గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మూవీ రిమ్‌జిమ్- రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా- అస్లీదమ్ అంటూ!

ఆస్కార్ వేదికపై మెరిసిన సింగర్, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం రిమ్‌జిమ్. ఇటీవల రిమ్‌జిమ్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఏపీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్

Published on: Jan 5, 2026, 11:52:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటోంది. అలా నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న లేటెస్ట్ తెలుగు సినిమానే రిమ్‌జిమ్. 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మూవీ రిమ్‌జిమ్- రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా- అస్లీదమ్ అంటూ!
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మూవీ రిమ్‌జిమ్- రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా- అస్లీదమ్ అంటూ!

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో

రిమ్‌జిమ్ సినిమాకు హేమ సుందర్ దర్శకత్వం వహించారు. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో రూపొందించారు. ఈ రిమ్‌జిమ్’ మూవీకి ‘అస్లీదమ్’ అనేది ట్యాగ్‌లైన్. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ రిమ్‌జిమ్ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

త్వరలోనే రిలీజ్

ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. రిమ్‌జిమ్ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని రిమ్‌జిమ్ డైరెక్టర్ హేమ సుందర్ చెప్పారు.

కీలక పాత్రలో రాహుల్ సిప్లిగంజ్

ఏవీ సినిమాస్, సి విజువల్స్ బ్యానర్లపై జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ రిమ్‌జిమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకత్వంతోపాటు కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా హేమ సుందర్ చేపట్టారు. ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డుల్లో మెరిసిన రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించారు.

హీరో హీరోయిన్స్

అంతేకాకుండా రాహుల్ సిప్లిగంజ్ పాడిన రెండు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. అయితే, రిమ్‌జిమ్ సినిమాలో అజయ్ వేద్ హీరోగా వ్రజన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కనిపించనున్నారు.

రియలిస్టిక్ టోన్

సాంకేతిక విభాగంలో సంగీతం కొక్కిలగడ్డ ఇఫ్రాయిం, సినిమాటోగ్రఫీ వాసు పెండం, ఎడిటింగ్ పెనుమత్స రోహిత్ నిర్వహిస్తున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న ‘గ్యాంగ్‌స్టర్’ ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుందని మేకర్స్ తెలిపారు.

సింగర్‌గానే కాకుండా

ఇదిలా ఉంటే, తన పాటలతో టాలీవుడ్‌ను ఊపేయడమే కాకుండా ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ వేదికపై మెరిసిన గొంతు రాహుల్ సిప్లిగంజ్. కేవలం సింగర్‌గానే కాకుండా ‘రంగమార్తాండ’లో తన నటనతోనూ రాహుల్ మెప్పించాడు.

కథను మలుపు తిప్పే పాత్ర

ఇప్పుడు ‘రిమ్‌జిమ్’ సినిమాలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్ర పోషించడం విశేషంగా మారింది. అలాగే, ఇటీవల విడుదలైన రాహుల్ సిప్లిగంజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. రాహుల్ పోషించిన ఈ పాత్ర రిమ్‌జిమ్‌లో కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More