బ్రహ్మముడి జనవరి 13 ఎపిసోడ్: రాజ్ సమక్షంలో పాపకు జన్మనిచ్చిన కావ్య- దుగ్గిరాల ఇంటికి వారసురాలు- మధ్యలో నలిగిపోయిన అప్పు!
బ్రహ్మముడి సీరియల్ జనవరి 13 ఎపిసోడ్‌లో కానిస్టేబుల్ క్యారేజ్‌లో బాంబ్ ఉందని చెప్పి తప్పించుకుంటాడు రాజ్. హాస్పిటల్‌కు వెళ్లిన రాజ్‌ను అప్పు అడ్డుకుంటుంది. అప్పుకు దుగ్గిరాల కుటుంబం అడ్డు పడుతుంది. రాజ్ సమక్షంలో పాపకు జన్మిస్తుంది కావ్య. దుగ్గిరాల ఇంటికి వారసురాలు వస్తుంది. దాంతో అంతా సంతోషిస్తారు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కల్యాణ్‌కు కాల్ చేసిన రాజ్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి తాను చెప్పినట్లు చెప్పమని అంటాడు. కల్యాణ్ ఒప్పుకుంటాడు. ఓ ఫ్రెండ్‌కి కాల్ చేసిన కల్యాణ్ కానిస్టేబుల్ దేవరాజు ఉంటాడు. అతనికి ఇంటి నుంచి క్యారియర్ వచ్చిందని చెప్పి బరువుగా ఉండే లంచ్ బాక్స్ పట్టుకెళ్లి ఇవ్వు అని చెబుతాడు.

క్యారేజ్‌లో బాంబ్
కల్యాణ్ ఫ్రెండ్ అలాగే చేస్తాడు. అదే విషయం కల్యాణ్‌కు చెబుతాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి బాంబ్ పెట్టారని, ఇందాకా తీసుకొచ్చిన క్యారేజ్‌లో టిఫిన్ బాంబ్ పెట్టారు అని కల్యాణ్ చెబుతాడు. దాంతో అంతా అలర్ట్ అయి క్రిమినల్స్ అందరిని బయటకు తీసుకురమ్మని ఎస్సై చెబుతాడు. రాజ్‌తోపాటు అందరిని బయటకు తీసుకొస్తారు.
కల్యాణ్ వచ్చి రాజ్‌ను పిలుస్తాడు. దాంతో రాజ్ తప్పించుకుంటాడు. తర్వాత బాంబ్ స్క్వాడ్ వస్తుంది. పోలీస్ స్టేషన్‌లో బాంబ్ కోసం వెతుకుతారు. దేవరాజ్ టిఫిన్ బాక్స్‌లో సౌండ్ వస్తుంది. అది తీసి చూస్తే అందులో రాయిలు ఉంటాయి. దాంతో బయటకు వచ్చిన బాంబ్ స్క్వాడ్ బాంబ్ లేదని, క్యారేజ్‌లో రాళ్లు మాత్రమే ఉన్నాయని చెబుతారు.
పక్కకు చూస్తే రాజ్ కనిపించడు. రాజ్ తప్పించుకున్నాడని కానిస్టేబుల్ దేవరాజ్ చెబుతాడు. వాడు ఎక్కడికి వెళ్లాడో, ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అని ఎస్సై అప్పుకు కాల్ చేస్తాడు. మీ బావ రాజ్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. మీ బావును నున్వే అరెస్ట్ చేసి తీసుకురావాలి అని ఎస్సై అంటాడు. సర్ నేను ఆఫ్ లీవ్‌లో ఉన్నాను. అదేదో మీరే అరెస్ట్ చేయొచ్చుగా అని అప్పు అంటుంది.
ముల్లును ముల్లుతోనే తీయాలి
వాడికి పోలీసులు అంటే ఆటలుగా ఉంది. ముల్లును ముల్లుతోనే తీయాలి. అందుకే నీకు చెబుతున్నా. ఇది నా ఆర్డర్. గంటలో కానిస్టేబుల్స్‌ను పంపిస్తాను. అరెస్ట్ చేసి పంపించు అని ఎస్సై చెబుతాడు. కావ్య ఎంతకీ వినకపోడవంతో ఆమె భర్తను అయినా ఇక్కడికి తీసుకురండి. లేదా ఆవిడను వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది.
