మంగళగిరి ఎయిమ్స్‌లో 97 ఉద్యోగ ఖాళీలు - కేవలం ఇంటర్వ్యూనే, దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!
ఏపీ మంగళగిరిలోని ఎయిమ్స్ లో 97 సీనియర్ రెసిడెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో(అక్టోబర్ 21) పూర్తి కానుంది.
ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 97 ఉద్యోగాలున్నాయి. మొత్తం 37 విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్‌వై) కింద ఈ పోస్టులను మూడేళ్ల కాల పరిమితితో భర్తీ చేస్తారు.

ప్రస్తుతం ఈ పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి…
దరఖాస్తు విధానం ఇలా….
- అభ్యర్థులు ముందుగా https://www.aiimsmangalagiri.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో రిక్రూట్ మెంట్ సెక్షన్ లోని Vacancies ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ కనిపించే సీనియర్ రెసిడెంట్ ఆప్షన్ ఉంటుంది..చివర్లో ఉండే అప్లయ్ నౌ ఆప్షన్ పై నొక్కాలి.
- మీ వివరాలను నమోదు చేసి చివరగా సబ్మిట్ చేయటంతో ప్రాసెస్ పూర్తవుతుంది.
- మీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డీఎన్‌బీ, ఎంఎఎస్సీ, ఎంఎస్, ఎండీ, ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,500 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1,000. అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. దరఖాస్తుదారుడి వయసు 2025 అక్టోబర్ 21వ తేదీ నాటికి 45 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 - రూ.67,700 మధ్య జీతం చెల్లిస్తారు.
దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. రాత పరీక్ష లేకుండా నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. అక్టోబర్ 24, 25, 28 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఏపీ చిరునామాలో ఈ ఇంటర్వ్యూలుంటాయి. సంబంధిత పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

