నిన్ను కోరి జనవరి 1 ఎపిసోడ్: శాలినికి ఝలక్ ఇచ్చిన చంద్ర- విరాట్‌పై అనుమానం- ఫాలో అయిన శాలినికి అర్జున్ వార్నింగ్
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 1 ఎపిసోడ్ లో శాలిని గుంట నక్క వేషాలు తెలుసుకుంటుంది చంద్రకళ. అందుకే మెయిల్ వెళ్లకుండా బ్లాక్ చేస్తుంది. కానీ విరాట్ పై అనుమానం వచ్చి శాలిని ఫాలో అవుతుంది. అక్కడ శాలినికి అర్జున్ వార్నింగ్ ఇస్తాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 1 ఎపిసోడ్ లో విరాట్ మెయిల్ నుంచి క్రాంతి గురించి తప్పుగా పంపిద్దామని శాలిని అనుకుంటే మెయిల్ సెండ్ కాదు. అప్పుడే చంద్ర వస్తుంది. కొంచెం కూడా బుద్ధి లేదు. ఒకసారి ఇలాగే క్రాంతి సక్సెస్ ను లాక్కున్నావని చంద్ర అంటుంది. నా టార్గెట్ రీచ్ అవడానికి ఏదైనా చేస్తానని శాలిని చెప్తుంది.

గుంటనక్క వేషాలు
నిజంగా క్రాంతి మీద ప్రేమ ఉంటే అతను ఎదగాలని కోరుకోవాలి. కానీ ఇలా చేస్తున్నావేంటీ? అని చంద్రకళ సీరియస్ అవుతుంది. నువ్వు క్రాంతికి చెప్పినా నింద నాపై వేస్తున్నావని నమ్మించగలను. అన్నదమ్ములు కలిశారని సంబరపడిపోతున్నావేమో. అది జరగనివ్వనని శాలిని అంటుంది. నీ గుంట నక్క వేషాలు తెలిసే ముంబయి కంపెనీకి నా మెయిల్ నుంచి కానీ, బావ మెయిల్ నుంచి కానీ మెయిల్ వెళ్లకుండా బ్లాక్ చేశానని చంద్ర షాక్ ఇస్తుంది.
శాలినికిి డౌట్
మరోవైపు రెస్టారెంట్లో శ్రుతి లాగిస్తుంది. అది చూసి రాజ్ కంగారు పడతాడు. బేబీ నీ మీద ప్రేమ ఉంది కాబట్టే అప్పు తీసుకొచ్చి మరి తినిపిస్తున్నానని రాజ్ అంటాడు. అదే రెస్టారెంట్ కు చంద్ర వస్తుంది. అప్పుడే అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే శాలినికి కాల్ చేసి ఫోన్ ఇవ్వమంటుంది. అప్పుడే చంద్రను చూసిన శ్రుతి, శాలినికి అదే విషయాన్ని చెప్తుంది. దీంతో శాలినికి డౌట్ వస్తుంది. విరాట్ కు ఫోన్ చేసి త్వరగా రమ్మంటుంది చంద్ర.
వీడియో రికార్డింగ్
విరాట్ ను ఫాలో అవుతుంది శాలిని. శ్రుతి, రాజ్ కలిసి చంద్ర దగ్గరకు వెళ్తారు. చంద్ర కంగారు పడుతుంది. శ్రుతిని బాగా చూసుకుంటున్నా వదిన అని రాజ్ చెప్తాడు. క్లయింట్ ను కలిసి వెళ్తానని చంద్ర చెప్తుంది. ఆమె వచ్చే వరకు కంపెనీ ఇస్తామని శ్రుతి, రాజ్ అక్కడే కూర్చుంటారు. విరాట్ ను ఫాలో అవుతూ వచ్చిన శాలిని, మీ నాటకం క్రాంతి ముందు బయటపెడతానని వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది.
అర్జున్ వార్నింగ్
కానీ విరాట్ కు మరో కాల్ రావడంతో వెళ్లిపోతాడు. మరోవైపు సరేనని శ్రుతి, రాజ్ వెళ్లిపోతారు. బయటకు వెళ్లబోతున్న శాలిని ముందుకు అర్జున్ వస్తాడు. ఇంకా దొంగచాటు వ్యవహారాలు మానలేదా? ఇంకా చంద్రపై స్పై మానలేదా? ఇంకా కుట్రలు చేయాలని చూస్తున్నావా? సీక్రెట్ గా ఫాలో చేస్తున్న విషయం చంద్రకు చెప్పమంటారా? ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను క్షమించనని అర్జున్ వార్నింగ్ ఇస్తాడు. శాలికి వెళ్లిపోతుంది.
అర్జున్ ను చూసి సర్ ప్రైజ్ అవుతుంది చంద్ర. మీ తోడి కోడలు శాలిని మిమ్మల్ని సీక్రెట్ గా ఫాలో అవుతుందని అర్జున్ అంటాడు. అసలు ఏమైందో అర్జున్ కు చెప్తుంది చంద్ర. ఇంటికి వచ్చాక బావ నువ్వు రెస్టారెంట్ కు రాకపోవడం మంచిదైందని చంద్ర అంటుంది. శాలిని వచ్చిందనే నేను బయటకు వచ్చేశానని విరాట్ చెప్తాడు. మనం కలుసుకోవడం రికార్డు చేయాలని శాలిని ప్లాన్ చేసిందంటాడు. మనం దొరక్కూడదని చంద్ర అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