ఇంతలో రాజ్ వస్తాడు. తప్పించుకుని వచ్చానని చెబుతాడు. కావ్య గురించి రాజ్ అడుగుతాడు. మొండిపట్టు పట్టి కూర్చుందని చెబుతారు. ముందు నువ్వు లోపలికి వెళ్లు అని అంతా అంటే ఆగు బావ. నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్లడానికి వీళ్లేదు అని అప్పు అంటుంది. ఏంటీ నీ భార్య అని రాజ్ షాక్ అవుతాడు. ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్న ఎస్సైని అని అప్పు అంటాడు.
కావ్య ప్రమాదంలో ఉంది అప్పు అని రాజ్ అంటే.. నేను డ్యూటీలో ఉన్నాను. నువ్వు లొంగిపో. నిన్ను అరెస్ట్ చేయడం నాకు వచ్చిన ఆర్డర్ అని అప్పు అంటుంది. ఇంతలో కానిస్టేబుల్స్ వస్తారు. నిండు ప్రాణాలు తీయడమా నీ డ్యూటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది. రాజ్ గారు తప్పు చేశారు. ఉన్న కేసు కాకుండా తప్పించుకున్న మరో కేసు కూడా ఫైల్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే లొంగిపోవాలని అప్పు అంటుంది.
అప్పుకు అడ్డుపడిన కుటుంబం
నా భార్య కోసం జీవితాంతం జైల్లో కూర్చోడానికి కూడా వెనుకాడని అని రాజ్ అంటాడు. మీకోసం కావ్య ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీకోసం పాటు పడిందే. అందుకు బాగా కూలీ ముట్టజెబుతున్నావా అని అప్పు అంటుంది. అయినా అప్పు వినదు. దాంతో ఇంటిల్లిపాది రాజ్‌కు అడ్డు పడతారు. రాజ్‌ను కావ్య దగ్గరికి పంపిస్తుంది అపర్ణ. మీరు ఏం చేయలేకపోతున్నారు అని అప్పును అంటారు కానిస్టేబుల్స్.
అటు కుటుంబం ఇటు డ్యూటీ, కానిస్టేబుల్స్, బంధం, బాధ్యతల మధ్య ఇరుక్కుని నలిగిపోతుంది అప్పు. మీరే అరెస్ట్ చేయండి అని కానిస్టేబుల్స్‌కు చెబుతుంది అప్పు. కానిస్టేబుల్స్‌ను దుగ్గిరాల కుటుంబం వెళ్లనివ్వదు. డాక్టర్ వచ్చి ఇలా పర్మిషన్ లేకుండా పేషంట్ గదిలోకి వెళ్లకూడదు. రాజ్‌ను అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉండాలి అని డాక్టర్ చెబుతాడు.
ఇదంతా మా కుటుంబం విషయం. మేము చూసుకుంటాం అని డాక్టర్‌ను పంపిస్తుంది అప్పు. కలవరిస్తున్న కావ్యను రాజ్ పలకరిస్తాడు. దాంతో కావ్య సంతోషిస్తుంది. మీరు లేకుండా నాకు ధైర్యం ఎలా ఉంటుంది అని చాలా మాటలు మాట్లాడుతుంది కావ్య. బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రపంచాన్ని చూపిస్తాం అని రాజ్ అంటాడు.
దుగ్గిరాల ఇంటికి వారసురాలు
ఇంతలో డాక్టర్ వస్తుంది. మిమ్మల్ని రమ్మంది కావ్యకు భర్తగా కానీ క్రిమినల్‌గా కాదు. క్రిమినల్‌ను పక్కన పెట్టుకుని డెలివరి చేస్తే మా హాస్పిటల్ పరువు పోతుంది. బయటకు వెళ్లండి అని డాక్టర్ అంటుంది. కావ్య, రాజ్ వేడుకుంటారు. దాంతో డాక్టర్ ఒప్పుకుంటుంది.
ఆపరేషన్ థియేటర్‌లో రాజ్ ఉంటాడు. అలా రాజ్ సమక్షంలో కావ్యకు పాప పుడుతుంది. ఇంటిల్లిపాది సంతోషిస్తారు. చాలా డ్రామా, సస్పెన్స్ తర్వాత దుగ్గిరాల ఇంటికి వారసుడు కాకుండా వారసురాలు పుడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


