నిన్ను కోరి డిసెంబర్ 26 ఎపిసోడ్: చంద్ర ప్లాన్ సక్సెస్-విరాట్‌ను నమ్ముతున్న క్రాంతి, శాలిని-రాజ్ నిజం-శోభనం ఏర్పాట్లు
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 26 ఎపిసోడ్ లో చంద్రపై కోపం ఉన్నట్లు విరాట్ యాక్ట్ చేస్తాడు. శ్రుతికి ఆస్తి లేదని సరోజా, రాజ్ తెలుసుకుంటారు. అన్నయ్య మారిపోయాడని క్రాంతి నమ్ముతాడు. శాలిని కూడా చంద్ర ఒంటరిది అయిందని అనుకుంటుంది. రాజ్, శ్రుతి శోభనం ఏర్పాట్లు చేస్తారు.
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 26 ఎపిసోడ్ లో రఘురాం చెప్పినా చంద్రకు సారీ చెప్పనని విరాట్ అంటాడు. ఈ ఇంట్లో ఇంతవరకూ ఏ మగాడు చేయని పొరపాటు నువ్వు చేశావని రఘురాం అంటాడు. శాలిని క్రాంతితో ప్రేమగా ఉంటుంది. అందుకే వాడికి కొట్టే అవసరం రాలేదు. నా మాట విని బుద్ధిగా ఉండాలని విరాట్ అంటాడు. ఇంకోసారి నువ్వు అలా ప్రవర్తిస్తే మాక్కూడా బాధ కలుగుతుందని రఘురాం లోపలికి వెళ్లిపోతాడు.

ప్రెగ్నెంట్ అవుతే
అందరూ వెళ్లాక విరాట్, చంద్రకళ నవ్వుతూ హైఫై ఇచ్చుకుంటారు. మరోవైపు కార్యం క్యాన్సిల్ అని మీ అత్త అంటుందని రాజ్ తో సరోజా అంటుంది. శ్రుతి ఒప్పుకుంది కాబట్టి ఏం ఇబ్బంది లేదని రాజ్ చెప్తాడు. శ్రుతి ప్రెగ్నెంట్ అవుతే ఆమె ఆస్తి మొత్తం నీదేనని రాజ్ కు చెప్తుంది తల్లి. మరోవైపు కామాక్షి, శ్రుతిని పిలిచి ఈ నెల పాకెట్ మనీ అని డబ్బులు ఇస్తుంది చంద్ర.
రాజ్ కు తెలిసిన నిజం
మీలా దిక్కు లేక తల దాచుకోవడం లేదని కామాక్షి, శ్రుతితో చంద్ర అన్న మాటలను రాజ్, సరోజా వింటారు. నా పాకెట్ మనీ ఏదీ అని శ్రుతి అడిగితే, అది నీ భర్తను అడుక్కో. నీకు పెళ్లి అయిందని చంద్ర అంటుంది. ఈ మాటలు విని రాజ్, సరోజా షాక్ అవుతారు. నీకు ఆస్తి ఉందని అతను, అతనికి ఉందని నువ్వు ఆదర్శ దంపతులు అని చంద్ర సెటైర్ వేస్తుంది. కొంప ముంచావురా అని రాజ్ పై సీరియస్ అవుతుంది సరోజా. పెళ్లి క్యాన్సిల్ అని వెళ్లిపోదామంటుంది. శ్రుతిని ప్రేమగా చూసుకుంటే ఆస్తి వస్తుందమ్మా అని రాజ్ చెప్తాడు.
మారిన క్రాంతి
నిన్ను అందరి ముందు అవమానిస్తున్నందుకు సారీ చంద్ర. ఇలా ఎన్ని రోజులో తెలియదు. మిగతా వాళ్లకు నువ్వు దూరమవాల్సి వస్తుందని విరాట్ ఫీల్ అవుతాడు. మనం గొడవ పడే విషయంలో నీకు, మామయ్యకు దూరం పెంచుతున్నానేమో అనిపిస్తుందని చంద్ర అంటుంది. వదిన విషయంలో అన్నయ్యకు క్లారిటీ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నానని శాలినితో క్రాంతి అంటాడు. నేను కూడా నమ్ముతున్నానని శాలిని చెప్తుంది. ఆ మాటలు విని విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. చంద్రను ఒంటరిదాన్ని చేశానని శాలిని అనుకుంటుంది.
విరాట్, చంద్ర రొమాన్స్
శ్రుతి, రాజ్ ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు చేస్తున్న చంద్ర దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటాడు విరాట్. క్రాంతికి నా మీద ఉన్న నెగెటివ్ ఫీలింగ్ పోయిందని చెప్తూ విరాట్ హ్యాపీగా ఫీలవుతూ చంద్రను దగ్గరకు లాక్కుంటాడు. చంద్రను ముద్దు పెట్టుకోవాలనుకుంటాడు. ఎత్తుకుని బెడ్ మీద వేయబోతుంటే జగదీశ్వరి వస్తుంది. అప్పుడే మళ్లీ కోపంగా ఉన్నట్లు నటిస్తారు.
చంద్ర, శాలిని కలిసి ఫస్ట్ నైట్ కోసం శ్రుతిని రెడీ చేస్తారు. ఏంటీ కంగారుగా ఉందా? అని జగదీశ్వరి అడుగుతుంది. మోసం చేయాలనుకోవాలంటే డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవాడు. కానీ గుడిలో పెళ్లి జరిగింది. ప్రేమతో ఉండండని జగదీశ్వరి అంటే, సరేనని శ్రుతి చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


