నిన్ను కోరి డిసెంబర్ 31 ఎపిసోడ్: అన్నయ్య బంగారమన్న క్రాంతి-బ్రదర్స్‌ను విడగొట్టేందుకు శాలిని కుట్ర-కామాక్షి గాజులు
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 31 ఎపిసోడ్ లో బావ మాటలు నమ్మొద్దని క్రాంతిని రెచ్చగొడుతోంది శాలిని. అది ఊహించి విరాట్, చంద్ర డ్రామా కొనసాగిస్తారు. దీంతో అన్నయ్య బంగారమని క్రాంతి అనుకుంటాడు. అన్నదమ్ములను విడగొట్టేందుకు శాలిని మరో ప్లాన్ వేస్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 31 ఎపిసోడ్ లో రాజ్ కోసం వచ్చిన అప్పులోళ్లు చేతికి ఉన్న రెండు గాజులు ఇస్తావా? లేదా నీ కూతురిని తీసుకెళ్లమంటావా? అని కామాక్షిని బెదిరిస్తారు. కామాక్షి ఆ రెండు గాజులు ఇచ్చేస్తుంది. నువ్వు, నీ కూతురు జాగ్రత్త అని చెప్పి వాళ్లు వెళ్లిపోతారు. రేపే నేను వెళ్లిపోవాలని కామాక్షి అనుకుంటుంది.

క్రాంతిని రెచ్చగొట్టిన శాలిని
ఓ వైపు విరాట్ ను నమ్మొద్దని క్రాంతిని రెచ్చగొడుతుంది శాలిని. మరోవైపు శాలిని కుట్రను విరాట్ కు చెప్తుంది చంద్రకళ. మిమ్మల్ని విడగొట్టడమే శాలిని గోల్ బావ అని చంద్ర అంటుంది. మెల్లగా బావను నిన్ను దగ్గరకు చేసి నన్ను దోషిలా నిలబట్టాలని చూస్తోందని క్రాంతికి శాలిని చెప్తుంది. డాక్టర్ కు దగ్గరకు వెళ్లినప్పుడు బావ కూడా ఉన్నాడు కదా అని చెప్తుంది శాలిని.
విరాట్ ప్లాన్
ఆ డాక్టర్ టాపిక్ తీసుకొచ్చి క్రాంతిని లాక్ చేయాలని శాలిని చూస్తుందని చంద్ర చెప్తుంది. క్రాంతిని శాలిని కన్ ఫ్యూజ్ చేస్తుందని విరాట్ అంటాడు. క్లారిటీ కావాల్సిందే. డైరెక్ట్ గా అన్నయ్యను అడుగుదాం. ఈ ప్రశ్న వేస్తాడని అన్నయ్య ఊహించడు అందుకే తడబడితే అబద్దం చెప్తున్నట్లేనని క్రాంతి అంటాడు. వాడు అడిగే ప్రశ్నకు బ్యాలెన్స్ డ్ గా సమాధానం చెప్పాలని విరాట్ చంద్రతో అంటాడు.
డ్రామా సక్సెస్
వాళ్లు నోరు తెరవకముందే మూతపడేలా చేద్దామని చంద్ర అంటుంది. అప్పుడే క్రాంతి, శాలిని రావడం చూసి చంద్ర, విరాట్ డ్రామా స్టార్ట్ చేస్తారు. చంద్ర కారణంగానే క్రాంతిని హర్ట్ చేశానని విరాట్ అంటాడు. శాలినికి అబార్షన్ అయింది, అది అబద్ధమని చెప్పావని విరాట్ అంటాడు. అది విని బావ నిజంగానే మారిపోయాడని శాలిని అనుకుంటుంది.
అన్నయ్య బంగారం
మా అన్నయ్య బంగారం శాలిని అని క్రాంతి అంటాడు. అన్నదమ్ములను ఏదో ఒకటి చేయాలని శాలిని అనుకుంటుంది. మరోవైపు సరోజాను శ్రుతి ఇష్టం వచ్చిన మాటలంటుంది. కామాక్షి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంది.
నువ్వు జాగ్రత్త. వీళ్లను వదిలేసుకుని వచ్చేయ్. నిన్ను చేపల మార్కెట్ కు తీసుకెళ్లినా గల్లా పెట్టె దగ్గర కూర్చుకో. ఆస్తి కోసం వీళ్లు ఓపికగా ఉన్నారు. వాళ్లను రెచ్చగొట్టు. అమ్మాకొడుకులకు చుక్కలు చూపిమంచమని శ్రుతికి చెప్పి కామాక్షి వెళ్లిపోతుంది.
విడగొట్టాలని ప్లాన్
అన్నదమ్ములను ఎలాగైనా విడగొట్టాలని శాలిని అనుకుంటుంది. అప్పుడే కామాక్షి వస్తుంది. వాళ్లు చేసిన అప్పుకు నా నాలుగు గాజులు రెండు అయ్యాయి. వాళ్లు నన్ను నిలువు దోపిడీ చేసేవాళ్లని కామాక్షి చెప్తుంది. డబ్బులు ఇస్తే అలవాటవుతుంది. ఆ అబ్బాయి కష్టపడి సంపాదించాలని అనుకున్నప్పుడు మనం చేయాల్సిన సాయం చేద్దామని జగదీశ్వరి చెప్తుంది.
ముందు నువ్వు రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇవ్వు. నేను క్రాంతితో మాట్లాడి వస్తానని విరాట్ వెళ్తాడు. చంద్ర కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడే క్రాంతిని బ్యాడ్ చేసేలా విరాట్ ల్యాప్ టాప్ నుంచి మెయిల్ పంపించాలని ట్రై చేస్తుంది శాలిని. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


