్ అరుపులు
దాంతో కావ్యను కల్యాణ్ హాస్పిటల్‌కు తీసుకొస్తాడు. కావ్య నొప్పులతో బాధపడుతుంది. డాక్టర్ చెక్ చేస్తుంది. ఎలా ఉందని డాక్టర్‌ను అడుగుతారు. ప్రమాదం అంచుల మీద కొట్టుమిట్టాడుతుంది. తను అలా ఎలా వెళ్లింది. ఇలా వెళ్తే మా హాస్పిటల్ పరువు ఏం కావాలి అని ఇంట్లోవాళ్ల మీద అరుస్తుంది డాక్టర్. భర్త మీద ప్రేమతో ఇలా చేసింది. నా కోడలిని కాపాడండి అని ఇంట్లోవాళ్లు అంటారు.
మేమంతా జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు ఆపరేషన్ చేయండి అని అప్పు అంటుంది. తనకు బీపీ కంట్రోల్ కావట్లేదు. ఒకటి తనకు తాను బీపీ కంట్రోల్ చేసుకోవాలి. లేదా తన భర్త ఇక్కడికి రావాలి. ఆమె భర్త రాకుండా ఈ సర్జరీ జరిగేలా లేదని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు తులసికి మంత్రి ధర్మేంద్ర ధైర్యం చెబుతాడు.
డాక్టర్ వచ్చి అన్ని నార్మల్‌గా ఉన్నాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని చెబుతాడు. తులసి ఆపరేషన్‌కు అంతా రెడీ చేస్తారు. మరోవైపు పోలీస్‌ను పిలిచి ఫోన్ ఇవ్వమంటాడు. నా భార్య డెలివరి అవుతోంది. ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని రాజ్ అంటాడు. అలా ఫోన్ ఇవ్వడం నేరమయ్యా అని పోలీస్ అంటాడు. రాజ్ బతిమిలాడుకుంటాడు.
పోలీస్ స్టేషన్‌లో బాంబ్
దాంతో రెండే నిమిషాలు అని ఫోన్ ఇస్తాడు కానిస్టేబుల్. కల్యాణ్‌కు కాల్ చేసి కావ్య గురించి అడుగుతాడు రాజ్. కావ్య బీపీ గురించి, ఆపరేషన్ చేయించుకోనంటుంది అని కల్యాణ్ చెబుతాడు. ఎలాగైన నేను ఆపరేషన్‌కు వస్తాను. నా నిజాయితీ ఇలా సెల్‌లో నిలబెట్టింది. నిజాయితీగా ఉంటే బయటకు రాలేను. కళావతి పరిస్థితి చూస్తే తప్పు చేయక తప్పట్లేదు. ఒకసారి స్టేషన్‌కు కాల్ చేసి నేను చెప్పినట్లు చెప్పు అని రాజ్ ఐడియా ఇస్తాడు.
తర్వాత పోలీస్ స్టేషన్‌లో బాంబ్ పెట్టారని కాల్ చేసి కల్యాణ్ చెబుతాడు. దాంతో ఖైదీలతో సహా పోలీసులు అంతా బయటకు వస్తారు. అక్కడి నుంచి రాజ్ తప్పించుకుంటాడు. హాస్పిటల్‌కు వెళ్లిన రాజ్‌ను కావ్య దగ్గరికి వెళ్లకుండా అప్పు ఒక ఎస్సైగా అడ్డుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


