నిన్ను కోరి డిసెంబర్ 29 ఎపిసోడ్: శోభనం జరిగినట్లు నమ్మించిన రాజ్-అత్తారింటికి శ్రుతి-ఆనందంలో ఉన్న క్రాంతికి విరాట్ హ‌గ్‌

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 29 ఎపిసోడ్ లో శ్రుతితో శోభనం జరిగినట్లు అందరినీ నమ్మిస్తాడు రాజ్. కామాక్షి, శ్యామలతో కలిసి అత్తారింటికి వెళ్లిపోతుంది శ్రుతి. మరోవైపు చంద్రపై మరో ప్లాన్ వేయాలని అనుకుంటుంది శాలిని. ముంబయి కంపెనీ ప్రాజెక్ట్ ఓకే కావడంతో క్రాంతి ఆనందంలో మునిగిపోతాడు.

Published on: Dec 29, 2025, 07:20:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 29 ఎపిసోడ్ లో సరోజా వెటకారంతో కామాక్షికి తిక్క రేగుతుంది. రాజ్ బద్ధకంగా నిద్రలేస్తాడు. శ్రుతి బెడ్ పై పడుకొని ఉంటాడు. మా మధ్య ఏం జరగొద్దని బయట తెలియొద్దని పడుకున్న శ్రుతి లిప్ స్టిక్, జుట్టును చిందర వందర చేసి బయటకు వస్తాడు రాజ్. అతణ్ని చూసి కామాక్షి కంగారు పడుతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఏం జరగలేదన్న శ్రుతి

గదిలోకి వెళ్లి శ్రుతిని నిద్ర లేపుతుంది కామాక్షి. రాత్రి ఏం జరగలేదు అమ్మ. అనుకున్నట్లు చితకబాదానని శ్రుతి చెప్తుంది. ఏం జరగకపోయినా, అన్నీ జరిగినట్లు రాజ్ నమ్మించాడని కామాక్షి చెప్తుంది. మరోవైపు రాత్రి శ్రుతి తనను చితక్కొట్టడం గురించి తల్లికి చెప్తూ బాధ పడతాడు రాజ్. ఇంత టార్చర్ ఎందుకు తట్టుకుంటున్నానో ఆలోచించు. నా టార్గెట్ అంత ఆస్తిలో వాటా. జగదీశ్వరి నమ్మేలా చేస్తేనే సక్సెస్ అవుతామని రాజ్ చెప్తాడు.

శ్రుతి అప్పగింతలు

పూజ గదిలో శ్రుతి, రాజ్ పూజ చేస్తారు. శ్రుతి అగ్గిపుల్ల వెలిగించి రాజ్ కాళ్ల మీద వేస్తుంది. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయని రాజ్ కు క్రాంతి చెప్తాడు. పద్ధతి ప్రకారం జరగాల్సినవి అన్నీ జరిగిపోయాయి. ఇక శ్రుతికి అండాదండా అన్నీ నువ్వే. నువ్వు తనను జాగ్రత్తగా చూసుకోవాలని రాజ్ కు జగదీశ్వరి చెప్తుంది. ఇప్పుడు ఈ అప్పగింతలు ఎందుకు చేస్తున్నావ్ అత్తయ్య అని శ్రుతి అడుగుతుంది.

అత్తారింటికి శ్రుతి

నువ్వు నీ భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లాలి కాబట్టి అని జగదీశ్వరి చెప్తుంది. మెడలో తాళి పడ్డాక ఏ ఆడపిల్లయినా పుట్టిళ్లు వదిలి అత్తిట్లో అడుగుపెట్టక తప్పదు శ్రుతి. నాపై ద్వేషంతో తాళి కట్టినా నేను అత్తింటికి వచ్చా. నువ్వు ప్రేమతో తాళి కట్టించుకున్నావు. కాబట్టి పుట్టింటి మీద ప్రేమను వదిలి అత్తారింట్లో కాపురం మొదలెట్టాల్సిందేనని చంద్రకళ చెప్తుంది.

మీ అందరినీ వదిలేసి వెళ్లలేను అని శ్రుతి అంటుంది. అలవాటు అయ్యే దాకా మీ అమ్మ కామాక్షిని తీసుకుని వెళ్లమని శ్యామల చెప్తుంది. నేను వెళ్లనని కామాక్షి అంటుంది. అయితే శ్యామలను కూడా వెళ్లమంటాడు రఘురాం. శ్రుతి, శ్యామల, కామాక్షి కలిసి వెళ్లేందుకు రెడీ అవుతారు. అందరికీ వెళ్లొస్తానని చెప్పి బయల్దేరతారు.

ఆనందంలో క్రాంతి

శ్రుతి పెళ్లిని అడ్డుపెట్టుకుని బావకు చంద్ర దూరం అయ్యేలా చేశా. నేను అనుకున్నది సాధించాలంటే ఫోకస్ మొత్తం చంద్రపై పెట్టాలి. కొత్త ప్లాన్ ఆలోచించాలి. పెద్ద దెబ్బ కొట్టాలని శాలిని అనుకుంటుంది. అప్పుడే శాలినికి కాల్ వస్తుంది. ముంబయి కంపెనీ నుంచి కాల్ వచ్చిందని క్రాంతిని పిలిచి చెప్తుంది. శాలిని ముంబయి కంపెనీ మనతో కొలాబరేట్ అయ్యేందుకు ఒప్పుకుందని సంతోషంతో చెప్తాడు క్రాంతి.

విరాట్ హగ్

మన కంపెనీతో టై అప్ అయ్యేందుకు ముంబయి కంపెనీ రెడీగా ఉందని చెప్పారని తల్లితో సంతోషంగా చెప్తాడు క్రాంతి. నీ కష్టం ఫలించింది. నువ్వు సక్సెస్ అయ్యావురా అని జగదీశ్వరి ఆనందపడుతుంది. ఆ వెంటనే అన్నయ్య అంటూ విరాట్ దగ్గరకు వెళ్లి, ముంబయి ప్రాజెక్ట్ మన చేతికి వచ్చిందని చెప్తాడు. విరాట్ కంగ్రాట్స్ అని చెప్పి క్రాంతిని హగ్ చేసుకుంటాడు. అది చూసి శాలినికి మండిపోతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More