Sign in

నిన్ను కోరి డిసెంబర్ 25 ఎపిసోడ్: శాలినికి చంద్ర క‌రెంట్ షాక్-భార్యను కొట్టిన విరాట్-తలకు బ్యాండేజీతో చంద్ర సూపర్ ప్లాన్

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 25 ఎపిసోడ్ లో శ్రుతి, రాజ్ పెళ్లిలో చంద్ర తప్పేం లేదని విరాట్ కు సరోజా చెప్తుంది. రూమ్ దగ్గరకు వచ్చిన శాలినికి చంద్ర షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది. జగదీశ్వరి మాటలు విని చంద్ర బాధపడుతుంది. విరాట్, చంద్ర మరో ప్లాన్ వేస్తారు. 

Published on: Dec 25, 2025, 07:36:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 25 ఎపిసోడ్ లో మా వాడితో శ్రుతి పెళ్లిలో చంద్రకళ తప్పు లేదు. మా అబ్బాయి శ్రుతిని ప్రేమించాడు. పెద్దవాళ్లు ఒప్పుకోరని గుడిలో పెళ్లి చేయించా. ఇందులో చంద్ర చేసిందేం లేదు. ఈ అమ్మాయి చాలా మంచిది. ఒక్కసారి క్షమించి చూడు అని విరాట్ కు చెప్తుంది సరోజా.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

శాలినికి షాక్

గదిలోకి వెళ్లిన విరాట్ ను సరోజాలా మాట్లాడుతూ చంద్రకళ ఆటపట్టిస్తుంది. అప్పుడే శాలిని రావడం చూసి తను ఇటువైపు రాకుండా చిన్న షాక్ ఇద్దామని చంద్ర ప్లాన్ చేస్తుంది. కరెంట్ వైర్ బయటకు పెట్టి స్విచ్ వేస్తుంది. అది చూసుకోకుండా డోర్ దగ్గరకు వచ్చిన శాలిని వైర్ మీద కాలు పెట్టడంతో షాక్ కొట్టి అరుస్తుంది. అందరూ కంగారుగా వస్తే బల్లి మీద పడితే అరిచానని కవర్ చేస్తుంది.

చంద్ర వార్నింగ్

గోడలకు అతుక్కుని తిరగకు అని జగదీశ్వరి అంటే, కరెక్ట్ గా చెప్పారని చంద్రకళ అంటుంది. లోపల ఏం మాట్లాడుకుంటున్నామో వింటున్నావా? ఆయన తిడుతుంటే నేను మౌనంగా పడుతున్నాననే కదా నీకు డౌట్ వచ్చింది. ఈ ఇంట్లో గొడవలు పెరగొద్దని మౌనంగా ఉంటున్నా. ఇంకోసారి ఇలా చేస్తే కరెంట్ వోల్టేజీ పెంచి కాళ్లు, చేతులు పడిపోయేలా చేస్తానని చంద్ర వార్నింగ్ ఇస్తుంది.

చంద్ర కోడలు మాత్రమే

జగదీశ్వరి దగ్గరకు వచ్చి పొద్దున అన్న మాటలను గుర్తు చేసుకుని శ్యామల బాధపడుతుంది. మరి చంద్రను ఎన్ని మాటలు అంటున్నారు. ఈ రోజు వ్రతం చెడిపోయేలా అడ్డుకుందనే మెచ్చుకున్నానని జగదీశ్వరి చెప్తుంది. చంద్ర నీ మేనకోడలు కాబట్టి ఇంకా ప్రేమ ఉందా? అని శ్యామల అడుగుతుంది.

మేన సంబంధం మీద ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని వల్ల ఏం చేసినా చూస్తూ ఉండలేను. విరాట్ భార్యగా మాత్రమే చంద్రను ఇంట్లో ఉండనిచ్చా. నా భర్తపై హత్యా ప్రయత్నం చేసినప్పుడే ఆ ఇంటివాళ్లతో సంబంధాలు తెగిపోయాయి. చంద్ర కేవలం నా కోడలు అంతే. తప్పు చేస్తే నిందిస్తానని జగదీశ్వరి చెప్తుంది. ఈ మాటలు విన్న చంద్ర బాధపడుతుంది.

మరో ప్లాన్

రూమ్ లోకి వెళ్లాక సీరియస్ నెస్ పెంచాలి చంద్ర అని విరాట్ అంటాడు. శాలినికి ఎందుకు నమ్మకం కలగట్లేదు? ఆమెను నమ్మించాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. అందుకే ఆలోచిస్తున్నానని విరాట్ అంటాడు. నువ్వు నన్ను కొట్టాలి బావ అని చంద్ర అంటుంది. నువ్వు నన్ను కొట్టినట్లు అందరినీ నమ్మించాలని చెప్తుంది.

పొద్దున తలకు బ్యాండేజీతో మామయ్య ముందుకు వెళ్తా. నువ్వు కొట్టావని చెప్తా. అప్పుడు మామయ్య పిలిచి తిడతారని చంద్ర అంటుంది. ఇప్పుడు కాస్త రొమాన్స్ కావాలని విరాట్ అడిగితే, షాక్ ట్రీట్మెంట్ ఇస్తానని చంద్ర అంటుంది.

రఘురాం సీరియస్

పొద్దున తలకు బ్యాండేజీతో రఘురాం, జగదీశ్వరి ముందుకు వెళ్తుంది చంద్ర. ఏమైందంటే? రాత్రి మీ అబ్బాయి నన్ను కొట్టాడని చంద్ర చెప్తుంది. రఘురాం కోపంగా విరాట్ ను పిలుస్తాడు. నాకు ఎదురు తిరిగింది కాబట్టి కొట్టానని విరాట్ చెప్తాడు. భార్యను ప్రేమతో గెలవాలి కానీ కోపంతో కాదు. చంద్రకు సారీ చెప్పమని రఘురాం అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More