నిన్ను కోరి డిసెంబర్ 24 ఎపిసోడ్: శ్రుతి ప్లాన్ బయటపెట్టిన చంద్రకళ- పని చేయని విరాట్ ట్రాప్- నాటకం బయటపెడతానన్న శాలిని
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 24 ఎపిసోడ్‌లో జలరాజ్ కొబ్బరికాయ కొడితే ఎర్రనీళ్లు వస్తాయి. కామాక్షి డ్రామా చేస్తే అదంతా వాళ్ల ప్లాన్ అని నిజం బయటపెడుతుంది చంద్రకళ. శ్రుతిని ఫస్ట్ నైట్‌కు ఒప్పిస్తుంది జగదీశ్వరి. తల్లి చాలా డీప్‌గా ఆలోచిస్తుందని క్రాంతి చెప్తే విరాట్ వెళ్లి తను అలా ఆలోచించలేదని అంటాడు.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి ప్లాన్ ప్రకారం రాజ్ కొట్టిన కొబ్బరికాయలో ఎర్ర నీళ్లు వస్తాయి. అది చూసి అంతా షాక్ అవుతారు. కామాక్షి, శ్రుతి డ్రామా చేస్తారు. నీతో వ్రతం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని కామాక్షి అంటుంది. దేవుడిగా మీకు ఇష్టం లేదా. ఇదంతా కామాక్షి, శ్రుతి డ్రామా ఆడుతున్నారు అని చంద్రకళ అంటుంది.

వెయ్యి రూపాయలు ఇచ్చి
శ్రుతి మాట్లాడిన వ్యక్తిని తీసుకొచ్చి చంద్రకళ నిజం చెప్పమంటుంది. తనకు వెయ్యి రూపాయలు ఇచ్చి కెమికల్ కలుపుమన్నది చెబుతాడు. కానీ, ఇదంతా చంద్రకళే కావాలని ప్లాన్ చేసిందని కామాక్షి, శ్రుతి అంటారు. మళ్లీ అంతా చంద్రకళనే నిందిస్తారు. అసలు ఈ విషయం ముందు తెలిసింది మావయ్య గారికే. ఆయనే నాకు చెప్పారని చంద్రకళ అంటుంది.
కొబ్బరికాయ కొట్టిన సౌండ్‌కు మర్చిపోయిన రఘురాం నాకు గుర్తు లేదు అని అంటాడు. అన్నయ్య మతిమరుపును అడ్డం పెట్టుకుని ఇంకెన్ని నాటకాలు ఆడతావ్ అని కామాక్షి అంటుంది. చంద్ర చెప్పిందంటే నిజమే అయింటుంది. అసలు ఇది ఏం వ్రతం అని రఘురాం అడుగుతాడు. ఎందుకు చంద్ర వ్రతాన్ని ఆపాలని చూస్తున్నావ్ అని శ్యామల అంటుంది.
ఇదంతా వీడు చెబుతాడు అని శ్రుతి మాట్లాడిన వ్యక్తిని నాలుగు కొడతాడు విరాట్. దాంతో శ్రుతినే చేయించిందని అతను నిజం చెబుతాడు. చంద్రకు భయపడి అబద్ధం చెబుతున్నావుగా అని గట్టిగా నిలదీస్తాడు అని విరాట్. లేదు ఈవిడకు ఏం సంబంధం లేదు అని అతను చెబుతాడు. అంతా శ్రుతిని అంటారు. నాకు ఇష్టం లేదు పెళ్లి అని శ్రుతి అంటుంది.
కాపురం చేయాల్సింది నువ్వే
అది ముందు ఆలోచించాలి అని జగదీశ్వరి అంటుంది. దాంతో వ్రతం జరుగుతుంది. కాపురం చేయాల్సింది నువ్వే. తర్వాతి కార్యం నీ ఇష్టంతోనే చేస్తాం. నేను చెప్పేది నీ మంచికే అనుకుంటే జలరాజ్‌ను భర్తగా అంగీకరించి కాపురం చేయి. తనకు నీ మీద చాలా ప్రేమ ఉందని, జలరాజ్‌ను క్షమించు అని జగదీశ్వరి అంటుంది. సరే అత్తయ్య నీ మాట నేను కాదనను అని శ్రుతి అంటుంది.
దాంతో కామాక్షి షాక్ అవుతుంది. ఆ శాంతి ముహుర్తం కూడా చెప్పండి అని జగదీశ్వరి అంటే పంతులు రేపు ఉందంటాడు. మరోవైపు అత్తయ్యను నమ్మించడానికి అలా చెప్పాను. ఆ జలరాజ్ గాడి నిజ స్వరూపం చూపిస్తా అని శ్రుతి అంటుంది. మరోవైపు చంద్రకళను కామాక్షి, శ్యామల నిందిస్తారు. ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా.. ఇంకోసారి మా అన్నయ్య మతిమరుపు వాడుకుని ఇలా చేస్తే అని శ్యామల అంటుండగా.. జగదీశ్వరి వచ్చి ఆపుతుంది.
ఎందుకు చంద్రను ఆడిపోసుకుంటున్నారు. తను చేసింది మంచి పనేగా. తప్పు చేసింది శ్రుతి. వ్రతం ఆపకుండా నాలా ఆలోచించింది. చంద్ర నువ్వు గొప్ప పని చేశావ్. ఏమన్నా పట్టించుకోకు. శ్రుతి పెళ్లి తర్వాత తంతు గురించి చూడండి అని జగదీశ్వరి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు జలరాజ్ ఎలాంటి వాడో తెలియకుండా ఫస్ట్ నైట్ జరిపించడం ఎలా అని శాలిని అంటుంది.
చాలా డీప్‌గా ఆలోచించే
ఇక శ్రుతే తనను మార్చుకోవాలని శ్యామల వెళ్లిపోతుంది. అమ్మ చాలా డీప్‌గా ఆలోచించే నిర్ణయం తీసుకుంది. మోసంతో పెళ్లి చేసుకున్న ఎక్కడ ఓ చోట ప్రేమ ఉందని అమ్మ నమ్ముతుందని శాలినితో క్రాంతి అంటాడు. ఆ మాటలు విన్న విరాట్ నువ్వు చెప్పాక నా అభిప్రాయం తప్పు అని తెలిసిందని విరాట్ అంటాడు. నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని క్రాంతి వెళ్లిపోతాడు.
క్రాంతిని ట్రాప్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ, మీ నాటకం ఇవాళ రాత్రి లోపు నేను బయటపెడతాగా అని శాలిని అనుకుని వెళ్లిపోతుంది. విరాట్ దగ్గరికి వచ్చి జలరాజ్ తల్లి వచ్చి శ్రుతి పెళ్లి జరగడంలో చంద్రకళ తప్పు లేదని చెబుతుంది.
తర్వాత చంద్ర అంటే నీకు ఇష్టం కదా అని జగదీశ్వరిని అడుగుతుంది శ్యామల. లేదు చంద్ర కేవలం నా కోడలు అంతే అని జగదీశ్వరి అంటుంది. ఆ మాటలు విన్న చంద్రకళ షాక్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


