నిన్ను కోరి అక్టోబర్ 14 ఎపిసోడ్: 6 నెలల్లో చనిపోనున్న తేజు-నాన్న ఇదే లాస్ట్ విష్-అర్జున్ ఫుల్ ఎమోషనల్-విరాట్ ఫైర్
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 14 ఎపిసోడ్ లో తేజుకు ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్తుంది. మరో 6 నెలల కంటే ఎక్కువ రోజులు బతకదని అంటుంది. నాన్న మమ్మీని చూడాలని ఉందని అర్జున్ ను లాస్ట్ విష్ కోరుతుంది తేజు. మరోవైపు హాస్పిటల్ రిపోర్ట్స్ మారిపోవడంతో విరాట్ ఫైర్ అవుతాడు.
నిన్ను కోరి టుడే అక్టోబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో తేజు కోలుకుంటుందో లేదో తెలియదు అంటూ అర్జున్ బాధ పడతాడు. అప్పుడే రిపోర్ట్స్ వస్తాయి. తేజు బయటకు వస్తుంది. రిపోర్ట్స్ చూసి డాక్టర్ కంగారు పడుతుంది. బాడీలో ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. మెడిసిన్ తో ఇది తగ్గదు. పాప ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ లేదు. మ్యాక్సిమమ్ ఆరు నెలలు అంతే అని డాక్టర్ చెప్తుంది.

విరాట్ ఫైర్
మరోవైపు హాస్పిటల్ స్టాఫ్ పై విరాట్ ఫైర్ అవుతాడు. ఇంత నిర్లక్ష్యంగా రిపోర్ట్స్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తాడు. మా నాన్న బదులు ఇంకెవరి రిపోర్టో ఇచ్చారు. దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇచ్చారని మండిపడతాడు. కంజ్యూమర్ కోర్టులో కేసు వేస్తానంటాడు. ఇప్పుడే చెక్ చేసి చెప్తామని హాస్పిటల్ మేనేజ్ మెంట్ చెప్తారు. ఒరిజినల్ రిపోర్ట్ ఇచ్చి పంపిస్తారు.
రాజ్ కు శ్రుతి ప్రశ్నలు
నార్మల్ కార్లో రాజ్ ను చూసి శ్రుతి నానా ప్రశ్నలు అడుగుతుంది. ఫస్ట్ టైమ్ కొన్న సెంటిమెంట్ కారు అని అబద్దాలు చెప్తాడు రాజ్. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పావ్ కదా అని అడుగుతుంది శ్రుతి. నాదని చెప్పుకోవడానికి ఓ కారు ఉండాలి కదా అని అంటాడు రాజ్. చాలా సింపుల్ గా ఉన్నావ్, చాలా నచ్చేశావని శ్రుతి అంటుంది. క్యాపచినో అంటే కాఫీ అని కూడా తెలియని రాజ్ కవర్ చేస్తాడు.
బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కాఫీ, మరి క్యాపచినోకు క్యాప్ ఉండాలి కదా అని అంటాడు రాజ్. మళ్లీ జోక్ చేశానని కవర్ చేస్తాడు. బిల్ చూసి షాక్ అవుతాడు రాజ్. నేను పే చేస్తానని శ్రుతి అనేసరికి రిలాక్స్ అవుతాడు. మరోవైపు ఆఫీస్ వర్క్ చూసుకోండని చంద్రకళకు ఫోన్ చేసి చెప్తాడు అర్జున్.
లాస్ట్ విష్
నేనంటే నీక్కూడా ఇష్టం లేదు నాన్న అని తేజు అంటుంది. తేజు నువ్వు నా ప్రాణం రా అని హగ్ చేసుకుంటాడు అర్జున్. నీపై ఎవరైన జాలి చూపించడం నాకిష్టం లేదు. అందరు నీ దగ్గరకు రావడం నీకు మంచిది కాదు. నువ్వు పూర్తిగా కోలుకోవడం వరకు జాగ్రత్తగా ఉండాలని సెపరేట్ గా ఉంచుతున్నానని అర్జున్ అంటాడు. నాన్న లాస్ట్ విష్ అడుగుతాను. నేను సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ బతకనని డాక్టర్ ఆంటీ చెప్పింది విన్నా. నీకు, మమ్మీకి దూరంగా ఉండటం కన్నా దేవుడి దగ్గరకు వెళ్లిపోవడం బెటర్ అని తేజు అంటుంది.
అమ్మ ఫారెన్ లో ఉంది. రావడం కుదరదంటాడు అర్జున్. ఒక్కసారి అమ్మను చూడాలనుంది. ఇదే నా లాస్ట్ విష్. అమ్మను తీసుకు రా నాన్న ప్లీజ్ అని తేజు అడుగుతుంది. మరోవైపు కిచెన్ లో కామాక్షి, శ్రుతి చేయి కాల్చుకుంటారు. రాజ్ ను రజిని అంటూ కవర్ చేసి చెప్తుంది శ్రుతి. విరాట్ తో క్లోజ్ గా మూవ్ అవాలని కామాక్షి చెప్తుండగా చంద్రకళ వస్తుంది.
చంద్ర క్లాస్
బావ నన్ను ద్వేషించినప్పుడే నీకు కాకుండా నాకు తాళి కట్టాడు. ఇప్పుడు ప్రేమిస్తున్నప్పుడు నన్ను ఎలా మర్చిపోతాడు? అలాంటిది నీ మీద ప్రేమ చూపిస్తాడని ఎలా అనుకుంటున్నావు? అయినా పెళ్లి అయినవాడి వెనకాల పడటం ఏంటీ? నీకు చదువు, అందం ఉంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవచ్చని శ్రుతితో చంద్ర చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












