బ్రహ్మముడి జనవరి 9 ఎపిసోడ్: రాహుల్‌పై అప్పు డౌట్- పళ్లు రాలతాయన్న స్వప్న-ఆస్పత్రిలో కావ్య మిస్సింగ్- రాజ్‌కు రాని బెయిల్

బ్రహ్మముడి సీరియల్ జనవరి 9 ఎపిసోడ్‌లో కావ్య కంగారు పడటంతో ఏడో నెలలో నొప్పులు వస్తాయి. దాంతో హాస్పిటల్‌లో చేర్చుతారు. రాజ్ లేనిదే ఆపరేషన్ చేయించుకోనని చెబుతుంది కావ్య. రాహుల్‌ను అనుమానించిన అప్పు నిలదీస్తుంది. కానీ, స్వప్న మాత్రం రచ్చ చేస్తుంది. రాజ్‌కు బెయిల్ రాదు.

Published on: Jan 9, 2026, 07:59:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ అరెస్ట్ కావడంతో కావ్య తెగ కంగారు పడుతుంది. ఆయన ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటని కావ్య బాధపడుతుంది. ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారం చేశారనిపిస్తుందని కల్యాణ్ అంటాడు. అప్పు ఏదో ఒకటి చేయవే. ఎలాగైనా మీ బావను బయటకు తీసుకురా. నిన్న నా బిడ్డకు ప్రమాదం తలపెట్టారు, ఇవాళ ఆయన్ను అరెస్ట్ చేయించారని కావ్య తల్లడిల్లిపోతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 9 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 9 ఎపిసోడ్

హాస్పిటల్‌లో కావ్య

కావ్య టెన్షన్ పడుతూ నొప్పులతో అరుస్తుంది. ఏడో నెలలో నొప్పులు ఏంటీ అని ఇందిరాదేవి భయపడుతుంది. కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. డాక్టర్ చెక్ చేస్తుంది. సుభాష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. నాకు మా ఆయన్ను చూడాలని ఉంది. పిలిపించండి అని కావ్య కంగారుగా చెబుతుంది. సరేనంటుంది డాక్టర్.

బయటకొచ్చిన డాక్టర్ కావ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలి. పెయిన్స్ రావడంతో బిడ్డను క్యారీ చేయలేకపోతుంది. బీపీ నార్మల్ అయ్యాక ఆపరేషన్ చేస్తామం. వీలైనంత త్వరగా ఆమె భర్తను పిలిపించండి. బీపీ నార్మల్ కాకపోతే ఆపరేషన్ చేయలేం. చాలా సమస్య అవుతుందని డాక్టర్ చెబుతుంది.

మరోవైపు జైలులో సాండీ, దొంగ బంగారం, కారులో బ్యాగ్ దొరకడం గురించి రాజ్ ఆలోచిస్తాడు. ఇంతలో కల్యాణ్, సుభాష్ వస్తారు. రెండు రోజుల్లో బెయిల్ దొరుకుతుందని లాయర్ చెప్పాడని సుభాష్ అంటాడు. బెయిల్ కాదు. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలి. ఎవరి మీద అయినా డౌట్ కలిగిందా అని రాజ్ అంటాడు.

ఆలోచించే టైమ్ లేదు

అంత ఆలోచించే టైమ్ ఎక్కడిది అన్నయ్య. నువ్వు రాగానే వదినకు అని కల్యాణ్ ఆగిపోతాడు. ఏమైందని రాజ్ అడిగితే.. కావ్య గురించి సుభాష్ చెబుతాడు. ఇంతలో అప్పు కాల్ చేసి కావ్య పరిస్థితి గురించి చెబుతుంది. అదే విషయం రాజ్‌కు సుభాష్ చెబుతాడు. మరోవైపు కావ్య మీరు కంగారుపడకూడదు. ఇలా పడితే ఆపరేషన్ చేయలేం అని డాక్టర్ అంటుంది.

నా భర్త లేకుండా నేను ఆపరేషన్ చేయించుకోను. నా భర్తను చూస్తేకానీ నా టెన్షన్ తగ్గదు. నా భర్త చేయి పట్టుకుంటేనే నేను ఆపరేషన్ థియేటర్‌కు వస్తాను అని కావ్య అంటుంది. ఇంతలో సుభాష్ వస్తాడు. హాలీడేస్ వల్ల రాజ్‌కు బెయిల్ వచ్చే అవకాశం లేదని సుభాష్ చెబుతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి కావ్య భర్త లేకుండా ఆపరేషన్ చేసుకోను అని మొండిపట్టు పడుతుందని సీరియస్ అవుతుంది.

రాజ్ బెయిల్ గురించి చెబుతారు. రెండు రోజుల వరకు వెయిట్ చేస్తే కావ్యకు బిడ్డకు ఇద్దరికి ప్రమాదం అని డాక్టర్ చెబుతుంది. ఏదో ఒకటి చేసి రాజ్‌ను తీసుకురండి. అప్పుడే కావ్య ఒప్పుకుని ఆపరేషన్ చేయించుకుంటుందని డాక్టర్ చెబుతుంది. మేము కావ్యకు సర్దిచెబుతామని ఇందిరాదేవి, అపర్ణ అంటే.. తన బీపీ నార్మల్ అయ్యాక మాట్లాడండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది.

రాహుల్‌ను నిలదీసిన అప్పు

ఇంతలో రాహుల్ బ్యాగ్ తీసుకొచ్చింది గుర్తు చేసుకుంటుంది అప్పు. రాహుల్‌ను చూస్తూ నిన్ను ఒకటి అడుగుతా చెబుతావా అని అప్పు అంటుంది. ఆరోజు రాత్రి నువ్వు ఒక బ్రీఫ్ కేస్ పట్టుకోవచ్చుగా. అందులో ఏముంది. నువ్వు తీసుకొచ్చిన బ్రీఫ్ కేసు, బావ కారులో దొరికిన బ్రీఫ్ కేసు ఒకేలా ఉన్నాయి. ఆరోజు అడిగితే తడబడ్డావ్ అని అప్పు అంటుంది.

నీ పోలీస్ బుద్ధి నా మొగుడిపై చూపించకు అని కోపంగా అరుస్తుంది స్వప్న. ఆరోజు రాహుల్ బ్రీఫ్ కేసుతో వచ్చాడని అప్పు అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్లు రాలతాయ్. బిజినెస్ చేసేవాడు బ్రీఫ్ కేసుతో రాడా అని స్వప్న రచ్చ చేస్తుంది. నా కోడలిని అంటే మర్యాదగా ఉండదని ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది. ఏంటీ మర్యాద అంటూ ధాన్యలక్ష్మీపై అరుస్తుంది స్వప్న.

ఇంతలో కల్యాణ్ వస్తాడు. రాజ్ కేసు నుంచి బయటపడుతున్నాడని కావ్యతో చెబుతాడు. దాంతో కావ్య సంతోషిస్తుంది. బయట అపర్ణ వాళ్లు అడిగితే వదినకు అబద్ధం చెప్పానని కల్యాణ్ అంటాడు. ఆ మాటలు విన్న కావ్య బాధపడుతుంది. మరుసటి రోజు హాస్పిటల్‌లో కావ్య ఉండదు. మిస్ అయిందని డాక్టర్ చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More