నిన్ను కోరి జనవరి 2 ఎపిసోడ్: అర్జున్ కూతురికి తల్లిగా చంద్రకళ- చీర మార్చుకోవడంపై శ్యామల గొడవ- చచ్చిన క్షమించనన్న క్రాంతి
నిన్ను కోరి సీరియల్ జనవరి 2 ఎపిసోడ్‌లో క్రాంతికి చంద్రకళ వడ్డిస్తే కోపంగా లేచి నానా మాటలు అంటాడు. చచ్చిన క్షమించలేను అని క్రాంతి అనడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది చంద్రకళ. అర్జున్ కాల్ చేయడంతో ఇంటికి వెళ్తుంది చంద్రకళ. అక్కడ చంద్రకళను అమ్మా అంటూ పిలిచి ఏడుస్తుంది తేజు. తేజుకు తల్లిగా మారుతుంది చంద్ర.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అంతా కలిసి కూర్చుని భోజనం చేస్తుంటారు. శాలిని వస్తుంది పక్కన వచ్చి కూర్చోమని విరాట్‌కు చెబుతాడు క్రాంతి. దాంతో శాలిని షాక్ అవుతుంది. చంద్రకళ వడ్డిస్తే క్రాంతి కోపంగా లేస్తాడు. నిన్ను ఎవరు వడ్డించమన్నారు. నా విషయంలో ఎందుకు వస్తున్నావ్. అన్నయ్యతో కలిసిపోయినంత మాత్రాన నీ తప్పులను క్షమిస్తాను అనుకున్నావా నిలదీస్తాడు.

చచ్చిన క్షమించలేను
అన్నింట్లో ఎందుకు పెత్తనం చేస్తావు అని విరాట్ అంటాడు. నీ వల్ల నేను బిడ్డను కోల్పోయాను. నిన్ను చచ్చిన క్షమించలేను అని క్రాంతి అంటాడు. దాంతో చంద్రకళ ఏడుస్తుంది. నీ బుద్ధి ఏంటో అన్నయ్యకు తెలిసొచ్చింది. నీ నాటకాలు పనిచేయవని క్రాంతి అంటాడు. ఎందుకు ఇంత పగ అని శాలిని డ్రామా చేస్తుంది.
క్రాంతి తినకుండా వెళ్లిపోతాడు. శాలిని కూడా వెళ్లిపోతుంది. చంద్ర వెళ్లిపోతుంది. చంద్రకళకు భోజనం తీసుకొస్తాడు విరాట్. చంద్రను ఓదారుస్తాడు. వీలైనంత త్వరగా శాలిని నిజ స్వరూపం తెలిసేలా చేస్తే ఈ అవమానాలు, నిందలు పోతాయి. అప్పటివరకు క్రాంతిని క్షమించు అని విరాట్ అంటాడు. క్రాంతి నాకు బిడ్డలాంటి వాడు. శాలిని వల్ల అలా అయ్యాడు అంతే అని చంద్రకళ అంటుంది.
తిండి కూడా తినట్లేదు
తర్వాత చంద్రకళకు అర్జున్ కాల్ చేసి తేజూ ఆరోగ్యం గురించి చెబుతాడు. అమ్మ కోసం తిండి కూడా తినట్లేదని అర్జున్ చెబుతాడు. బిజినెస్‌కు సంబంధించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి ఇంటికి వస్తారా అని అర్జున్ అడిగితే సరేనంటుంది చంద్రకళ. అర్జున్ ఇంటికి వెళ్తుంది చంద్రకళ. అమ్మ వచ్చేవరకు ఏం తినను తేజు మారం చేస్తుంది.
ఆ మాటలు విన్న చంద్రకళ పైకి వెళ్తుంది. కూతురు ఎంతకు తినకపోవడంతో బాధగా వెళ్తాడు అర్జున్. ఏం చేయాలో తెలియట్లేదు. ఆ బాధ కంటే చావడం బెటర్ అనిపిస్తుందని అర్జున్ అంటాడు. చంద్రకళ ఓదారుస్తుంది. మీరేం భయపడకండి తేజూతో నేను తినిపిస్తాను అని ఫుడ్ తీసుకెళ్తుంది చంద్రకళ.
తేజుకు తల్లిగా చంద్రకళ
చంద్రకళను చూసిన తేజు అమ్మా అని పిలుస్తుంది. వచ్చేశావా అని ఏడుస్తూ చంద్రకళను హగ్ చేసుకుంటుంది పాప. దాంతో అంతా షాక్ అవుతారు. నాన్న చెబితే అబద్దం అనుకున్నా. నిజంగానే వచ్చావ్. ఇన్నిరోజులు ఎందుకు రాలేదు. ఎలాగు చచ్చిపోతానని చూడటం ఎందుకని రాలేదా. నువ్వు మా అమ్మవే కదా అని తేజు అంటుంది. అమ్మనే తేజు. మీ అమ్మనే అని తేజును చంద్రకళ హగ్ చేసుకుంటుంది.
తేజుకు తల్లిగా చంద్రకళ మారుతుంది. నేను అన్నం తినకుండా ఉంటే తప్పా నువ్వు రాలేదు అని తేజు అంటుంది. తర్వాత ఇంటికి వచ్చిన చంద్రకళతో చీర ఎక్కడ మార్చుకున్నావ్ అని నిలదీస్తుంది శ్యామల. ఆఫీస్‌లో పచ్చడి పడితే మార్చుకున్నా అని చంద్రకళ అబద్ధం చెబుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


