బ్రహ్మముడి జనవరి 8 ఎపిసోడ్: జైల్లో రాజ్- విషమంగా కావ్య పరిస్థితి- తల్లిబిడ్డకు ప్రమాదం- ఆపరేషన్ చేయించుకోనన్న కళావతి

బ్రహ్మముడి సీరియల్ జనవరి 8 ఎపిసోడ్‌లో రాజ్ ఇంటికి పోలీసులు వచ్చి ఇళ్లంతా వెతుకుతారు. రాజ్ కారులో దొంగ బంగారం దొరుకుతుంది. దాంతో రాజ్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కావ్యకు నొప్పులు రావడంతో పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెబుతారు. కానీ, కావ్య ఆపరేషన్ చేయించుకోనని చెబుతుంది.

Published on: Jan 8, 2026, 07:37:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో బిడ్డను రుద్రాణి చంపాలనుకున్నది కావ్య తట్టుకోలేకపోతుంది. రాజ్ వచ్చి ఓదారుస్తాడు. మా అమ్మ చూడకపోతే మన బిడ్డ మీద మనమే మట్టి పోసుకునే పరిస్థితి వచ్చేదని కావ్య అంటే అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకని రాజ్ అంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 8 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 8 ఎపిసోడ్

ఒకరి రాక్షసత్వం

దేవుడు మనకు అండగా ఉన్నాడు. అందుకే మనకి చివరి క్షణంలో తెలిసింది అని రాజ్ అంటాడు. ఇందరి మంచి మనుషుల నుంచి ఒకరి రాక్షసత్వం బయటపడిందంటే భయంగా ఉంది. ముందు ముందు మన బిడ్డకు ఏ వైపు నుంచి ప్రమాదం వస్తుందో అని భయంగా ఉంది. హాస్పిటల్‌లో నా బిడ్డకు భద్రత ఉండదనిపిస్తుంది. నా జన్మనిచ్చే సమయంలో మీరు నా పక్కనే ఉంటానని నాకు మాట ఇవ్వండి అని కావ్య అంటుంది.

మీరు లేకుంటే ఆపరేషన్ థియేటర్‌లోకి కూడా వెళ్లను. నా పక్కనే ఉంటానని నాకు మాట ఇవ్వండి అని కావ్య చేయి చాపుతుంది. చేతిలో చేయి వేసి రాజ్ మాట ఇస్తాడు. తర్వాత ఇంట్లో అంతా డల్‌గా ఉంటారు. రాహుల్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. మీకు కోపం పోకపోతే మమ్మల్ని తిట్టండి. మీరు కుమిలిపోతే తట్టుకోలేమని రాహుల్ అంటాడు. రాజ్ వచ్చి అందరిని ఓదారుస్తాడు.

వీరంతా అవమానపడతారు

ఇంతలో ప్రకాశం వచ్చి రుద్రాణి కనిపించట్లేదు ఏంటీ అని అందరిని అడుగుతాడు. ఇంటికి పోలీసులు వస్తారు. అందరు కలిసి అమ్మను అవమానించారు. ఇప్పుడు వీరంతా ఎలా అమానపడతారో చూడు అని రేఖతో అంటాడు రాహుల్. రాజ్ దొంగ బంగారం నిల్వ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఎస్సై అంటాడు. అంతా షాక్ అవుతాడు.

సాండీ దగ్గర రెండు కోట్ల విలువ గల దొంగ బంగారం కొన్నారు అని సాండీని పిలుస్తాడు ఎస్సై. తెచ్చిన గోల్డ్ అంతా మీకే అమ్మానని చెప్పాడని ఎస్సై అంటాడు. ఎస్సై అడిగితే దొంగ బంగారంరాజ్‌కే అమ్మాను అని అబద్ధం చెబుతాడు. దొంగ బంగారం ఇంట్లో ఉంది. సెర్చ్ చేయాలి అని ఎస్సై అంటాడు. సెర్చ్ వారెంట్ చూసిన అప్పు కోర్ట్ నుంచి పర్మిషన్ తెచ్చారు అని చెబుతుంది.

రాజ్ కారులో దొంగ బంగారం

కానిస్టేబుల్స్ అంతా ఇంట్లో వెతుకుతారు. ఇంట్లో బంగారం దొరకలేదని కానిస్టేబుల్స్ వచ్చి చెబుతారు. కారులో వెతకమని ఎస్సై చెబుతాడు. కారులో దొంగ బంగారం బ్రీఫ్ కేస్ దొరుకుతుంది. రాజ్ కారులో స్మగ్‌ల్డ్ గోల్డ్ పెట్టింది గుర్తు చేసుకుంటాడు రాహుల్. బంగారం పెట్టి పోలీసులకు సాండీని దొరికిపోమ్మని చెబుతాడు రాహుల్. ఎస్సై ఆ బ్రీఫ్ కేస్ చూస్తే దొంగ బంగారం ఉంటుంది.

అంతా షాక్ అవుతారు. అదంతా నా కారులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని రాజ్ అంటాడు. అది నేను తెలుసుకుంటాను. యూ ఆర్ అండర్ అరెస్ట్ రాజ్ అని ఎస్సై అంటాడు. ఇదంతా మోసం అని కావ్య కంగారుపడుతుంది. అంతా రేపు కోర్టులో చెప్పుకోండి అని ఎస్సై అంటాడు. రాజ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు. కావ్య టెన్షన్ పడుతుంటుంది.

తల్లి, బిడ్డకు ప్రమాదం

ఇంతలో కావ్యకు నొప్పులు వస్తాయి. హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. కావ్య కండిషన్ క్రిటికల్‌గా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెబుతుంది. మరోవైపు జైలులో ఉన్న రాజ్‌కు రెండు రోజుల్లో బెయిల్ వచ్చేలా చేస్తానని లాయర్ చెప్పాడని, కావ్యకు ఆపరేషన్ చేయాలని అంటున్నారని, లేకుంటే కావ్య ప్రాణానికే ప్రమాదం అని అంటున్నారని చెబుతాడు తండ్రి సుభాష్.

నా భర్త నా పక్కన లేకుండా నేను ఆపరేషన్ చేయించుకోనని కళావతి అంటుంది. అదే విషయం ఇంట్లోవాళ్లకు డాక్టర్ చెబుతుంది. రెండు రోజుల వరకు ఎదురుచూస్తే తల్లిబిడ్డ ఇద్దరికి ప్రమాదం అని డాక్టర్ చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More