కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్, టైం లేదన్న డాక్టర్- అత్తకు గండం, ఆరిపోయిన దీపం-ఇల్లు ఊడ్చిన పారు
కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 2వ ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కు దశరథ్, కార్తీక్ వెళ్తారు. దశరథ్‌ను పంపించి కార్తీక్‌కు నిజం చెబుతుంది లేడి డాక్టర్. సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్. టైం లేదని, లేట్ చేయొద్దని చెబుతుంది డాక్టర్. తాత చెప్పిన గండం అత్తకు వచ్చిందని కార్తీక్ బాధపడుతాడు. ఇంట్లో దీపపై అరుస్తుంది పారిజాతం.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర రిపోర్ట్స్ గురించి కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. ఇంతలో దశరథ్ వచ్చి హాస్పిటల్‌కు వెళ్దామని చెబుతాడు. సరేనని దీపను టెన్షన్ పడకని చెప్పి కార్తీక్ వెళ్తాడు. ఇంతలో తులసి కోటలో ఉన్న దీపం ఆరిపోతుంది. అది చూసి దీప షాక్ అవుతుంది.

దశరథ్‌కు పెరిగిన బీపీ
హాస్పిటల్‌లో డాక్టర్ హారికను దశరథ్, కార్తీక్ కలుస్తారు. దశరథ్ కంగారు చూసి వాటర్ తాగమంటుంది డాక్టర్. దశరథ్ నీళ్లు తాగుతాడు. కార్తీక్ ఎవరు అని డాక్టర్ అడిగితే మేనల్లుడు, కొడుకు కంటే ఎక్కువ అని చాలా కంగారుగా చెబుతాడు దశరథ్. పక్కనున్న డాక్టర్‌కు దశరథ్ గారికి బీపీ చెక్ చేయించండి, హై బీపీ ఉన్నట్లుంది అని పంపిస్తుంది డాక్టర్ హారిక.
కార్తీక్‌ను మాత్రం ఉండమంటుంది. సుమిత్రకు ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెబుతుంది. మరోవైపు కాశీ గురించి ఏం ఆలోచించావ్ అని జ్యోత్స్నను అడుగుతుంది పారిజాతం. వెంటనే అయిపోదని జ్యో అంటుంది. కార్తీక్, దశరథ్ ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలని జ్యోని పిలుస్తుంది పారిజాతం. కాశీ జైల్లో ఉండటం గురించి నానా మాటలు అంటుంది పారిజాతం.
కాశీ పోతే స్వప్న మరో పెళ్లి చేసుకుంటుంది అని జ్యో అనబోతుంటే దీప ఆపుతుంది. దశరథ్ ఎక్కడికి వెళ్లాడని అడిగితే ఫోన్ చేసి కనుక్కోండని అంటుంది దీప. కాశీని అంతా వాడుకున్నారని రచ్చ చేస్తుంది పారిజాతం. కాఫీ ఇవ్వమని లాక్కుంటుంది. అది కింద పడుతుంది. దీప మీద అరుస్తూ వెళ్తుంటే శివ నారాయణ వచ్చి అడ్డుకుంటాడు.
పారిజాతంకు వార్నింగ్
కాఫీ ఎలా కింద పడిందో తెలుసు. మనవడు జైలులో ఉంటే కాఫీ తాగే అంత తీరిక ఎలా ఉందో మరి. నువ్వెళ్లొచ్చుగా పోలీస్ స్టేషన్‌కు. కావాలంటే రెండు రోజులు జైళ్లో ఉండు. ఎస్సైతో నేను మాట్లాడుతాను అని శివ నారాయణ అంటాడు. ఇంతలో సుమిత్ర వచ్చి దీపను ఎవరికి కాఫీలు ఇవ్వకని, వంటలు మాత్రం చేసుకోమ్మని చెబుతుంది. దీప వెళ్లి కాఫీ కప్ ఊడవడానికి వస్తుంది.
అది వేరే వాళ్లు తీస్తారని దీపను పంపిస్తాడు శివ నారాయణ. పారిజాతాన్ని తీయమని చెబుతాడు. కాఫీ మరకలు లేకుండా తీసేలా చూడమని జ్యోకి చెప్పి వెళ్లిపోతాడు శివ నారాయణ. పారిజాతంతో ఊడిస్తుంది జ్యోత్స్న. ఆ దీప ఎందుకే ఏడుస్తుంది. ఇంట్లో మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని పారిజాతం అంటుంది.
మరోవైపు సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని కార్తీక్‌కు డాక్టర్ చెబుతుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. పంతులు చెప్పింది గుర్తు చేసుకుంటాడు. తల్లడిల్లిపోతాడు కార్తీక్. ఇప్పుడు ఏం చేయాలి, అత్తను ఎలా కాపాడుకోవాలి అని కార్తీక్ అడుగుతాడు. ఇంకా చేయాల్సిన కొన్ని టెస్ట్‌లు ఉన్నాయి. వాటి తర్వాతే దీనికి ట్రీట్‌మెంట్ ఏంటో తెలుస్తుంది. కానీ, దానికి 2 డేస్ పడుతుంది. మీ అత్తకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ చేసే దశలోనే ఉందని డాక్టర్ చెబుతుంది.
సుమిత్రకు గండం
రెండు రోజుల్లో సుమిత్రను హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలి. మీరే ఇలా ఉన్నారంటే వాళ్లు ఎలా తట్టుకుంటారో తెలియదు. వ్యాధి కంటే భయం ఎక్కువ చంపేస్తుంది. ముందు ఇంట్లోవాళ్లకు, తర్వాత సుమిత్రకు చెప్పి ప్రిపేర్ చేయించండి. మీకు ఎక్కువ టైమ్ లేదు. భయంతో వణికిపోతున్న మనిషికి ట్రీట్‌మెంట్ చేయలేం. టైమ్ లేదన్నది గుర్తు పెట్టుకోండి అని డాక్టర్ చెబుతుంది.
మెడిసిన్ రాసిస్తా ఈ రెండు రోజులు మీ అత్తతో వాడించండి అని డాక్టర్ చెబుతుంది. తాత చెప్పిన గండం అత్తకు వచ్చింది. ఈ నిజం ఎవరు తట్టుకోలేరు. ఎలా చెప్పాలి అని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలో దశరథ్ వస్తే.. ఇక మీరు బయలుదేరొచ్చు అని డాక్టర్ చెబుతుంది. మెడిసిన్ తీసుకుని వెళ్దామని కార్తీక్ అంటాడు. దాంతో ఇద్దరు వెళ్తారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


